యూదుమతస్తుల ప్రశ్నలు-5

ప్రశ్న: బలుల కంటే యేసు శ్రైష్టమైన బలియా???

జవాబు: అవును!!! అందుకే పాతనిబంధన కాలములో లెక్కలేనన్ని పశువుల బలులు ప్రతిసంవత్సరము అర్పించాల్సివచ్చేది, కాని క్రొత్తనిబంధన ప్రారంభములోనే పవిత్రమైన మరియు ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తం మానవకోటికంతా ఒకేసారి అర్పించబడింది. 

ప్రశ్న: జంతువు రక్తము మనిషి రక్తము ఒక్కటేనా????

జవాబు: లేఖనాల ప్రకారము, “​రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును” (లే.కాం.17:11 & ఆది.కాం.4:10).      

రక్తములో, జంతువుల రక్తమైన లేక మనుషుల రక్తమైన, ప్రాణముండును! అయితే, మనుషుల రక్తం జంతువుల రక్తంకన్నా ఎంతో ప్రశస్తమైనది మరియు ప్రాముఖ్యతగలది, దేవుని ఎదుట! 

ప్రశ్న: దేవుడు నర బలి ద్వారా పాప క్షమాపణ కలుగుతుందనీ నరుని రక్తం ద్వారా పాపాలు పోతాయనీ రిపరేన్స్ ఇవ్వండీ బ్రదర్???

జవాబు: నరులను “నరబలి” అర్పించమని దేవుడు ఆజ్ఙాపించలేదు, బ్రదర్! కాని, తానే ఆ “బలిని” సిద్ధం చేసి అర్పించబోతున్నట్లు దేవుడే తన ప్రవక్తలద్వారా వాగ్ధానం చేసాడు, కాలం సంపూర్ణమైనప్పుడు తన వాగ్ధానాన్ని నెరవేర్చాడు:

“ఇది నా రక్తం. అంటే పాపక్షమాపణ నిమిత్తం అనేకులకోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం.” (మత్తయి 26:28)

మోషేధర్మశాస్త్రములో దేవుడు ఇశ్రాయేలీయులకు “నరబలి అర్పించండి” అంటూ ఏ ఆజ్ఙ యివ్వలేదు. అయితే, మోషేధర్మశాస్త్రము తరువాత ప్రవక్తల గ్రంథాలలో దేవుడు తన నిత్య ప్రణాలికను బట్టి తన సంకల్పముచొప్పున, తన ప్రణాలిక ప్రకారం, తానే నిర్ధేశించి నిర్వహించబోయే తన సేవకుని/కుమారుని  బలియాగముద్వారా మానవాళికి క్షమాపణను అనుగ్రహించి పాపులైన వారిని నిర్దోశులుగా చేయబోతున్న వైనాన్ని విశదీకరించాడు (యేషయా 52:13-53:12; దానియేలు 9:24-26). ఈ దైవరక్షణ నిజమైన పశ్చత్తాపము మరియు మారుమనస్సు పొంది దేవుడే అనుగ్రహించి నిర్వహించిన దైవ-మానవ బలియాగమైన ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క సిలువమరణాన్ని విశ్వసించిన వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. దీన్ని విశ్వాసముద్వారా కృపచేతనే పొందగలము (ఎఫెసీ.2:8). దీన్ని పొందినవారు ఆత్మలో తిరిగిజన్మించిన అనుభవాన్ని పొంది (యోహాను 3:2-8) నీతిమార్గములో క్రీస్తు బోధలో/నియమాలలో లేక క్రీస్తుధర్మశాస్త్రములో నడుచుకోవాలి. ఈ ధర్మశాస్త్రము మోషేధర్మశాస్త్రముకన్నా ఎంతో శ్రేష్టమైనది. ఇది క్రొత్త నిబంధన గ్రంథములో పరమతండ్రి అందించిన బోధ. 

యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) మరి శ్రేష్టమైన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా వుండి (హెబ్రీ.8:6-7, 9:15) పూర్వ/పాత నిబంధనలో భాగంగా వుండిన మోషేధర్మశాస్త్రానికన్నా శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధనలో భాగంగా అందించాడు (యోహాను 13:34-35, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6). దాన్నే క్రీస్తు నియమము (Law of Chirst—గలతీ.6:2) లేక ఆత్మ నియమము (Law of the Spirit—రోమా.8:2) అని లేఖనాలు పేర్కొంటున్నాయి.  

ప్రశ్న:నరుని రక్తము ద్వారా కోత్తనిబంధన చేస్తానని దేవుడు చేప్పాడా???

జవాబు: “క్రొత్తనిబంధన చేస్తాను” అంటూ దేవుడు వాగ్ధానం చేశాడు. ఎవరి రక్తముతో (జంతువు రక్తముతోనా లేక మనిషి రక్తముతోనా), ఏ సంవత్సరము, ఏ స్థలములో ఆ నిబంధనను దేవుడు చేయబోతున్నాడోనన్నదాని వివరాలు యివ్వలేదు, యివ్వాల్సిన నియమముకూడా ఆయనకు లేదు. అయినా, దేవుడు తన మహాకృపలోతన ప్రవక్తలద్వారా  “క్రొత్తనిబంధన” ను గురించి తెలియచేసిన కొన్ని వివరాలు: 

అ) ఈ నిబంధన మోషేద్వారా చేయబడిన నిబంధనవంటిది కాదు

ఆ) ఈ నిబంధనలో ఇశ్రాయేలీయులు తప్పకుండావుంటారు

ఇ) ఈ నిబంధనలో అన్యజనులుకూడా చేరుతారు   

(యెషయా 42:1-3,6, 49: 5-8; 55:1-5, 59:20-21, 65:1; యిర్మీయ 31:31-34; యెహెజ్కేలు 16:60-62)     

ప్రశ్న: క్రోత్తనిబంధనలో పరలోక సంబంధమైనా సేవా నియమములు ఉంటాయనీ ముందుగా ఏ ఏ ప్రవక్తాల ద్వారా దేవుడు తేలియాజేశారు???

జవాబు: క్రొత్తనిబంధన ప్రారంభము తదుపరి పరలోకసంబంధమైన కొన్ని సేవా నియమాలు ఆత్మీయ భావములో చోటుచేసుకుంటాయి. కొందరు ప్రవక్తలు ఆవివరాలను మర్మఘర్బితంగా అందించారు. అవి దేవుని ఆత్మానుభవాన్ని కలిగినవారికి అవగతమవుతాయి.* 

ప్రశ్న:లేవీయకాండము 17:11: రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై❓❓❓❓ దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.
బలిపీఠము పై పోసేది జంతువుల రక్తమా??? నరుల రక్తమా???

జవాబు: లేవీయకాండము 17:11 ప్రకారము జంతువుల రక్తమును మానవనిర్మిత బలిపిటముపై ఇశ్రాయేలీయులు పోయాలి. ఇది పాపాలకు కేవళము తాత్కాలిక పరిష్కారము మాత్రమే అన్నది గ్రహించాలి. అందుకే జంతువుల బలులు దైవసుతుని పరిపూర్ణ సంపూర్ణ బలియాగముతరువాత 40 సంవత్సరములలోపే దైవప్రణాలికలో భాగంగా నిలిపివేయబడ్డాయి అన్నది గ్రహించాలి, విజ్ఙులైనవారు. మానవులు నిర్మించిన బలిపీటముపై మానవుల రక్తమును పోయవలసినదంటూ దేవుడు ఎలాంటి ఆజ్ఙను యివ్వలేదు.     

అయితే, దేవుని ప్రజలందరి (దేవున్ని విశ్వసించి, సమీపించి, లోబడి, సేవించేవారు) పాపముకు ప్రాయశ్చిత్తార్థముగ  దేవుడే తన నిత్య ప్రణాలికనుబట్టి తన సంకల్పముచొప్పున, తన ప్రణాలిక ప్రకారం, తానే నిర్ధేశించి నిర్వహించబోయే తన సేవకుని/కుమారుని  బలియాగముద్వారా ప్రోక్షించబడే పరిశుద్ధ రక్తము చిందించబడే విధానము మరియు ప్రోక్షించబడే స్థలము దేవుని నిర్ణయానికి లోబడి జరుగుతుంది, జరిగింది. ఆవిశయములో అభ్యంతరాలు లేవనెత్తేందుకు పాపులైన నరులకు ఏ హక్కూ/అధికారము లేవు అన్నది విజ్ఙులు గమనములో వుంచుకోవలి.  

ప్రశ్న: వాక్యము శరీరధరియై పుడుతుందనీ రిపరేన్స్ ఏక్కడా??

జవాబు: పాతనిబంధన గ్రంథములో (తనాక్)”వాక్యమే శరీరధారిగా జన్మిస్తుంది” అన్న ప్రవచనమేదీ లేదు. అలాంటి ప్రవచనముందీ అంటూ క్రొత్తనిబంధన గ్రంథములో ఎక్కడా చెప్పబడలేదు. పాతనిబంధన గ్రంథములో చెప్పబడని కార్యాలుకూడా క్రొత్తనిబంధనలో దేవుడు జరిగించవచ్చు. అలా చేయకూడదంటూ చెప్పే నియమమేదీ సృష్టికర్తకు ఎవ్వడూ పెట్టలేదు, పెట్టజాలరు!!! 

ప్రశ్న:యేసు పరిశుద్దత్మా వలన పుడుతాడనీ రిపరేన్స్ ఏక్కడా???

జవాబు: “యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో పెళ్లి నిశ్చయం అయింది కానీ వాళ్ళు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది.” (మత్తయి1:18) 

పై లేఖనము యేసు క్రీస్తు ప్రభువు జననాన్నిగురించి ప్రకటించింది. ఆ లేఖనము “యేసు క్రీస్తు జననము ఆరకంగా వుంటుందని పాత నిబంధన గ్రంథములో లేక ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడి వుంది” అని చెప్పడములేదు. అసలు యేసు క్రీస్తు ప్రభువు జీవితములో జరిగిన సంఘటనలన్నీ పాత నిబంధన గ్రంథములో పేర్కొనబడివుండాలన్న నియమము వుందా? లేదు!!!

ప్రశ్న: నరబలి-రక్తము ద్వారా పాపక్షమాపణ జరుగును అనీ రిపరేన్స్ ఏక్కడా????

జవాబు: “తర్వాత రోజు యేసు యోహాను దగ్గరకు వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకంలోని పాపాన్నంతా తీసివేసే దేవుని గొర్రెపిల్ల!” ( యెహన్1:29)

మోషేధర్మశాస్త్రములో పేర్కొనబడ్డ జంతుబలులు పరిమితమైనవి తాత్కాలికమైనవి. అందుకే అవి ప్రతి సంవత్సరము, అనేకసార్లు అర్పించాల్సిన అవ్వశ్యకత వుండినది. అవి రాబోవు దినాలలో దేవుడే అనుగ్రహించబోయే శ్రేష్టమైన మరియు సంపూర్ణమైన బల్యర్పణకు సూచనగా లేక చాయగా వుండినవి. *గత రెండువేల సంవత్సరాలుగా జంతుబలులను అర్పించే విధానము తొలగించబడింది. కారణం, వాటిని తొలగించకముందే దేవుడు మానవులందరి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని అందించే దేవుని బల్యర్పణ ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) నందు పూర్తిచేయబడింది (యేషయా 52:13-53:12; దానియేలు 9:24-26).