యూదుమతస్తులకు ప్రశ్నలు-3

(1) దేవుడు చేసిన నోవహునిబంధన (Noahic-Covenant) సర్వశరీరులతో చేసాడని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి (ఆది.కాం.9:1-17). కనుక, నోవహునిబంధన మరియు దాని నియమాలు (ధర్మశాస్త్రము/law)  సర్వశరీరులకు వర్తిస్తాయి. 

దేవుడు చేసిన మోషేనిబంధన (Mosaic-Covenant) మరియు దాని నియమాలు (మోషేధర్మశాస్త్రము/The Law of Moses) సర్వశరీరులకు లేక సర్వమానవులకు వర్తిస్తాయని నమ్మడానికి మోషేనిబంధన సర్వమానవులతో చేసినట్లు బైబిలులో, పాత నిబంధన గ్రంథములోగాని లేక క్రొత్త నిబంధన గ్రంథములోగాని, యెక్కడుంది?

(2) దేవుడు మోషేద్వారా ఇశ్రాయేలీయులతో నిబంధనచేసి (Mosaic-Covenant) ఆ నిబంధనకు సంబందించిన నియమాలను ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రముగా అంటే మోషేధర్మశాస్త్రముగా (The Law of Moses) అందించాడు. దాన్ని సంపూర్ణంగా ఇశ్రాయేలీయులు అందరూ అనుసరించాలి అని దేవుడు పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లో ఆజ్ఙాపించాడు (ని.కాం.19:3-6, 24:3-8; ద్వితీ.కాం.4:7-8, 5:1-5, 29:1; మలాకి 4:4; రోమా.2:11-12, 3:19, 9:4; ఎఫెసీ. 2:11-12; హెబ్రీ.8:9). దాన్నిబట్టి ఇశ్రాయేలీయులందరూ మోషేధర్మశాస్త్రాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.  

అదేవిధంగా అన్యులుకూడా మోషేధర్మశాస్త్రాన్ని అనుసరించే ప్రయత్నం చేయడానికి దేవుడు పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లో  అన్యులందరూ లేక మానవులందరూ మోషేధర్మశాస్త్రాన్ని పాటించాలి అని పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లో దేవుడు యెక్కడ ఆజ్ఙాపించాడు?

(3)  దేవుడు అబ్రహామునిబంధనను అబ్రహాముతో మరియు ఆయన సంతానముతో చేసి దానికి గుర్తుగా అబ్రహాము, ఆసమయములో ఆయనతో వున్నవారు (దాసులు, పనివారు, కుటుంబస్తులు), మరియు ఆయన సంతానము సున్నతి చేసుకోవాలని నియమము (ధర్మశాస్త్రము) యిచ్చాడు. దాన్నిబట్టి అబ్రహాము, అబ్రహాము యింటనున్నవారు అలాగే ఆయన సంతానముగా పుట్టే వారందరూ సున్నతి పొందాలి. ఇది దేవుడు తన లేఖనాలలో ప్రకటించిన సత్యం (ఆది.కాం.12:1-3, 15:1-21, 17:1-21). 

ఇశ్రాయేలీయులకువెలుపల నివసించే అన్యులెవరైనాసరే అలాగే యూదామతాన్ని స్వీకరించిన అన్యులెవరైనాసరే సున్నతిపొందాలంటూ దేవుడు పాత నిబంధన (తనాఖ్) లో ఎక్కడైనా ఆజ్ఙాపించాడా లేక సూచించాడా? అన్యులలోనుండి ఇశ్రాయేలీయుల దేవున్ని విశ్వసించినవారు ఎవరైనా సున్నతి పొందినట్లు పాతనిబంధన గ్రంథములో ఎక్కడైనా వున్నదా? వుంటే రెఫరెన్సు యివ్వండి.  

అలా దేవుడు ఆజ్ఙాపించకపోతే అన్యులలోనుండి యూదామతాన్ని స్వీకరించి మోషేధర్మశాస్త్రమును అనుసరిస్తున్నవారు ఎందుచేత దేవుని మాటలకు వేరుగా మరియు వ్యతిరేకముగా సున్నతిపొందుతున్నారు? 

(4) యిర్మీయ 31:31-34 ప్రకారము దేవుడు క్రొత్త నిబంధనను చేయబోతున్నట్లు అందునా ఐగుప్తులోనుండి ఇశ్రాయేలీయులను బయటికి రప్పించిన సందర్భములో తాను వారితో చేసిన నిబంధనవంటిది కాదు ఈ క్రొత్తనిబంధన అని దేవుడే విస్పష్టముగా ప్రకటించాడు వాగ్ధానము చేసాడు. కనుక, చేయబోతున్నది క్రొత్త నిబంధన అయితే అదివరకేవున్న వుండిన నిబంధన పాత నిబంధన అవ్వాలి. 

ఈ సందర్భములో యేనిబంధనను పాత నిబంధన అని మనం లెక్కించాల్సి వస్తుంది? అలాగే ఆ పాతనిబంధనలో భాగంగా వున్న నియమాలు (ధర్మశాస్త్రము) కూడా పాత ధర్మశాస్త్రముగా మారిపోతాయి, కాదా? 

(5) ఈనాడు మోషేధర్మశాస్త్రము ప్రకారము జీవిస్తున్నాము అన్న భ్రమలో మీరు జీవిస్తూ వుంటే ఈవిశయము అలోచించండి: 

మోషేధర్మశాస్త్రము ప్రకారము బల్యర్పణలులేకుండానే పాపక్షమాపణ పొందటము సాధ్యమైతే మరి మోషేధర్మశాస్త్రములో ప్రత్యేకంగా బలులునైవేద్యాలు ఎందుచేత పాపక్షమాపణకు నిర్దేశించబడ్డాయి (లేవీ.కాం.6:1-7; సం.కాం.5:5-8)? మోషే సమయములోకూడా బలులు నైవేధ్యాలు ఏవీలేకుండానే దేవుడు పాపక్షమాపణ అనుగ్రహించవచ్చు కదా! మరి అలాగేందుకు జరగలేదు? 

(6)  బలులనర్పించడముద్వారా చేసిన పాపాలకు క్షమాపణ పొందగలరని దేవుడు మోషేధర్మశాస్త్రములో స్పష్టముగా వివరించాడు (లేవీ.కాం.6:1-7; సం.కాం.5:5-8). అదే సమయములో బలులతోపాటు పశ్చత్తాపము మారుమనస్సు అన్నవికూడా పొందాలి. అందుకే దావీదు బలులర్పిస్తున్నా విరిగినలిగిన హృదయముతో మారుమనస్సు పశ్చత్తాపము పొందడముద్వారానే పాపక్షమాపణ పొందినట్లు గ్రహించగలము (కీర్తన.51). 

మోషేధర్మశాస్త్రమును అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటూ దానిక్రింద జీవిస్తున్న యూదామతస్తులు తమ పాపాలకు క్షమాపణను పొందేందుకు యిప్పుడు పాత నిబంధన గ్రంథము (తనాఖ్) ప్రకారము యేబల్యర్పణలను, యేవిధంగా, యెక్కడ అర్పిస్తున్నారు?

ఒకవేల “దేవాలయము లేదు కాబట్టి మేము బలులను అర్పించడములేదు” అని చెప్పదలచుకుంటే, ముందు దయచేసి ఈవిశయము చెప్పండి, “ఒకవేల దేవాలయముకాని దేవుని గుడారముకాని లేనిపక్షాన బలులను అర్పించనవసరములేదు” అని ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాత నిబంధన గ్రంథములో (తనాఖ్) లో దేవుడు యెక్కడ సూచించాడు?

ఒకవేళ “బబులోను చెరలో వున్నప్పుడు యూదులు కేవళము ప్రార్థించారు కాని బలులను అర్పించలేదు కనుక మేము అర్పించము” అని చెప్పదలచుకుంటే దయచేసి ముందు ఈవిశయము ఆలోచించండి: బబులోను చెరలోని యూదులకు స్వాతంత్ర్యము లేదు. వారి ఇచ్ఛకు వ్యతిరేకంగా వారిని దూరదేశాలకు బానిసత్వముక్రింద జీవింపచేసేందుకు తీసుకువెల్లబడ్డారు. కనుక వారు మోషేధర్మశాస్త్రము ప్రకారము దేవునికి బలులను అర్పించే స్థితిలో లేరు. మీ పరిస్థితి వారి పరిస్థితిలా లేదు. కాబట్టి బలులను అర్పించే విశయములో మీకు వారితో పోల్చుకునే అర్హత లేదు, అయినా వారితో మిమ్మలను మీరు యెలా పోల్చుకోగలుగుతున్నారు?

ఒకవేల “బబులోను చెరలో వున్నప్పుడు యూదులు కేవళము ప్రార్థించారు కాని బలులను అర్పించలేదు కనుక మేము అర్పించము” అని చెప్పదలచుకుంటే దయచేసి ముందు ఈవిశయము స్పష్టపరచండి: బబులోను చెరలో వుండిన యూదులలోని ప్రవక్తలు దేవునికి ప్రార్థన చేసారు దేవున్ని ఆరాధించారు. అది వారు దేవుని చేత యెన్నుకోబడి అభిషేకించబడ్డారు కనుక వారి ప్రార్థనలు ఆరాధనలు దేవుని యెదుట ఆమోదాన్ని పొందాయని గ్రహించగలము. మరి, మామూలు యూదులు కూడా దేవునికి ప్రార్థించగా ఆరాధించగా దేవుడు దాన్ని ఆమోదించి వారి పాపాలను క్షమించినట్లు పాత నిబంధన గ్రంథములో (తనాఖ్) లో యేక్కడవుంది?

ఒకవేల “బబులోను చెరలో వున్నప్పుడు ప్రవక్తలు బలులను అర్పించకుండానే దేవునికి పాపక్షమాపణకై ప్రార్థించారు కనుక అదేవిధంగా మేమూ మాపాపాల క్షమాపణకై దేవునికి బలులను అర్పించకుండానే ప్రార్థిస్తాము” అని చెప్పదలచుకుంటే, దయచేసి పాత నిబంధన గ్రంథములో (తనాఖ్) లో యెక్కడ దేవుడు పాపక్షమాపణకై వారు చేసిన ప్రార్థనలను అంగీకరించి వారి పాపాలను క్షమించాడో చూపించండి?

(7) మోషేధర్మశాస్త్రాన్ని అందుకున్న వ్యక్తులు (ఇశ్రాయేలీయులు) అలాగే యూదామతాన్ని స్వీకరించిన వ్యక్తులు (అన్యులు) మోషేధర్మశాస్త్రానికి లోబడి అందులోని విధులన్నింటిని పాటించాలి. ఒకవేళ వాటిని పాటించే విశయములో తప్పిపోతే (ఒక్కసారి తప్పినా సరే) శాపగ్రస్తులవుతారు అని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి (ద్వి.కాం.27:26; గలతీ.3:10; యాకోబు 2:10-11). 

దేవుడు సెలవిచ్చిన ఈ సత్యాన్నిబట్టి యూదామతాన్ని పుచ్చుకొన్న లేక పుచ్చుకొంటున్న నీవు మోషేధర్మశాస్త్రాన్ని యెన్నోసార్లు తప్పిపోయి శాపగ్రస్తునిగా లేక శాపగ్రస్తురాలివిగా మారినట్లు కాదా? శాపగ్రస్తునివి లేక శాపగ్రస్తురాలివి అయితే ఆస్థితినుంచి పాత నిబంధన గ్రంథము (తనాఖ్) ప్రకారము యేవిధంగా బయటపడగలవు?

(8) యూదామతాన్ని స్వీకరించి యూదులు కానున్నా యూదులమంటూ చెప్పుకొంటున్న లేక వూహించుకొంటున్న వారిలో నీవూవుంటే దయచేసి గమనించండి: పాత నిబంధనను అనుసరిస్తున్న యూదులు మోషేధర్మశాస్త్రములోని ఆజ్ఙలను అనుసరించాలి. మోషేధర్మశాస్త్రములోని 613 ఆజ్ఙలలోని అనేక ఆజ్ఙలను నీవు వ్యక్తిగతంగా అనుసరించాలి. అలా చేయని పక్షములో నీవు ఆజ్ఙాతిక్రమానికి పాలుబడ్డట్టే. నీకు వర్తించే మోషేధర్మశాస్త్రములోని ఆజ్ఙలలో ఒక్కటి మీరినా నీవు దేవుని దృష్టిలో శాపగ్రస్తునివి లేక శాపగ్రస్తురాలవు (ద్వి.కాం.27:26). 

నీవు మోషేధర్మశాస్త్రాము క్రింద జీవిస్తున్నది మొదలుకొని నేటివరకు నీకు వర్తించే అన్ని ఆజ్ఙలను తప్పిపోకుండా అనుసరిస్తున్నావా లేదా? ఈ విశ్లేషణనుబట్టి “నేను శాపగ్రస్తుని లేక శాపగ్రస్తురాలిని కాదు” అని చెప్పగలవా? నీవు మోషేధర్మశాస్త్రమును అనేక సార్లు మీరావు గనుక యిప్పుడు నీవు శాపగ్రస్తునివని/శాపగ్రస్తురాలివని గ్రహిస్తే మరి ఆ ధర్మస్శాస్త్రమూలమైన శాపాన్ని తొలగించుకోవడానికి తనాక్ లో నీకు ఏవిధమైన నిరీక్షణను దేవుడిచ్చాడు?  

(9) అబ్రహాము యొక్క సంతానమైన ఇశ్రాయేలు జనులే పాతనిబంధనలో (తనాఖ్) యూదులుగా పేర్కొనబడ్డారు లెక్కించబడ్డారు.

యూదామతాన్ని పుచ్చుకొన్న అన్యులుకూడా దేవుని దృష్టిలో ఇశ్రాయేలీయులుగా/యూదులుగా పేర్కొనబడ్డట్టు లేక లెక్కించబడ్డట్టు పాత నిబంధనలో (తనాఖ్) యెక్కడుంది?

(10) మోషేధర్మశాస్త్రమును అందుకొన్న వ్యక్తులు (ఇశ్రాయేలీయులు) అలాగే యూదామతాన్ని స్వీకరించిన వ్యక్తులు (అన్యులు) ఆ ధర్మశాస్త్రములోని ప్రతిమాటను అనుసరించాలి (ద్వి.కాం.12:32). మోషేధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా అంటే యేఒక్కదానిలో తప్పిపోకుండా అన్ని విధులను పాటిస్తే ధర్మశాస్త్రమూలమైన నీతిని పొందవచ్చు (ద్వి.కాం.6:25). 

ఈ లేఖనసత్యాలనుబట్టి మోషేధర్మశాస్త్రాన్ని తు.చ. తప్పకుండా పాటించి తద్వారా ధర్మశాస్త్రమూలమైన నీతిని పొందిన వ్యక్తులెవరైనా పాత నిబంధనలో (తనాఖ్) వున్నారా? గమనించాలి, పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లో నీతిమంతులున్నారు. అయితే వారు విశ్వాసమూలమైన నీతిని పొందినట్లు లేఖనాలలో దాఖలాలున్నాయిగాని మోషేధర్మశాస్త్రమూలమైన నీతిని పొందిన దాఖలాలున్నాయా అన్నది యిక్కడ అడగబడుతున్న ప్రశ్న.

(11) “ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి.” (యెషయా 29:13) 

యూదులు అలగే యూదులు కాకుండానే యూదులమని చెప్పుకుంటున్న వారు యూదామతాన్ని అవలంబిస్తూ తనాఖ్ (పాత నిబంధన గ్రంథము) లో లేని ఆచారాలను, గ్రంథాలను అనుసరిస్తూ తనాఖ్ (పాత నిబంధన గ్రంథము) లో దేవుడైన యెహోవా వివరించినవిధంగా ఆయన తిరస్కారానికి ఉగ్రతకు పాత్రులవడం యెంతవరకు శ్రేయస్కరము?

(12) యూదులైనా లేక యూదామతప్రవిష్టులైనా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని పరిశుద్దనామాన్ని (יהוה) వ్యర్థముగా అంటే గౌరవించాల్సిన విధంగా గౌరవించకుండా సందర్భమున్నా లేకున్నా అవసరమున్నా లేకున్నా ఆనామాన్ని ప్రత్యక్షంగానైనా (יהוה/యెహోవా/యాహ్వే) లేక పరోక్షంగానైనా (హషేం=ఆ నామము) వుపయోగించడము అన్నది మోషేధర్మశాస్త్రానికి పూర్తిగా వ్యతిరేకమైనది (నిర్గ.కాం.20:7). 

దేవుడైన యెహోవ తన జ్ఙాపకార్తమైన నామాన్ని తన ప్రజలకు బయలుపరచినప్పుడు తన నామాన్ని ప్రతిదినము వుచ్చరించాలని అదీ అనేక సార్లు వుచ్చరించాలని ఆజ్ఙాపించాడా? అలా ఆజ్ఙాపిస్తే అవి పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లో యేక్కడున్నాయి? అలాంటి ఆజ్ఙలు లేనట్లయితే మీరు ఆయన మహోన్నతనామాన్ని వుపయోగిస్తున్న తీరు మీకు దేవుని వుగ్రతను మరియు శాపాన్ని కొనితేవడము ఖాయమని చుపిస్తున్నది, మరి దీన్ని మీరు ఎందుకు గ్రహించడము లేదు?

(13) తండ్రి అయిన దేవుడే తన న్యాయాన్నిబట్టి, సంకల్పాన్నిబట్టి, ప్రణాలికనుబట్టి తన సేవకుని (మెస్సయ్య/మషియాఖ్) యందు నెరవేర్చబడే పాపపరిహారార్థబలినిగూర్చి పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లో వివరించి (యెషయా 52:13-53:12) దాన్ని క్రీ.శ.మొదటిశతాబ్దములో యషువ హ మషియాఖ్ (యేసు క్రీస్తు) నందు నెరవేర్చగా (మత్తయి 27-28; మార్కు 15-16; లూకా 23-24; యోహాను 19-20)… 

ఆ దైవకార్యాన్ని అవిశ్వాసముతో త్రుణీకరించడముద్వారా యూదులు అలాగే యూదామతాన్ని స్వీకరించిన అన్యులు విశ్వాసబ్రష్టులుగా మరియు సత్యద్వేషులుగా మారి శాపగ్రస్తులుగా మిగిలిపోవడము యెంతవరకు సముచితము మరియు శ్రేయస్కరము?