యూదుమతస్తులకు ప్రశ్నలు-6

మోషేధర్మశాస్త్రము, పాపము, మరియు క్షమాపణ

మోషేధర్మశాస్త్రము ప్రకారము నరహత్య చేయకూడదు. నరహత్య చేసినవానికి మరణశిక్ష (ని.కాం.20:13, 21:12-14; లేవీ.కాం.24:17-23).
మోషేధర్మశాస్త్రము ప్రకారము వ్యభిచారము చేయకూడదు. వ్యభిచారము చేసిన వ్యక్తికి మరణశిక్ష వేయాలి (ని.కాం.20:14; లేవీ.కాం.20:10).
మోషేధర్మశాస్త్రము ప్రకారము పొరుగువాని భార్యను ఆశింపకూడదు (ని.కాం.20:17).  

దావీదు తన పొరుగువాడైన ఊరియా భార్యను ఆశించాడు. ఊరియా భార్య అయిన బత్షేబాతో వ్యభిచారము చేసాడు. చివరకు కపటోపాయముతో ఊరియాను చంపించాడు. ఈ రకంగా దావీదు ధర్మశాస్త్రములోని మూడు ఆజ్ఙలను మీరాడు. అయినా సరే అతనికి మరణశిక్ష పడలేదు. అంటే యిక్కడ మోషేధర్మశాస్త్రము అమలుకాలేదనేకదా! ఒకవేళ మోషేధర్మశాస్త్రము నిత్యము అమలులో వుంటుంది అని మీరు భ్రమలో వుంటున్నట్లయితే యిక్కడ మోషేధర్మశాస్త్రములోని కొన్ని భాగాలు అమలుకాలేదు అన్నది గమనించి అదేలా సాధ్యమైందో లేఖనాధారంగా వివరించండి. 

మోషేధర్మశాస్త్రము దావీదు కాలములోనే అమలుకాలేదు అన్న సత్యాన్ని బట్టి “మోషేధర్మశాస్త్రము  నిత్యము అమలులో వుంటుంది” అన్న మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారా? మార్చుకోకపోతే ఎందుచేతనో వివరించండి. 

అయిననుమీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, *నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్త లందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,” (2రాజులు 17:13)
పై లేఖనము ప్రకారము దేవుడు ధర్మశాస్త్రమును ఎంతమంది ప్రవక్తలద్వారా తన ప్రజలకిచ్చాడు??? వారి పేర్లేమి???

పై వివరాలేవీ తెలియకుండా మీలో ఎవరైనా గుడ్డిగా యేదో అరాకొరా మోషేధర్మశాస్త్రములోని మీకు అనువైన, అనుకూలమైన, వీలైన, మరియు సులభమైన వాటిని మాత్రము పాటించి మిగతా వాటన్నిటిని త్రొసివేసి తద్వారా ధర్మశాస్త్రమును పాటించడములో నిందితులై శాపగ్రస్తులుగా మారుతున్నారేమో చూసుకోండి (ద్వి.కాం.27:26).
ఒకవేళ మీరే మోషేధర్మశాస్త్రాన్ని అరాకొరా పాటిస్తూ మోషేధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామంటూ ఫీలవుతూ యితరులను/అమాయకులను మోసం చేస్తూ వారినికూడా మీమాదిరి అరాకొరా మోషేధర్మశాస్త్రాన్ని పాటించే వారిగా చేసి చివరకు మిమ్మునుపోలిన శాపగ్రస్తులుగా మార్చివేయడం ఏరకంగా మీకు మేలు??? 

ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై యున్నాడని సున్నతిపొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగ చెప్పుచున్నాను. (గలతీ.5:3 & యిర్మీయా 11:1–4)
ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును (యాకోబు 2:10) 
ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్‌ అనవలెను. (ద్వి.కాం.27:26 & యిర్మీయా 11:1-4)
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను. (గలతీ.3:13)

***********************

పంపించినది యెహోవానా లేక పంపబడినది యెహోవానా…?!

ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.” (కీర్తనలు 110:1)
పై వాక్యములోని మొదటి ప్రభువు ఎవరు? రెండవ ప్రభువు ఎవరు? దావీదువంశములోని ఒక నరుడు (దేవుని అంశముతో అవతరించకపోతే) దావీదుకు ఎలా ప్రభువు అవుతాడు? లేఖనాధారాలతో వివరించండి.* 

నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.” (యెషయా 53:4-6)
పై వాక్యములలోని “అతడు” దేవుడు పంపబోవు మెస్సయ్యా కాకపోతే మరి ఎవరు??? “మనము” ఎవరు???

ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా?” (సామెతలు 30:4)
పై వాక్యములోని “ఆయన” ఎవరు??? “ఆయన కుమారుడు” ఎవరు???*

సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా* మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచు కొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసు లకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు *సైన్యములకు అధిపతి యగు యెహోవా నన్ను పంపియున్నాడని* మీరు తెలిసి కొందురు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.” (జెకర్యా 2:8-11)
పై వాక్యములలోని “సెలవిస్తున్న యెహోవా” ఎవరు??? యూదుల మధ్యకు వచ్చి వారిమధ్య నివాసముచేయబోతున్నాను “అంటున్న యెహోవా ఎవరు”???  “పంపబడుతున్న యెహోవా” ఎవరు??? 

నేను, నేనే ఆజ్ఞ ఇచ్చినవాడను, నేనే అతని పిలిచితిని నేనే అతనిని రప్పించితిని అతని మార్గము తేజరిల్లును. నాయొద్దకు రండి యీ మాట ఆలకించుడి. ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను.” (యెషయా 48:15-16) 
పై వాక్యములలో “ఆజ్ఙ యిచ్చిన యెహోవా” ఎవరు??? ఆదినుండి మాట్లాడుతూ అది పుట్టినదిమొదలుకొని “అక్కడ వున్న వాడు” ఎవరు??? “పంపిన యెహోవా” ఎవరు???

యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.” (మలాకీ 4:5-6)
పై వాక్యములోని “మహా భయంకరమైన దినమును నియమించిన యెహోవా” ఎవరు??? తన రాకడకు ముందు “యేలియాను పంపించేది ఎవరు”??? 

నేనేర్పరచుకొనినవారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయెదరు ప్రభువగు యెహోవా నిన్ను హతముచేయును *ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.”  (యెషయా 65:15)
పై వాక్యములోని “వేరొక పేరు” యేదో వివరించగలరు!!!