యూదుమతస్తుల ప్రశ్నలు-9

పాతనిబంధనలో లేనివి కలిపి చేరిపి రాసుకున్నది క్రైస్తవులా యూదులా????

ఈ ప్రశ్నలకీ  సమాదానమేక్కడా???
( బైబిల్ నుండి సమాధానం కావాలి)

  • ఆలయ ప్రతిష్ట పండుగ ఏప్పటి నుండి చేశారు???…( యెాహన్10:22)
  • విశ్రాంతిదినమున నడవదగిన దూరమేంత???…( అపో..కా1:12)
  • యన్నే యంబ్రే ఏవ్వరూ???…(2 తిమేాతి3:8)
  • దేవదూతలు ఏ పాపము చేస్తే కటిక చీకటి గల బిలాములోకీ పంపాడు???…(  2 పేతురు2:4)
  • బిలాము ఏందుకు ప్రవక్త గా పిలువ బడ్డాడు??? …( 2  పేతురు2:16)
  • హనోకూ ఏప్పుడు ప్రవచించాడు??..( యూదా14-15)

క్రైస్తవ సమాధానాలు

ప్రశ్న#1: ఆలయ ప్రతిష్ట పండుగ ఏప్పటి నుండి చేశారు???…( యెాహన్10:22)

అసలు ఈ ఆలయ ప్రతిష్ట పండుగ పాతనిబంధన గ్రంథములో [తనాఖ్] ఎక్కడుంది…??? ఎక్కడా లేదు!!!

“ఆలయ ప్రతిష్ట పండుగ”నే ఈనాడు హనుఖ్క అని మొదట్లో మక్కబీసుల పండుగ అనికూడా పేర్కొనేవారు. ఈ యూదుల పండుగ 165 క్రీ.పూ. లో ప్రారంభించబడింది.

ఈ పండుగ పాతనిబంధన లేఖనాలలో దేవుడిచిన పండుగలలోనిది కాదు. 

యోహాను 10:22 లోని వివరాలు:

ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను.

క్రొత్తనిబంధన గ్రంథములోని పై లేఖనము వివరిస్తున్నది చరిత్ర సత్యము. కాని, అది దేవుడిచ్చిన పండుగ అని, ఆ పండుగను పాటించాలని, లేక ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] ఆ పండుగను ఆచరించాడని ప్రకటించటము లేదు. 

యూదులు పాటించిన పండుగను గురించి పై లేఖనము పేర్కొంటున్నది. యూదుల ఆచారాలన్నీ లేక వారు జరుపుకునే పండుగలన్నీ దేవుడిచ్చినవన్నది బైబిలు చెప్పడము లేదు, గమనించాలి.    

ప్రశ్న#2: విశ్రాంతిదినమున నడవదగిన దూరమేంత???…( అపో..కా1:12)

“మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండువేల మూరలను, దక్షిణ దిక్కున రెండువేల మూరలను, పడమటి దిక్కున రెండు వేల మూరలను, ఉత్తర దిక్కున రెండువేల మూరలను కొలవవలెను. ఆ నడుమ పురముండవలెను. అది వారి పురములకు పల్లెలుగా నుండును.”(సం.కాం.35:5) 

“మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను. మీకును దానికిని దాదాపు రెండువేలకొల మూరల యెడముండ వలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లినది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు.” (యొహోషువ.3:3-4)

పై రెండు లేఖనాల వెలుగులో పురానికి దాని వెలుపలి హద్దుకు ఉండాల్సిన దూరం రెండువేల మూరలు. ఇది ఏదినమైనా నడవతగిన దూరం. అంటే సబ్బాతునాడుకూడా నడవతగిన దూరం. ఓలీవల కొండ మరియు యెరూషలేముల మధ్య వున్నది అదే దూరము.   

ప్రశ్న#3: యన్నే యంబ్రే ఏవ్వరూ???…(2 తిమేాతి3:8)

యన్నే మరియు యంబ్రే అనేవారు ఐగుప్తులోని ఫరో సేవకులైన మంత్రజ్ఙులు (ని.కాం.7:11). ఇది చారిత్రక సత్యము. ఈ సత్యము అపోస్తలుడైన పౌలుచేత దేవుని ఆత్మ ప్రేరణద్వారా లేఖనములో చేర్చబడింది.     

ప్రశ్న#4: దేవదూతలు ఏ పాపము చేస్తే కటిక చీకటి గల బిలాములోకీ పంపాడు???…(  2 పేతురు2:4)

“దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.” (2పేతురు.2:4)  

పై లేఖనము తెలియచేస్తున్న దాని ప్రకారము దేవదూతలు కూడా పాపము చేసారు. దేవుడు వారు దేవదూతలని విడిచిపెట్టకుండా వారిని తీర్పుదినము వరకు బంధించి వుంచాడు అన్నది పై లేఖనముద్వారా అర్థము చేసుకోవచ్చు. 

లేఖనాలు తెలియచేస్తున్నవన్నీ సత్యాలు. అయితే, అవి తెలియచేస్తున్నంతవరకే ఖచ్చితమైన సత్యాలు. మనకు అవసరమైనంతమట్టుకే దేవుడు తన లేఖనాలలో ప్రత్యక్షపరచాడు. అన్ని వివరాలు నరులకు తెలియచేయనవసరము లేదు. తెలియచేసిన వాటిని ఆధారము చేసుకొనే దేవుడు నరులకు తీర్పుతీరుస్తాడు.

దేవదూతలు ఏ పాపము చేసారు? ఎందుకు చేసారు? ఎక్కడ చేసారు? ఎలా చేసారు? ఎంతమంది దూతలు ఆ పాపము చేసరు? అందరు ఒకే పాపము చేసారా లేక వేరే వేరే పాపాలను చేసారా? వారికి ఏవిధమైన శిక్ష రాబోతుంది? మొదలైన వివరాలన్నీ నరులకు అవసరము లేదు. కనుకనే వాటిని దేవుడు వివరించలేదు. 

ఉదాహరణకు, తోరాహ్ లో యిలా వుంది, “అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.” (ఆది.కాం.3:7)

పై వాక్యము ప్రకారము ఆదాము హవ్వలు తమకు చేసుకున్న కచ్చడములు ఎన్ని ఆకులతో చేసుకున్నారు? ఆ ఆకులు లేతవా లేక ముదిరినవా? ఏవిధంగా ఆ ఆకులను కుట్టారు? కుట్టెందుకు ఏ పదార్థాలను వాడారు? ఇద్దరు కుట్టితే సమానంగా శ్రమపడ్డారా లేక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ శ్రమించారా…? ఈ ప్రశ్నలకు జవాబులుంటాయి. కాని, అవి నరులకు అవసరం లేదు. కనుకనె ఆ వివరాలన్నీ దేవుడు తన లేఖనాలలో తెలియచేయలేదు.   

“రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:29)      

ప్రశ్న#5: బిలాము ఏందుకు ప్రవక్త గా పిలువ బడ్డాడు??? …( 2  పేతురు2:16)

లేఖనాలు బిలామును ప్రవక్తగా పేర్కొన్నాయి (1పేతురు.2:16)
లేఖనాలు మోషే మామ యిత్రోను యాజకునిగా పేర్కొన్నాయి (ని.కాం.3:1)
లేఖనాలు దావిదును ప్రవక్తగా పేర్కొన్నాయి (అపో.కా.2:30)

పైవన్నీ చారిత్రక సత్యాలే. అయినా వాటి వివరాలన్నీ లేఖనాలలో దేవుడు నరులకు తెలియపరచాలన్న నియమమేదీ లేదు. నరులకు అవసరమైనవన్నీ లేఖనములో తెలియపరిచాడు. అనవసరమైన వాటిని లేక వివరాలను లేఖనాలలో చేర్చ లేదు. ఆ కారణాన్నిబట్టి లేఖనాలలో బయలుపరచబడిన వాటిని సంశయించకూడదు. సంశయించువాడు అవిశ్వాసి!  

ప్రశ్న#6: హనోకూ ఏప్పుడు ప్రవచించాడు??..( యూదా14-15)

“ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకుకూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.” (యూదా.14-15)

పై లేఖనములో దేవుడు బయలుపరుస్తున్న దాని ప్రకారము ఆదాము మరియు హానోకు లిరువురు ప్రవచించారు అన్నది గ్రహించాలి. ఎప్పుడు ప్రవచించారు? ఎలా ప్రవచించారు? ఏ భాషలో ప్రవచించారు? ఎన్ని సార్లు ప్రవచించారు? ప్రవచించటానికి ఎంత సమయము తీసుకున్నారు? ప్రవచించింది ఎవరు విన్నారు లేక ఎంతమంది విన్నారు? మొదలైన ప్రశ్నలన్నినిటికి దేవుని యొద్ద జవాబులున్నాయి. కాని, అవన్నీ మానవులకు అవసరమైనవి కావు గనుకనే వాటి వివరాలను లేఖనములో దేవుడు తెలియచేయలేదు.    

రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:29)       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *