యూదుమతస్తులకు ప్రశ్నలు-7

పాత/పూర్వ నిబంధన (మోషే-నిబంధన)

మోషే-నిబంధన నిత్యనిబంధన అని తనాక్ లో వుందా? వుంటే రెఫరెన్సు యివ్వండి. 

ఈ నిబంధన మానవులందరితో చేయబడిందా లేక ఇశ్రాయేలీయులతో మాత్రమే చేయబడిందా?

ఈ నిబంధన భంగము చేయబడిందా లేక యింకా అమలులోనే వుందా?

ఈ నిబంధన ప్రధాన వుద్దేశాలు యేవి? అవి నెరవేర్చబడ్డాయా?

తనాక్ బోధ ప్రకారం నిత్యజీవం పొందటము ఎలా?  వాక్యాధారాలతో వివరించండి.

తనాఖ్ లో విశ్వాసమూలమైన నీతిని పొందినవారు కాకుండా మోషేధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా పాటించి తద్వారా మోషేధర్మశాస్త్రమూలమైన నీతిని పొందినవారెవరైనా వున్నారా? లేఖనాధారాలతో చూపించండి.

మోషేధర్మశాస్త్రములోని 613 ఆజ్ఙలలోని ఎన్ని ఆజ్ఙలు భారతదేశములోని జూడాఇజమును పాటిస్తున్నవారికి వర్తిస్తాయి? ఎవరైనా ఆ ఆజ్ఙలన్నీ తు.చ. తప్పకుండా పాటిస్తున్నవారున్నారా?

మోషేధర్మశాస్త్రాన్ని అందుకున్న వ్యక్తి (ఇశ్రాయేలీయుడు) అందులోని విధులన్నింటిని పాటించాలి. ఒకవేళ వాటిని పాటించే విశయములో తప్పిపోతే (ఒక్కసారి తప్పినా సరే) శాపగ్రస్తుడవుతాడు (ద్వి.కాం.27:26; గలతీ.3:10; యాకోబు 2:10-11)

గమనిక: మోషేధర్మశాస్త్రములోని పై ఆజ్ఙలు ఇశ్రాయేలియులని లేక యూదామతప్రవిష్టులని, స్వతంత్రులని లేక చెఱలోనివారని, ఆనాడని లేక ఈనాడని భేదం చూపించడము లేదు!

తనాక్ లో కొందరు అన్యులుకూడా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించి ఆయనే తమ దేవునిగా స్వీకరించి నీతిమంతులయినట్లు సాక్షాధారాలున్నాయి. (ఉదా. యోబు, మోషే మామ, రాహాబు, రూతు, ఊరియా). అయితే, వారిలో ఎవరినికూడా యూదులని లేక ఇశ్రాయేలీయులని లేఖనాలు పేర్కొనడము లేదు. వారుకూడా తమనుతాము యూదులమనికాని ఇశ్రాయేలీయులమనికాని చెప్పుకోనూలేదు. అయితే,  తనాక్ బోధలకు మాదిరికి వ్యతిరేకముగా యూదులు వ్రాసుకున్న మనుషుల పారంపర్యాచారాల పుస్తకాలను అనుసరిస్తూ ఈనాడు అన్యులు రబ్బీల-జూడాఇజములో చేరి తమను తాము యూదులమని లేక ఇశ్రాయేలీయులమని చెప్పుకోవడం దేవుని వుగ్రతను శాపాన్ని కొనితెచ్చుకోవడము కాదా?