యూదుమతస్తులకు ప్రశ్నలు-5

తాల్ముద్-జూడాయిజంను అనుసరిస్తున్న అన్యులలోనుండి వచ్చినవారలారా…!

మోషేధర్మశాస్త్రముప్రకారము జీవిస్తున్నామనుకుంటూ మోషేధర్మశాస్త్రములో పేర్కొనబడ్డ పస్కా పండుగను ఆచరిస్తున్నరా? ఎక్కడ ఆచరిస్తున్నారు ఆ పండుగను…???!!! మీ వూరిలోనా లేక ఇజ్రాయేలు దేశములోని యెరూషలేము నగరములోనా?

దేవునిగ్రంథము సెలవిస్తున్నట్లుగా, ఎవరు? ఎందుకు? ఎప్పుడు? ఏవిధంగా? ఎక్కడ పస్కా పండుగను ఆచరించాలో ఈఅధ్యాయాలలో వివరించబడివుంది—ని.కాం.12 & ద్వి.కాం.16. లేఖనాలను పరిశీలనగా చదువుకొని దేవుడాజ్ఙాపించినవిధంగా చేస్తేనే దాన్ని దేవుడంగీకరిస్తాడు. అలాకానిపక్షములో అది దేవుని వుగ్రతను సంపాదిస్తుంది.

మానవులేర్పరచుకున్న విధులు/పద్దతులప్రకారము అంటే రబ్బీల-జూడాయిజం ప్రకారమైతే మీరున్న స్థలములో చేసుకోవచ్చు. కాని, దేవుని లేఖనాలైన మోషేధర్మశాస్త్రము ప్రకారము ఆ పండుగను కేవళము దేవునినాముంచబడిన యెరూషలేములోనే ఆచరించాలి:

“యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనె* నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి, గొఱ్ఱ మేకలలో గాని గోవులలోగాని బలి అర్పింపవలెను.” (ద్వి.కాం.16:2)

“నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే* నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి” (ద్వి.కాం.16:6)

“అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును నీ మధ్య నున్న పరదేశులును తలిదండ్రులు లేనివారును విధవ రాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.” (ద్వి.కాం.16:2)

“నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన ప ట్టణమైన యెరూషలేములో నా యెదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చెదను.” (1రాజులు 11:36)

“యూదాదేశమందు సొలొమోను కుమారుడైన రెహ బాము ఏలుచుండెను. రెహబాము నలువదియొక సంవత్సర ములవాడైనప్పుడు ఏలనారంభించెను. తన నామము నుంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన యెరూషలేమను పట్టణమందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను; అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా.” (1రాజులు 14:21) 

ప్రభువైన యేసుక్రీస్తు పస్కా పండుగను ఒక నిజమైన యూదునిగా యెరూషలేములో ఆచరించాడు:

– “పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు. ఆయన పండ్రెం డేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ నాచ రించుటకై వాడుకచొప్పున వారు యెరూషలేమునకు వెళ్లిరి.” (లూకా 2:41-42) 
– “యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి” (యోహాను 2:13)
– “ ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా” (యోహాను 2:23)
– “గలిలయులుకూడ ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయనచేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.” (యోహాను 4:45)

మీరు మానవుల విధులను బట్టి పస్కాపండుగను ఆచరించడముద్వారా దేవున్ని ఆరాధిస్తున్నారా (యేషయా 29:13) లేక దేవుని గ్రంథమైన మోషేద్వారా యివ్వబడిన పంచకాండాల బోధను బట్టి (ద్వి.కాం.16:2,6,11) పస్కాపండుగను సరియైన విధంగా సరియైన స్థలములో (1రాజులు 11:36, 14:21) ఆచరించడముద్వారా దేవున్ని ఆరాధిస్తున్నారా?

ఈ విశయములో రబ్బీల-జుడాయిజం వారు ?% తప్పిపోయి మోషేధర్మశాస్త్రముకు వ్యతిరేకంగా పాపము చేస్తున్నారు!!!    

ఆలస్యము కాకముందే మిమ్మును మీరు పరీక్షించుకొని రబ్బీల అసత్యమార్గములోనుండి బైబిలు సత్యమార్గములోనికి రండి!   

*********************

బైబిలువిరోధులు, సత్యవిరోధులు, దైవవిరోధులు ఎవరు?

మోషేధర్మశాస్త్రాన్ని అందుకున్న ఇశ్రాయేలీయులెవరు దానికి యేమాటను కలుపకూడదు లేక దానిలోనుండి యేమాటను తీసివేయకూడదు (ద్వి.కాం.4:2, 12:32) 
కలిపిన తీసివేసిన వాడు అబద్దికుడు (సామెతలు 30:6) 

పై లేఖనాల వెలుగులో ప్రభువైన యేసుక్రీస్తు (యషువ హ మషియాఖ్) యొక్క క్రొత్తధర్మశాస్త్రపు బోధలను మోషేధర్మశాస్త్రానికి కలిపిచెరిపెడివిగా వున్నాయంటూ అబద్దాలను ప్రచారం చేస్తున్నవారు తమ లాజిక్కుతో క్రింద యివ్వబడినట్లుగా రాజైన దావీదు, ప్రవక్తలైన యెహెజ్కేలు మరియు హోషేయలు కూడా మోషేధర్మశాస్త్రానికి కలిపిచెరుపలేదని యెలా చెప్పగలరు??? 

వివరించండి లేఖనాల వెలుగులో…  

(1) ద్వి.కాం.17:17 [రాజు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు]” (ద్వి.కాం.17:17) ❌ 2సముయేలు.7-8 & 1ది.వృ.14:3 [రాజైన దావీదు అనేకమంది స్త్రీలను వివాహము చేసుకున్నాడు]  

(2) లే.కాం.21:7-14 [తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసుకొనవలెను. విధవరాలిని పెండ్లిచేసుకోకూడదు]

యెహెజ్కేలు 44:22 [యాజకులకు భార్యలై విధవరాడ్రుగా మారిన వారిని పెండ్లిచేసుకోవచ్చు] 

(3) సం.కాం.19:11-14 [అపవిత్రుడైన తరువాత యేడు దినములు లెక్కించాలి]

యెహెజ్కేలు 44:26 [పవిత్రుడైన తరువాత యేడుదినములు లెక్కించాలి]

(4) సం.కాం.5:29-31 [జారస్త్రీని/వ్యభిచారిని దేవుడు శిక్షిస్తాడు]

హోషేయ 4:14 [జారస్త్రీని/వ్యభిచారిని దేవుడు శిక్షించడు]    

(5) దేవుడు బలులర్పించడాన్ని కోరాడు (లేవీ.కాం.4:1-35; 5:4-12) 
❌ 
దేవుడు బలులను కోరడములేదు (కీర్తన.40:6, 51:16; హోషేయ.6:6)

(6) మోషేద్వారా యివ్వబడిన ఆజ్ఙ–దేవుని సన్నిధిలో బూరలను వూదాలి కాని ఆర్భాటము చేయకూడదు (సం.కాం.10:7-10)

దావీదు దేవుని మందసము ఎదుట పాటలు పాడుటకు వాయిద్యములు వాయించుటకు సేవకులను నియమించెను. (1దిన.వృత్తాం.15:16-22, 16:4-6, 25:1-8; 2దిన.వృత్తాం.23:18, 29:25-30)

(7) వ్యభిచార పాపానికి మరియు నరహత్య పాపానికి శిక్ష మరణదండన (లే.కాం.20:10; ద్వి.కాం.22:22; ని.కాం.21:12; లే.కాం.24:17; సం.కాం.35:16)

బత్షేబ విశయములో అలాగే ఆమె భర్త అయిన ఊరియా విషయములో  దావీదు చేసిన పాపాలకు శిక్షగా దావీదుకు మరణదండన విధించబడలేదు (2సమూయేలు.12:13)

(8) వ్యభిచార పాపానికి మరియు నరహత్య పాపానికి శిక్ష మరణదండన (లే.కాం.20:10; ద్వి.కాం.22:22; & ని.కాం.21:12; లే.కాం.24:17; సం.కాం.35:16)

బత్షేబ విశయములో అలాగే ఆమె భర్త అయిన ఊరియా విషయములో దావీదు చేసిన పాపాలకు దావీదుకు శిక్షగా మరణదండన విధించబడలేదు (2సమూయేలు.12:13)

(9) అబద్ధ సాక్ష్యానికి మరియు నరహత్యకు శిక్ష మరణదండన (ద్వి.కాం.19:16-19 & ని.కాం.21:12; లే.కాం.24:17; సం.కాం.35:16)

ఆహాబు తన పొరుగువాడైన నాబోతు ద్రాక్షాతోటను ఆశపడి నాబోతుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్షాన్ని సృష్టించి అతని మరణానికి కారకుడయ్యాడు. అయినా మరణదండనను పొందకుండా క్షమాపణను పొందగలిగాడు (1రాజులు.21:1-29)

(10) విగ్రహారాధన మరియు చిల్లంగితనము అనుసరించినవారికి మరణశిక్ష విధించాలి (లే.కాం.20:2; ద్వి.కాం.13:7-19; 17:2-7 & ని.కాం.22:18; లే.20:27)

మనష్షె దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన మరియు చిల్లంగితనము చేశాడు, కాని మరణశిక్షను పొందకుండ క్షమాపణను పొందాడు (2దిన.వృ.33:1-13)

(11) యాజకధర్మము అహరోనుకు మరియు అతని కుమారులకు యివ్వబడింది. యాజకధర్మానికి వేరేవారు సమీపిస్తే మరణశిక్ష విధించాలి (సం.కాం.3:10, 38, 16:40)

దావీదు వంశములోనుండి రాజుగా వచ్చే మెస్సయ్య యాజకునిగాకూడా వుండబోతున్నాడు (కీర్తన.110:4; జెకర్యా.6:12-13)

(12) మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఇశ్రాయేలీయులు ఆచరించాల్సిన ప్రధానమైన పండుగలు ఏడు (లే.కాం.23:1-44)
❌ 
ఎస్తేరు మరియు మొర్దెకైద్వారా మోషే ఎరుగని పూరీము అనే పండుగ ఆచారము ప్రవేశపెట్టబడినది (ఎస్తేరు.9:20-32)

(13) పండుగదినాలలో/నియామక కాలములలో అర్పించబడవలసిన బలులు మరియు నైవేద్యములు (సం.కాం.15:4-10) 
– గొర్రెపిల్ల + ముప్పావు ద్రాక్షారసము 
– పొట్టేలు + పడి నూనె + నాలుగు పళ్ళ పిండి + పడి ద్రాక్షారసము 
– కోడెదూడ  + పడిన్నర నూనె + ఆరుపళ్ళ గొధుమ పిండి 
❌ 
పండుగదినాలలో/నియామక కాలములలో అర్పించబడవలసిన బలులు మరియు నైవేద్యములు (యెహెజ్కేలు.46:11)  
– గొర్రెపిల్ల + శక్తికొలది పిండి + తూము ఒకటింటికి మూడుపళ్ళ నూనె
– ఎద్దు/పొట్టేలు + తూమెడు పిండి   

దావీదు దేవుని మందసము ఎదుట పాటలు పాడుటకు వాయిద్యములు వాయించుటకు సేవకులను నియమించెను. (1దిన.వృత్తాం.15:16-22, 16:4-6, 25:1-8; 2దిన.వృత్తాం.23:18)

పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తును (యషువ మషియాఖ్ ను) తప్పుబట్టే కుయుక్తిపరులైన ఆధునిక శాస్త్రులు పరిసయ్యుల లాజిక్కు ప్రకారము మోషేధర్మశాస్త్రములో యివ్వబడని పై ఆచారమును ప్రవేశపెట్టి దావీదు తోరాకు (మోషేధర్మశాస్త్రము) కలిపి చెరుపినట్లు కాదని ఎలా చేప్పగలరు???

మోషేధర్మశాస్త్రమును అందుకొన్న ఇశ్రాయేలీయులు ఆ ధర్మశాస్త్రములోని ప్రతిమాటను అనుసరించాలి (ద్వి.కాం.12:32)
మోషేధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా అంటే యేఒక్కదానిలో తప్పిపోకుండా అన్ని విధులను పాటిస్తే ధర్మశాస్త్రమూలమైన నీతిని పొందవచ్చు (ద్వి.కాం.6:25)  

మోషేధర్మశాస్త్రాన్ని అందుకున్న వ్యక్తి (ఇశ్రాయేలీయుడు) అందులోని విధులన్నింటిని పాటించాలి. ఒకవేళ వాటిని పాటించే విశయములో తప్పిపోతే (ఒక్కసారి తప్పినా సరే) శాపగ్రస్తుడవుతాడు (ద్వి.కాం.27:26; గలతీ.3:10; యాకోబు 2:10-11)

గమనిక#1: మోషేధర్మశాస్త్రములోని పై ఆజ్ఙలు ఇశ్రాయేలియులని లేక యూదామతప్రవిష్టులని, స్వతంత్రులని లేక చెఱలోనివారని, ఆనాడని లేక ఈనాడని భేదం చూపించడము లేదు!  

మోషేధర్మశాస్త్రాన్ని తు.చ. తప్పకుండా తన జీవితకాలములో సంపూర్ణముగా పాటించి మోషేధర్మశాస్త్రమూలమైన నీతిని పొందిన వ్యక్తి పాత నిబంధన గ్రంథముగా పేర్కొనబడే యూదుల తనాఖ్ (Old Testament) లో ఎవరైనా వున్నారా…??? వుంటే, బైబిలు రెఫరెన్సులద్వారా చూపించండి.

గమనిక#2: పాతనిబంధనలో (తనాక్) అనేకులు నీతిమంతులని లేఖనాలు ప్రకటిస్తున్నాయి. అయితే, వారు విశ్వాసమూలమైన నీతినిపొందినట్లు లేఖనాధారాలున్నాయి (ఆది.కాం.15:1-6). 

మోషేధర్మశాస్త్రాన్ని మీరే పాటించకుండా (పుర్తిగా) యిరతులను పాటించమని చెప్పడం వేశధారణకాదా???

మోషేధర్మశాస్త్రములో ఎక్కడైనా “మీకు సాధ్యమైనంతవరకు లేక వీలైనంతవరకు ధర్మశాస్త్రాన్ని పాటిస్తే సరిపోతుంది, మొత్తం తు.చ. తప్పకుండా పాటించాల్సిన అవసరం లేదు” అని వ్రాయబడివుందా??? వుంటే లేఖనాధారాలతో వివరించగలరు.