Home

దుర్బోధ:
లేఖనాలలో లేనివాటిని ఉన్నట్లుగా లేక ఉన్న వాటిని లేనట్లుగా బోధించటము. అంతేగాక, అనువాదాలపైనే పూర్తిగా ఆధారపడి మూలభాషలోని పదాల అసలు భావాన్ని, సందర్భాన్ని, కాలాన్ని పరిగణాలోకి తీసుకోకుండా చేయబడే బోధ!

తాల్ముద్-జూడాయిజం

తాల్ముద్ అన్నది యూదుమతబోధకులైన రబ్బీలు పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడిచ్చిన తనాక్ (పాతనిబంధన గ్రంథము) కు వేరుగా వ్రాసుకున్న యూదు సాంప్రదాయాలతోకూడిన గ్రంథాలలో ప్రధానమైనది.          

“తాల్మూద్-జూడాయిజం” అన్న మతవిశ్వాసం ప్రధానంగా యూదు మతబోధకులైన రబ్బీల బోధలపై అంటే తాల్ముద్ బోధలపై ఆధారపడినది. కనుక దీన్ని "రబ్బీలజూడాయిజం" (Rabbinic Judaism) అనికూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జూడాయిజం అనేక శాఖోపశాఖలుగా విడిపోయింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా...

మిగతా వివరాలకు...

పాతనిబంధన Vs. క్రొత్తనిబంధన

జూడాయిజంలోని కొందరు లేఖనాలను వక్రీకరిస్తూ క్రొత్తనిబంధనను గురించి చేస్తున్న అసత్యబోధలలో క్రొత్తనిబంధనను గురించి క్రింది విధంగా వ్యాఖ్యానిస్తున్నారు:

 • క్రొత్తనిబంధన అంటే మోషేద్వారా చేయబడిన నిబంధనను కేవలము తిరిగి నూతనపరచడము మాత్రమే.
 • క్రొత్తనిబంధన అంటే దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేయబోతున్న నిబంధన.
 • క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ]...
మిగతా వివరాలకు

తనాక్ ధార్మిక మార్గం

“తనాక్ ధార్మిక మార్గం” అన్న మతవిశ్వాసం కేవలం తనాక్ (పాతనిబంధన గ్రంథము) లోని దైవలేఖనాలపై మాత్రమే ఆధారపడిన మతవిశ్వాసం. ఈ మతవిశ్వాసాన్ని బైబిలు విశ్వాసము అనికూడా పేర్కొనవచ్చు. ఇది యెరూషలేములో హేరోదు కట్టించిన రెండవ మందిరము 70 క్రీ.శ. లో నాశనము/ద్వంసము చేయబడినతరువాత క్రమక్రమంగా వునికిని కోల్పోయింది. అంతకు పూర్వము తనాక్ ధార్మిక మార్గం లోని భక్తిపరులు చాలావరకు యేసును (యషువను) క్రీస్తుగా (మెస్సయ్యగా) గుర్తించి ఆయనను వెంబడించి క్రైస్తవులుగా మారిపోయారు. ఆరకంగా తనాక్ ధార్మిక మార్గం...

మిగతా వివరాలకు...

ధర్మశాస్త్రపు నీతి Vs. దేవుని నీతి

మోషేధర్మశాస్త్రము (מֹשֶׁ֣ה תּוֹרַ֖ת /tawrat Moshe)...

 • మేలైనది
 • నీతిగలది
 • శ్రేష్టమైనది
 • సత్యమైనది
 • నమ్మదగినది
 • పరిశుద్ధమైనది
 • ప్రయోజనకరమైనది
 • దేవుడు నియమించినది
 • పూర్వ/పాత నిబంధనలోనిది
  (నెహెమ్యా 9:13; కీర్తనలు. 19:7, 119:72,142; రోమా. 7:12,16; 15:4; 1కొరింథీ.10:1-11...
మిగతా వివరాలకు

ధర్మశాస్త్రము

ధర్మశాస్త్రము (תּוֹרָה) — పదవివరణ 

ధర్మశాస్త్రము అన్న తెలుగు పదము హీబ్రూ లేఖనాలలోని తోరా (תּוֹרָה/Torah) అన్న హీబ్రూభాషా పదపు అనువాదము. ఈ హీబ్రూ పదము హీబ్రూ లేఖనాల సంపుటి అయిన పాతనిబంధన (తనాక్/TaNaK) గ్రంథములో 219 సార్లు వుపయోగించబడింది.

ధర్మశాస్త్రము/తోరా (תּוֹרָה/Torah) అన్నపదము యొక్క అర్థము 

తోరా (תּוֹרָה/Torah) అనే హీబ్రూ పదానికి వున్న ప్రధానమైన అర్థాలు: ఉపదేశము; చట్టము...

మిగతా వివరాలకు...

మోషేనిబంధన

దేవుడు మోషేద్వారా చేసిన నిబంధనను మోషేనిబంధన [Mosaic Covenant] అని అలాగే పూర్వ/పాత నిబంధన [Previous/Old Covenant] అనికూడా సంబోధిస్తారు.

(1) ఈ నిబంధన దేవుడు ప్రధానంగా ఇశ్రాయేలు వంశస్తులతో చేసాడు (ని.కాం.19:3-6, 24:3-8; ద్వితీ.కాం.4:7-8, 5:1-5, 29:1; మలాకి 4:4; రోమా.2:11-12, 3:19, 9:4; ఎఫెసీ. 2:11-12; హెబ్రీ.8:9).

అయితే, వారితో మాత్రమే కాకుండా నిబంధన సమయములో వారిమధ్య జీవిస్తూ వారితోపాటు వాగ్దత్త దేశమైన కానానులో స్వాస్థ్యము పొందబోతున్న అన్యులతో/పరదేశులతో...

మిగతా వివరాలకు

"నేను [యషువ/యేసు] ఆయననని [మషియాఖ్/క్రీస్తునని] మీరు విశ్వసించనియెడల  మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురు." (యోహాను.8:24)

Sacrifice

రక్తము – ప్రాయశ్చిత్తము

రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు” (హెబ్రీ.9:22)

బైబిలు బోధలలో రక్తానికి [blood] మరియు ప్రాయశ్చిత్త [atonement] ప్రయత్నాలకు అవినాభావ సంబంధముంది. లేఖనాల బోధప్రకారము ప్రాయశ్చిత్తమన్నది ఎంతో విలువైనది, అందునుబట్టే ప్రాణాన్నే ఫణంగా పెడితె తప్ప ప్రాయశ్చిత్తానికి మార్గము లేదు అన్నది బైబిలు సూత్రము. ఈ సూత్రాన్ని ప్రతిబింబిస్తు పాత మరియు క్రొత్త నిబంధనా లేఖనాలు మానవుల పాపాలకు ప్రయశ్చిత్తమార్గాలను నిర్ధేశిస్తూ వాటి నెరవేర్పులను మరియు వాటి ఫలితాలను వివరిస్తున్నాయి.

ఈ కారణాన్నిబట్టి బైబిలు ప్రకటించే పాపక్షమాపణ నిత్యజీవాలను సరిగ్గా అర్థం చేసుకోవటానికై రక్తమునుగురించి మరియు ప్రాయశ్చిత్తమునుగురించి అలాగే వాటిమధ్యవున్న సంబంధాన్నిగురించి లోతుగా ధ్యానించాల్సిన ఆవశ్యకత వుంది...

మిగతా వివరాలకు... 

అంత్యకాల జూడాయిజం

ప్రపంచంలోని ప్రాచీన మతాలలో జుడాయిజం (Judaism) లేక యూదుమతం ఒకటి. ఇది మధ్యప్రాచ్యంలో (Middle-East) ఆవిర్భవించినా ప్రపంచములోని అనేక దేశాలలో అనుసరించబడుతున్నది. ఈ మతం ప్రధానంగా యూదులమధ్య యూదులకొరకు యూదు మతపెద్దలైన రబ్బీలచేత ప్రారంభించబడినా ఈమధ్యే విస్తృతమైన మతప్రచారాన్ని మతమార్పిడులనుకూడా చేపట్టింది.

గత రెండువేల సంవత్సరాలుగా ప్రపంచములో ఉనికిని కొనసాగిస్తున్న యూదుమతం నిజానికి ఒకప్పటి బైబిలువిశ్వాసం లేక తనాక్ ధార్మిక మార్గం యొక్క కొనసాగింపు కాదుగాని దాని తదనంతరము ఆవిర్భవించి విస్తరిస్తున్న తాల్ముద్ ఆధారిత మతం లేక రబ్బీలమతం అన్నది గమనములో వుంచుకోవాలి. ఈనాటి యూదుమతం (జూడాయిజం) బైబిలు ప్రబోధాలకు మరియు వాటిపై ఆధారపడిన విశ్వాసానికి సుదూరమైనది. నిజానికి దీన్ని ‘అంత్యకాల జూడాయిజం’ అని అభివర్ణించవచ్చు.

‘జూడాయిజం’ (Judaism) అన్నది క్రీస్తుకు పుర్వమున్న ప్రవక్తలకెవరికీ తెలియని పదం. అయితే, జూడాయిజం అంటే యూదుల మతం అన్నది ఈనాటి సర్వసాధారణ భావం...

మిగతా వివరాలకు... 

unnamed

మీ స్పందన...

క్రైస్తవులను కలవరపెడుతూ క్రైస్తవ్యంలోని పొట్టును పోలిన మతక్రైస్తవులనేకులను భ్రష్టమార్గం పట్టిస్తున్న ఈలాంటి దుర్బోధలను గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి.