యూదుమతస్తుల ప్రశ్నలు-8
అబద్దికులు & మోసపరచువారు ఎవరు…?!
ద్వితియోపదేశకాండము 4: 2
“మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.”
ద్వితియోపదేశకాండము 12: 32
“నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.”
పై మాటలు దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయులతో చెప్పినవి. మోషే ద్వారా యివ్వబడిన తోరాహ్ [పంచకాండాలు] కు ఇశ్రాయేలీయులెవరు ఏదీ కలుపకూడదు తీసివేయకూడదు. అది దేవుడిచ్చింది కనుక దానిలో మార్పులు చేర్పులు జరుగాలంటే అవి దేవునిచేతనే చేయబడాలి.
మోషే తోరాహ్ ఇశ్రాయేలీయులకు అందించిన తదుపరి ప్రవక్తలద్వారా దేవుడు ఇంకా తోరాహ్ లో లేని ఎన్నో ఆజ్ఙలను, విధులను, ఆచారాలను ప్రవేశపెట్టాడు [ఉదా:(1దిన.వృత్తాం.15:16-22, 16:4-6, 25:1-8; 2దిన.వృత్తాం.23:18), (ఎస్తేరు.9:20-32), (కీర్తన.40:6, 51:16; హోషేయ.6:6)] అలాగే మెస్సయ్యద్వారా మరియు ఆయన అపోస్తలులద్వారా మానవాళికంతా చివరి దైవాజ్ఙలను, విధులను, ఆచారాలను అందించాడు [క్రొత్తనిబంధన గ్రంథము].
గమనిక: ప్రవక్తలకు, మెస్సయ్యకు మరియు అపోస్తలులకు యివ్వబడిన అధికారము దేవుడు రబ్బీలకు యివ్వలేదు [ద్వి.కాం.18:19; యెషయా.42:4]. అయినా వారు మోషే ధర్మశాస్త్రానికి వేరైన ఆజ్ఙలను, విధులను, ఆచారాలను మౌఖిక తోరాహ్ పేరున కలుపుకొని తమదైన యూదామతాన్ని నెలకొల్పుకున్నారు. ఇది ద్వితియోపదేశకాండములోని [4:2; 12:32] దేవుని ఆజ్ఙకు వ్యతిరేకమైన తిరుగుబాటుతోకూడిన పాపము. రబ్బీల మతానికి చెందిన జూడాయిజములోని వారంతా ఈ బాపతువారే!
సామెతలు 30: 6
“ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.”
అవును దేవుని లేఖనము సెలవిస్తున్న ప్రకారము దేవుని మాటలకు ఏనరుడు తన స్వంత మాటలను చేర్చకూడదు. దేవుని మాటలకు దేవుడే తన ప్రవక్తలద్వార అలాగే మెస్సయ్య మరియు ఆయన అపోస్తలులద్వారా ప్రగతిశీల ప్రత్యక్షతగా [Progressive Revelation] యివ్వబడిన తన సందేశములో భాగంగా మోషేధర్మశాస్త్రానికి వేరైన మాటలను చేర్చగలడు.
కాని, ఇశ్రాయేలీయులలోని రబ్బీలు తమకు దేవుడు యివ్వని అధికారాన్ని చూపిస్తూ మోషేద్వారా యివాబడిన తోరాహ్ కు వేరుగా మరొక తోరాహ్ అంటే మౌఖిక తోరాహ్ ను చేర్చుకొని పై లేఖనానికి విరుద్ధంగా పాపము చేసారు. ఆ పాపములో జుడాయిజములోని వారంతా పాలుపొందుతున్నారు!
యెహోవా దేవుడు మోషేద్వరా యిచ్చిన ధర్మశాస్త్రమంతా ఇంకా ఇప్పటికీ అమలులోనే వుందని బోధించే బోధకులారా ఆలోచించండి…సత్యాన్ని గ్రహించండి!
సామెతలు 28: 5
“దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిం చుదురు.”
అవును, దుష్టులు యెహోవా గ్రంథపు సరసన మరొక గ్రంథాన్ని [మౌఖిక తోరాహ్] వ్రాసుకొని/కలుపుకొని దేవుని ఆజ్ఙకు సరిగ్గా ప్రతికూలమైన పాపము చేస్తూ న్యాయమెట్టిదైనది గ్రహింపక దేవుని ప్రత్యక్షత విశయములో అన్యాయముగా ప్రవర్తిస్తున్నారు. యెహోవాను ఆశ్రయించువారు ఆయన తన ప్రవక్తలద్వారా మెస్సయ్యద్వారా, అపోస్తలులద్వారా యిచ్చిన సందేశాన్నిబట్టి సమస్తమును గ్రహించుదురు.
సామెతలు 28: 4
“ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు.”
నిజమే! దేవుడు మోషేద్వారా యిచ్చిన తోరాహ్ ను త్రోసివేసి రబ్బీలు వ్రాసుకున్న గ్రంథాలైన తాల్ముదు గ్రంథాలకు మౌఖిక తోరాహ్ అన్న పేరు పెట్టుకొని అంత దుర్మార్గానికి దుష్టత్వానికి కారకులైన రబ్బీలను పొగడుచు దేవుడు తన మెస్సయ్యద్వారా అందించిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వారితో అంటే నిజమైన క్రైస్తవులతో పోరాడుతారు. ఈ లేఖనపు అక్షరాల నెరవేర్పు మొదటి శతాబ్దము మొదలుకోని నేటివరకు చూడగలము.
యెషయా.5: 24
“సైన్యములకధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని వాక్కును తృణీక రించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయు నట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లి పోవును వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.”
ప్రవక్తలద్వారా, మెస్సయ్యద్వారా, అపోస్తలులద్వారా యెహోవా దేవుడు అందించిన సందేశాలను నిర్లక్ష్యపెట్టి రబ్బీల బోధలలో నిండా మునిగి పరిశుద్ధదేవుని వాక్కును తృణీకరిస్తున్న వారు అనేకులు. అలాంటివారి గతి కాలిపోయి మసిగామరియు బూడిదగా మారుతుంది. వారి అంతము నాశనము. అయ్యో వారికి శ్రమ!
పై విధంగా స్వంత ధర్మశాస్త్రాన్ని [మౌఖిక తోరాహ్] తయారుచేసుకొని దేవుడు మోషేద్వారా యిచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రవక్తలద్వారా యిచ్చిన సందేశాలను, మెస్సయ్యద్వారా మరియు అపోస్తలులద్వారా యిచ్చిన నూతన నిబంధనాసంబధమైన ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి నిర్లక్ష్యం చేస్తున్న వారంతా దైవవిరోధులు, ధర్మవిరోధులు, సత్యవిరోధులు మరియు నాశనమువైపు పయనిస్తున్న శాపగ్రస్తులు!!!