యూదుమతస్తులకు ప్రశ్నలు-1

మోషేధర్మశాస్త్రము క్రింద జీవిస్తూ దానిలోని ఆజ్ఙలను/విధులను కేవలం అరకొరా మాత్రమే పాటిస్తూ దేవుని మార్గములో యనిస్తున్నామని బ్రమిస్తున్నవారికి కనువిప్పు కలిగించే ప్రశ్నలు

మోషేధర్మశాస్త్రమును అందుకొన్న ఇశ్రాయేలీయులు ఆ ధర్మశాస్త్రములోని ప్రతిమాటను అనుసరించాలి (ద్వి.కాం.12:32; యిర్మీయా 11:4). 

మోషేధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా అంటే యేఒక్కదానిలో తప్పిపోకుండా అన్ని విధులను పాటిస్తే ధర్మశాస్త్రమూలమైన నీతిని పొందవచ్చు (ద్వి.కాం.6:25).

ఎవడైనను ధర్మశాస్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును (యాకోబు 2:10)

ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని…(ద్వి.కాం.27:26; యిర్మీయా 11:1-4)

దయచేసి క్రింద యివ్వబడిన ధర్మశాస్త్రములోని కొన్ని సుళువైన ఆజ్ఙలను మీరు పాటిస్తున్నారో లేక మీరుతున్నారో దేవుని ఎదుట యదార్థహృదయముతో పరిశీలించి చూసుకోండి:

1. మీరు ఇంతవరకు తిన్న ఆహారములో పశువుల (ఎద్దు/గొర్రె/మేక/కోడి మొదలైనవి) క్రొవ్వుకూడా వుండిందా? (లే.కాం.3:16) ఒక్కసారి వున్నా మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!! 

2. తల్లిని లేక తండ్రిని దూశించిన మీ పిల్లలకు ఎప్పుడైనా మరణశిక్ష విధించారా? (ద్వి.కాం.21:18-2) “మాదేశములో అలాంటిది చట్టపరంగా ఒప్పుకోరండీ” అంటూ సాకులు చెప్పకండి. అలా మీరు చెపితే దేవుని ధర్మశాస్త్రానికన్నా మీరు ఈలోక చట్టానికే గొప్పస్థానమిచ్చీ భయపడి దాసోహమంటున్నారనేగదా దాని భావం! మరోవిశయం, మీ పిల్లలపట్ల మీకున్న ప్రేమ దేవునిపట్లా అలాగే దేవుడు మోషేద్వారా యిచ్చిన ఆజ్ఙలపట్లా వుండాల్సిన ప్రేమకన్న గొప్పదనే కదా?! ఏకారణముచేతనైనా మీరు అలా చేయకపోతే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!  

3. మీ తల చుట్టూ వెండ్రుకలను, గడ్డపు ప్రక్కలను కత్తిరింపకుండా జీవిస్తున్నారా? (లే.కాం.19:27; యిర్మియా 9:26) గడ్డాన్నే నున్నగా క్షవరం చేసికొని సోగ్గాల్లా తయారవుతుంటే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. తల చుట్టూ వెండ్రుకలను కత్తిరిస్తున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!! 

4. మీరు వేసుకునే దుస్తులలో వున్ని మరియు జనుపనార (ప్రత్తి/cotton/linen/ఖాదీ) కలిసినవాటిని వేసుకుంటున్నారా? (ద్వి.కాం.22:11) అలా చెస్తే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!  

5. మీరు సంవత్సరానికి మూడుసార్లు యెరుషలేముకు వెళ్ళి అక్కడ బలులర్పించి పండుగలను ఆచరిస్ఫున్నారా? (ని.కాం.23:14) లేకపోతే  మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. 

6. మీరెప్పుడైనా శనివారమునాడు ప్రయాణము చేసారా? (ని.కాం.16:29) అయితే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

7. మీరెప్పుడైనా శనివారమునాడు ఏపనియైనా చేసారా?(ని.కాం.20:10; లే.కాం.23:3) చేస్తే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

8. మీరెప్పుడైనా శనివారమునాడు వర్తకములో పాలుగొనడముగాని లేక సరకులు కొనడముగాని చేసారా? (నెహెమ్యా 10:31, 13:15,19; ఆమోసు 8:5) అలా చేసివుంటే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

9. విశ్రాంతిదినాచారాన్ని అంటే సబ్బాతు ఆచారాన్ని మీరినవారికి మీ సమాజములో మరణశిక్ష వేసార? (ని.కాం.31:14-15, 35:2) అలా వేయకపోతే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!  

10. మీ సమాజములో “హాని కలిగిన యెడల ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ” శిక్షగా నియమిస్తున్నారా?(ని.కాం.21:23-25; లే.కాం.24:19-20; ద్వి.కాం.19:21) అలా చేయకపోతున్నట్లయితే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!  

11.  మీ తలంపులలో లేక హృదయములో మీదికానిది/యితరులది ఆశించిన సందర్భాలున్నాయా? (ని.కాం.20:17) వుంటే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!

12. మీరు ఎప్పుడైనా వేరే దేవుని/దేవత పేరును ఉచ్చరించారా? (ని.కాం.23:13) అలా చేసి వున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!  

13.మిరు మీ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలించుకున్నారా లేదా…? (సం.కాం.15:37-38) అలా చేయకపోతే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!

మీరు సుళువైన 13 ఆజ్ఙలనే మీరకుండా పాటించలేకపోతే యిక మోషేధర్మశాస్త్రమందలి 613 ఆజ్ఙలలోని మీకు వర్తించే ఆజ్ఙలన్నింటిని పాటించే విశయములో మీ పరిస్థితి ఏమిటని ఆలోచించి చూసుకోండి!!! ???

ప్రియులారా, మోషేధర్మశాస్త్రము క్రింద జీవిస్తున్న మీరు పై లేఖనాల వెలుగులో ప్రతిదినం ఎన్ని ఆజ్ఙలను మీరుతూ ఎన్ని పాపాలను కూడగట్టుకుంటున్నారో లేక్కించుకోండి. అలాగే, ప్రతిరోజూ మోషేధర్మశాస్త్రము ప్రకారము ఎన్నిసార్లు శాపగ్రస్తులుగా చేయబడుతున్నారోనన్నది కూడా చూసుకోండి. వాటన్నిటి పర్యవసానం నిత్యనరకమన్నది మరచిపోకండి! ??? 

ఆ రకంగా మీరు కూడబెట్టుకుంటున్న లేక్కలేనన్ని శాపాలన్నింటిలోనుండి విముక్తి పొంది మీరు దేవుని నీతిని అందుకునేందుకు పరమతండ్రే సిద్ధపరచిన ఏకైక మార్గము…

ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు…క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను. (గలతీ.3:10-14) ✅✅✅

ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. (రోమా.3:20-22) ✅✅✅