యూదుమతస్తుల ప్రశ్నలు-2

ప్రశ్న#1
దేవాలయ ఆవరణము చనిపోయిందీ…బరకీయ కుమారుడా?? యెహోయదా కుమారుడా? (మత్తయి 23:35—2దినవృ.24:20)

జవాబు:

అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా…అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి.” (2దినవృ.24:20-21)
నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీటమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన, బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీమీదికి వచ్చును.” (మత్తయి 23:35) 

రెండు సంఘటనలలో కొన్ని సామీప్యాలున్న అవి రెండూ వేరువేరు సంఘటనలన్నది ఆ రెండు సంఘటనల సందర్భాలను జాగ్రత్తగా ధ్యానించిచూస్తే అవగతమవుతుంది: 

– యెహోయాదా కుమారుడైన జెకర్యా “యెహోవా మందిరపు ఆవరణములోపల” చంపబడ్డాడు. కాని, యేసు ప్రభువు పేర్కొన్న జెకర్యా “బలిపీటమునకును, దేవాలయమునకును మధ్య” చంపబడ్డాడు. ఈ రెండు హత్యలు దేవాలయ ప్రాంగనములోపలే  సంభవించినా అవి దేవాలయములోని రెండు వేరువేరు స్థలాలలో సంభవించాయి అన్నది గమనించాలి.    
– యెహోయాదా కుమారుడైన జెకర్యా 700 క్రీ.పూ. కాలములో చంపబడ్డాడు. అయితే, యేసు ప్రభువు సృష్టి ఆరంభము మొదలుకొని పాతనిబంధన (మోషే-నిబంధన) చివరివరకూ చంపబడిన నీతిమంతులను గురించి ప్రస్తావించాడు.   
– యెహోయాదా కుమారుడైన జెకర్యా (2దినవృ.24:20) బరకీయ (బెరక్యా) కుమారుడైన జెకర్యా (జెకర్యా 1:1) యిద్దరూ వేరువేరు వ్యక్తులు. బెరకీయ లేక బెరక్యా కుమారుడైన జెకర్యా 520 క్రీ.పూ. లో పరిచర్య చేసాడు. యేసు ప్రభువు ఈ జెకర్యాను గురించి ప్రస్థావించడము జరిగింది.
– యెహోయాదా కుమారుడైన జెకర్యా ఇద్దో వంశస్థుడు కాదు. అయితే, బరకీయ కుమారుడైన జెకర్యా ఇద్దో వంశస్థుడు (జెకర్యా 1:1). ఈ జెకర్యానే ప్రవక్తగా మరియు యాజకునిగా రెండు పాత్రలతో కూడిన పరిచర్య జరిగించాడు.    
– ప్రవక్త అయిన జెకర్యా హత్య గురించిన వివరాలు బైబిలులో వ్రాయబడకపోయినా ఆ హత్యనుగురించిన సమాచారము యూదులకు తెలిసెవుండింది. దాన్నిబట్టే ప్రభువైన యేసు వారికి ప్రవక్త అయిన జెకర్యా హత్యను గురించి జ్ఙాపకము చేసాడు. చారిత్రక విలువను కలిగిన “యూదు తార్గం” అనే గ్రంథము యిలా పేర్కొంటున్నది:

“సర్వలోక న్యాయాధిపతి బదులిస్తూ యిలా అన్నాడు, “అదొనాయ్ యెదుట దుష్టత్వము మానుకోమంటూ మీకు బుద్దిచెప్పినదాన్నిబట్టి ప్రధానయాజకునిగా మరియు నమ్మకమైన ప్రవక్తగా వుండిన ఇద్దో వంశస్థుడైన జెకర్యాను ప్రాయశ్చిత్తార్థదినాన అదొనాయ్ మందిరములో చంపినవిధంగా ఒక యాజకునిగా మరియు ప్రవక్తగా వుండిన వ్యక్తిని అదొనాయ్ మందిరములో హత్య చేయడం సబబా?” (తార్గం 2:20)

ప్రశ్న#2
దావీదు వెళ్ళింది అభ్యాతారు దగ్గరకా?? అబీమెలెక్ దగ్గరకా?? 
(మర్కు 2:25-26; 1సమూయేలు 21:1-6)
   

జవాబు:

దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి–నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా దావీదు–రాజు నాకు ఒక పని నిర్ణయించి–నేను నీ కాజ్ఞాపించి పంపినపని యేదో అదెవనితోనైనను చెప్పవద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని; నీయొద్ద ఏమి యున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండిన యెడల అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా యాజకుడుసాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదునిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడు దినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పని వారిబట్టలు పవిత్రములే; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతట యెహోవా సన్నిధినుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతని కిచ్చెను.” (1సమూయేలు 21:1-6)    
అందుకాయన వారితో ఇలా అన్నాడు, “దావీదు, అతనితో ఉన్నవారు, అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు అతడు చేసింది మీరు చదవలేదా? 26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?” అన్నాడు.” (మర్కు 2:25-26) 

1సమూయేలు 21:1-6 ప్రకారము “దావీదు యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చి” సముఖపు రొట్టెలను తిన్నాడు.
మర్కు 2:25-26 లో యేసు ప్రభువు చెప్పిన మాటలప్రకారము “అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు” దావీదు సముఖపు రొట్టెలను తిన్నాడు. ఇక్కడ గమనించాలి… 

– తెలుగు అనువాదములో సమస్య వుంది. “అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు” కాదు. అది “ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినములలో” (ἐπὶ Ἀβιαθὰρ ἀρχιερέως) గా అనువదించబడాలి. ఈ సరియైన అనువాదాన్ని కొన్ని ఇంగ్లీషు అనువాదాలలో చూడగలము.  “In the days of Abiathar the high priest, he entered the house of God and ate the consecrated bread, which is lawful only for priests to eat. And he also gave some to his companions.” (Mark 2:26—NIV)
– బైబిలులో అహీమెలెకు గురించిన వివరాలు యెక్కువగా లేవు. అహీమేలెకు కుమారుడైన అబియాతారు గిరించిన వివరాలే యెక్కువగా వున్నాయి. ఆనాటి యూదులకు అహీమెలెకుకన్న అతని కుమారుడైన అబియాతారే సుపరిచితుడు. 
– అబియాతారు దావీదు రాజుగా వున్న కాలములో ప్రధాన యాజకునిగా పరిచర్య చేసాడు. అంతకుముందు అతని తండ్రి అహీమెలెకు సౌలు కాలములో యాజకునిగా పరిచర్య చేసాడు.
– యేసు ప్రభువు చెప్పినమాట “ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినములలో” అన్నదాని భావం “అబ్యాతారు ప్రధాన యాజకునిగా వున్నసమయములో” అని కాదు. కాని, “ప్రధాన యాజకునిగా పరిచర్య చేసిన అబ్యతారు జీవించిన సమయములో” అని గ్రహించాలి.  

కనుక, దావీదు వెళ్ళింది అహీమెలెకు దగ్గరికి. అయితే, అది అబ్యాతారు జీవించిన కాలములో జరిగిన సంగటనగ  యేసు ప్రభువు అభివర్ణిస్తున్నాడు.  

ప్రశ్న#3
మీరు దైవములు అని చెప్పింది కీర్తనలోనా??? ధర్మశాస్త్రములోనా??
(యెహన్10:34— కీర్తన 82:6)

జవాబు:

అందుకు యేసుమీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?” (యోహాను 10:34)
మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను.” (కీర్తన 82:6)

తోరా లేక ధర్మశాస్త్రము అన్న పదము యొక్క వుపయోగభావం అది వుపయోగించబడిన సందర్భాన్నిబట్టి అర్థము చేసుకోవాలి. కొన్ని సందర్భాలలో అది ఒక ప్రత్యేకమైన ఆజ్ఙను సూచించడానికి వుపయోగించబడితే, కొన్ని సందర్భాలలో అది మోషే వ్రాసిన పంచకాండాలను సూచించడానికి వుపయోగించబడుతుంది, మరికొన్ని సందర్భాలలో వ్రాయబడిన యూదుల లేఖనాలన్నింటిని (ఆదికాండము–మలాకి) సూచించడానికి వుపయోగపడుతుంది. ఈ సత్యాన్ని ఈనాటి యూదుజాతికిచెందిన పండితులు మరియు విద్వాంసులు కూడా నొక్కి వక్కణిస్తున్నారు. ఉదాహరణగా క్రింద ఒక యూదు పండితుని మాటలలోనే ఆ సత్యాన్ని చూడవచ్చు…

“The word “Torah” is a tricky one, because it can mean different things in different contexts. In its most limited sense, “Torah” refers to the Five Books of Moses: Genesis, Exodus, Leviticus, Numbers and Deuteronomy. But the word “torah” can also be used to refer to the entire Jewish bible (the body of scripture known to non-Jews as the Old Testament and to Jews as the Tanakh or Written Torah), or in its broadest sense, to the whole body of Jewish law and teachings.” (Torah, Judaism 101, http://www.jewfaq.org/torah.htm)

పై వాస్తవాల వెలుగులో యేసు ప్రభువుకూడా తోరా (ధర్మశాస్త్రము) అన్న పదాన్ని వ్రాయబడిన యూదుల లేఖనాల సంపుటి అయిన తనాక్ అంతటిని సూచిస్తూ వాడాడు గనుక కీర్తనల గ్రంథము కూడా అందులోని భాగమే అన్న విశయము ఇంగితజ్ఙానమున్న వ్యక్తులెవరయినా ఇట్టే గ్రహించగలరు. అది లేకపోయినవారికే ఇది ప్రశ్నగా మిగిలిపోతుంది!!!

ప్రశ్న#4
ముప్పది వెండి నాణెలు ప్రస్తావన యిర్మియా గ్రంథములోనా?? జకర్యా గ్రంథములోనా???
(మత్తయి27:9,10— జకర్యా11:12-13)

జవాబు:

అప్పుడువిలువ కట్టబడినవాని, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువకట్టినవాని క్రయధనమైన ముప్పది వెండి నాణములు తీసికొని ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.” (మత్తయి 27:9,10)
మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకియ్యుడి, లేనియెడల మానివేయు డని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి తూచి యిచ్చిరి. యెహోవా యెంతో అబ్బురముగా వారు నా కేర్పరచిన క్రయధనమును కుమ్మ రికి పారవేయుమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసికొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని.” (జకర్యా11:12-13)

గమనిక: ప్రవక్తలు దేవుని అత్మ ప్రేరణలో అనేక సత్యాలు ప్రకటించడము జరిగింది. అయితే వారు ప్రకటించిన అన్ని మాటలను వారు గ్రంథస్తము చేసారన్న లేక చేయలన్న నియమమేదీ లేదు. ఒక ప్రవక్త దేవు ఆత్మ ప్రేరణలో ప్రకటించిన మాటలలోని గ్రంథస్తము చేయని మాటలను సహితము మరొక ప్రవక్త దేవుని ఆత్మ ప్రేరణలో తెలుసుకోగలడు మరియు వాటిని ప్రకటించగలడు. (ఉదా: యోహాను 21:25; యూద.14-15)      

పై వాక్యాలలో గమనించాల్సిన ప్రాముఖ్యమైన విశయాలు: 

1) రెండు వాక్యాలలో సమాంతరముగా కనిపించే పదజాలము కేవళము “క్రయధనము,” “ముప్పది వెండి,” “కుమ్మరికి,” “యెహోవా/ప్రభువు” అన్న పదాలు మాత్రమే. మిగతావన్నీ వేరు వేరు పదాలే. కనుక ఈ రేండు వాక్యాలు చెపుతున్న విశయాలు ఒకటే కానవసరములేదు.    
2) మత్తయి వ్రాసినది, “ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెను.” కాని, “యిర్మీయా వ్రాసినది నెరవేరెను” అని మత్తయి వ్రాయలేదన్నది గమనించాలి. కనుక, మత్తయి వ్రాసిన మాటలు యిర్మీయా పలికాడేకాని దాన్ని తన గ్రంథములో వ్రాసిపెట్టలేదు.  
3) ఈ వాస్తవాలనుబట్టి పైరెండు వాక్యాలు ఒకే విశయాన్ని గురించి ప్రస్తావించడము లేదు అన్నది సత్యపరిశోధకులు గ్రహించాలి.