యూదుమతస్తుల ప్రశ్నలు-1

ప్రశ్న: యేహోవా దేవుడే గాని, యేసే గాని ధర్మశాస్ర్తని కోట్టివేస్తారని రిపరేన్స్  NT & OT (పాత- క్రోత్త నిబంధన) ఏక్కడున్నాయి???…. (ఎపెస్సి2:14…. కొలస్సి2:14)

సమాధానం:

మోషేద్వారా చేయబడిన నిబంధనకు సంబంధించిన నియమాలతోకూడిన మోషేధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు మీరడముతో ఆనిబంధన మరియు దానిలోని అంతర్భాగమైన మోషేధర్మశాస్త్రము వీగిపోయాయి. అందునుబట్టే దేవుడు క్రొత్త నిబంధనను చేయబోతున్నట్లు వాగ్ధానము చేసాడు. ఆక్రొత్త నిబంధనను పేర్కొంటున్నప్పుడే దానికి సంబంధించిన నియమాలను అంటే ధర్మశాస్త్రాన్ని సూచించాడు. కనుక మోషేనిబంధన మరియు దానికి చెందిన ధర్మశాస్త్రము లేక నియమాలు అన్నవి పాతగిలినవి క్రొత్తనిబంధన మరియు దానికి సంబంధించిన ధర్మశాస్త్రము లేక నియమాలు అన్నవి నూతనమైనవి. మోషేనిబంధనను “నిత్యనిబంధన” గా తనాక్ లో దేవుడు పేర్కొనలేదు గుర్తించనూలేదు. అయినా, ఈ నిబంధనను భంగం చేసింది దేవుడు కాదు ఇశ్రాయేలీయులు. అందుకే తాను ఒక క్రొత్తనిబంధనను చేయబోతున్నట్లు దేవుడే వాగ్ధానం చేసాడు (యిర్మియా 31:31-34) 

అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవి యొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారి కాజ్ఞాపించిన యీనిబంధన మాటలన్నిటిననుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటి నన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను.మరియు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెనుయూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగముచేసి యున్నారు.” (యిర్మీయా 11:8-11)

తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీ యులకు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, యిదివరకు మీరు చేసిన హేయక్రియలన్ని చాలును. ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నానిబంధననుభంగపరచిరి. నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువు లను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.” (యెహెజ్కేలు 44:7-8)

సోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలనేదే నా హృదయవాంఛ, వారి గురించిన నా ప్రార్థన. దేవుని విషయంలో వారు బహు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యమిస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానయుక్తమైంది కాదు. అయితే వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వంత నీతిని అనుసరించి నడుచుకొంటూ దేవుని నీతికి విధేయత చూపలేదు. నీతి విషయంలో నమ్మిన ప్రతి ఒక్కరికీ క్రీస్తు ధర్మశాస్త్రానికిముగింపుగా ఉన్నాడు.” (రోమా.10:1-4)

“19 ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దానిని కలిపాడు. ఎవరికి ఆ వాగ్దానం చేశాడో ఆసంతానంవచ్చేవరకుఅదిఅమల్లోఉంది. దానిని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు.” (గలతీ.3:19)

ఆయన ‘కొత్త ఒప్పందం’  (New-Covanent )అని చెప్పడం వల్ల, మొదటిఒప్పందాన్ని (మోషే-నిబంధన/Mosaic-Covenant) పాతదిగాచేశాడు. పాతదని (పాతనిబంధన/Old-Covenant) ప్రకటన జరిగింది, అదృశ్యం కావడానికి సిద్ధంగా ఉంది.” (హెబ్రీ.8:13)

పైన చెప్పినట్టుగా ఆయన “నువ్వు బలులను గానీ, కానుకలను గానీ దహన బలులను గానీ పాప పరిహారం కోసం చేసే బలులను గానీ కోరుకోవు, ధర్మశాస్త్రం ప్రకారం జరిగే వీటిలో నీకు సంతోషం ఉండదు” అన్నాడు. ఆ తర్వాత ఆయన “చూడు, నీ ఇష్ట ప్రకారం చేయడానికి నేనున్నాను” అని చెప్పాడు. రెండోప్రక్రియను (క్రీస్తుధర్మశాస్త్రము లేక క్రీస్తునియమము) నెలకొల్పడానికి ఆయన మొదటిప్రక్రియను (మోషేధర్మశాస్త్రము) పక్కనపెట్టేశాడు. ఈ రెండో ప్రక్రియలో యేసు క్రీస్తు దేహం ఒక్కసారే బలి కావడం చేత దేవుని ఇష్ట ప్రకారం మనకు శుద్ధి జరిగింది.” (హెబ్రీ.10:8-10)

ప్రశ్న: యెహోవా దేవుడే  యేసును పంపాడు అని OT (పాత నిబంధన)లో ఏక్కడ రిపరేన్స్???….( యెహన్17:3)

సమాధానం: 

దేవుడైన యెహోవాయే ప్రభువైన యేసు క్రీస్తును ఈలోకంలోకి పంపించాడు. అందుకు పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లోని ఆధారాలు:

1) దేవుడు అబ్రహాము సంతానముద్వారా సకల వంశాలను ఆశిర్వాదిస్తాను అంటూ వాగ్ధానం చేసాడు. ఆ వాగ్ధానం ప్రభువైన యేసు క్రీస్తునందు నెరవేర్చ బడింది (ఆది.కాం.12:1-7, 18:18, 22:17-18 = రోమా.4:13-25; గలతి.3:7-9, 26-29, 4:28-31). 

2) దేవుడు మోషేవంటి ప్రవక్తను పంపబోతున్నట్లు వాగ్ధానం చేసాడు. ఆ వాగ్ధానం ప్రభువైన యేసు క్రీస్తులో నెరవేర్చబడింది (ద్వి.కాం.18:15-19=అపో.కా.3:17-26).

3) దేవుడు తన సేవకున్ని పాపపరిహారార్థబలిగా మరియు ప్రజలందరికి నిబంధనగా స్థిరపరచబోతున్నట్లు వాగ్ధానం చేసాడు. ఆ వాగ్ధానము ప్రభువైన యేసు క్రీస్తునందు నెరవేర్చబడింది (యెషయా 42:1-7; 52:13-53:12=మత్తయి 12:18-21; 17:5; 27:1-66; లూకా 22:14-21).  

ప్రశ్న: యేసు శిలువపై మరణించి మూడు దినలలో లేస్తాడని ఏక్కడ OT (పాత నిబంధన) లో రిపరేన్స్????… (మత్తయి12:40)

సమాధానం: 

యోనా మూడు రాత్రింబగళ్లు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భంలో ఉంటాడు.” (మత్తయి12:40)

ఇక్కడ యోనాకు జరిగిన సంఘటన ఒక సాదృశ్యంగా తీసుకొనబడింది. అంతేకాని “పాత నిబంధనలో ఆయన ముడుదినాల తరువాత తిరిగి లేస్తాడు అని వ్రాయబడి వుంది” అని యిక్కడ చెప్పబడలేదు. అయినా వాక్యములో లేనిదాన్ని వున్నట్లు వూహించుకొని పై ప్రశ్నను అడగడము అమాయకులను మోసం చేయటానికే కదా!!!    

ప్రశ్న: యేసు పరిశుద్దత్మ వలన పుడుతాడని OT(పాత నిబంధన) ఏక్కడ రిపరేన్స్????…(మత్తయి1:18)

సమాధానం: 

యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో పెళ్లి నిశ్చయం అయింది కానీ వాళ్ళు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది.” (మత్తయి1:18) 

పై లేఖనము యేసు క్రీస్తు ప్రభువు జననాన్నిగురించి ప్రకటించింది. ఆ లేఖనము “యేసు క్రీస్తు జననము ఆరకంగా వుంటుందని పాత నిబంధన గ్రంథములో లేక ప్రవక్తల గ్రంథాలలో వ్రాయబడి వుంది” అని చెప్పడములేదు. అసలు యేసు క్రీస్తు ప్రభువు జీవితములో జరిగిన సంఘటనలన్నీ పాత నిబంధన గ్రంథములో పేర్కొనబడివుండాలన్న నియమము వుందా? వుంటే ఆ నియమము యెక్కడవుంది?

ప్రశ్న: బలుల వలన అసలు పాపక్షమాపణ కలగదని OT(పాత నిబంధన) లో ఏక్కడ రిపరేన్స్????… (హెబ్రీ10:4)

సమాధానం: 

ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాన్ని తీసివేయడం అసాధ్యం.”  (హెబ్రీ10:4)

ఈవాక్యంలో “బలుల వలన అసలు పాపక్షమాపణ కలగదు” అని వ్రాయబడలేదు. ఈవాక్యంలో చెప్పబడిన సత్యం “పశువుల రక్తం పాపాలను తీసివేయ లేదు” అన్నది. పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లోని దేవుని ఉపదేశము ప్రకారం పశువుల బలులను బట్టి తద్వారా ప్రొక్షించబడే వాటి రక్తాన్ని బట్టి పాపక్షమాపణ పొందవచ్చు కారణం పాపాలు ఆ బలులవలన వాటి రక్తం వలన “కప్పబడుతాయి,” (כָּפַר:kafar=cover over; atonement) కాని పాపాలు తొలగించబడుతాయి అని కాదు. పశువుల రక్తం పాపాన్ని తీసివేయలేదు. అందుకే పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లో యెక్కడకూడా పశువులరక్తం పాపాన్ని తొలగిస్తుంది అని చెప్పడము లేదు. కేవలము కప్పుతుంది అని మాత్రం ప్రకటిస్తున్నది. ఆ దినాలలో కేవలము ఈ కప్పడముద్వారా దేవుడు పాపక్షమాపణను అనుగ్రహిచాడు. కారణం, లేఖనాలు ప్రకటిస్తున్నట్లుగా దేవుని నిత్య ప్రణాలికలో తానే సంకల్పించి, నిర్ధారించి, నెరవేర్చబోయే తన సేవకుడు/కుమారుడు అయిన మెస్సయ్య యొక్క బలియాగముద్వారా సర్వ మానవాళి పాపాలకు సంపుర్ణ పరిహారం లభించనుంది (యెషయా.53:1-12; దానియేలు 9:24-26).

ఈ వివరణను అంగీకరించనివారు (యూదులైన లేక యూదామతములో వున్నవారైనా) పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లో దేవుడు “పశువులరక్తం పాపాలను తీసివేస్తుంది” అని యెక్కడ చెప్పాడో దయచేసి చూపించండి? 

ప్రశ్న: నరబలి ద్వారా పాపక్షమాపణ జరుగుతుందని ఏక్కడ OT(పాత నిబంధన) లో రిపరేన్స్????…?మత్తయి 26:28)

సమాధానం: 

ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం.” (మత్తయి 26:28)

గమనించాలి, పై వాక్యములో “నరబలి” అన్న పదం లేదు. మోషేధర్మశాస్త్రములో దేవుడు ఇశ్రాయేలీయులకు నరబలి అర్పించండి అంటూ ఏ ఆజ్ఙ యివ్వలేదు. అయితే, మోషేధర్మశాస్త్రము తరువాత ప్రవక్తల గ్రంథాలలో దేవుడు తన నిత్య ప్రణాలికను బట్టి తన సంకల్పముచొప్పున, తన ప్రణాలిక ప్రకారం, తానే నిర్ధేశించి నిర్వహించబోయే తన సేవకుని/కుమారుని  బలియాగముద్వారా మానవాళికి క్షమాపణను అనుగ్రహించి పాపులైన వారిని నిర్దోశులుగా చేయబోతున్న వైనాన్ని విశదీకరించాడు (యేషయా 52:13-53:12; దానియేలు 9:24-26). ఈ దైవరక్షణ నిజమైన పశ్చత్తాపము మరియు మారుమనస్సు పొంది దేవుడే అనుగ్రహించి నిర్వహించిన దైవ-మానవ బలియాగమైన ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క సిలువమరణాన్ని విశ్వసించిన వారికి మాత్రమే అనుగ్రహించబడుతుంది. దీన్ని విశ్వాసముద్వారా కృపచేతనే పొందగలము (ఎఫెసీ.2:8). దీన్ని పొందినవారు ఆత్మలో తిరిగిజన్మించిన అనుభవాన్ని పొంది (యోహాను 3:2-8) నీతిమార్గములో క్రీస్తు బోధలో/నియమాలలో లేక క్రీస్తుధర్మశాస్త్రములో నడుచుకోవాలి. ఈ ధర్మశాస్త్రము మోషేధర్మశాస్త్రముకన్నా ఎంతో శ్రేష్టమైనది. ఇది క్రొత్త నిబంధన గ్రంథములో పరమతండ్రి అందించిన బోధ. 

యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) మరి శ్రేష్టమైన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా వుండి (హెబ్రీ.8:6-7, 9:15) పూర్వ/పాత నిబంధనలో భాగంగా వుండిన మోషేధర్మశాస్త్రానికన్నా శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధనలో భాగంగా అందించాడు (యోహాను 13:34-35, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6). దాన్నే క్రీస్తు నియమము (Law of Christ—గలతీ.6:2) లేక ఆత్మ నియమము (Law of the Spirit—రోమా.8:2) అని లేఖనాలు పేర్కొంటున్నాయి.  

ప్రశ్న: వాక్యం శరీరదారియై ఈ లోకములో జన్మిస్తుందనీ యేహోవా దేవుడు పాతనిబంధన గ్రంథంలో ఏక్కడైన చేప్పాడా????.. (యోహాను.1:14)

సమాధానం: 

ఆ వాక్కు శరీరమై మన మధ్యలో కృపాసత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ప్రత్యేక వ్యక్తికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము.” (యోహాను.1:14)

పై వాక్యములో “వాక్యం శరీరదారియై ఈ లోకములో జన్మిస్తుందనీ యేహోవా దేవుడు పాతనిబంధన గ్రంథంలో చెప్పాడు” అని వ్రాయబడలేదు అన్నది గ్రహించాలి. ఆమాటకొస్తే, క్రొత్త నిబంధన గ్రంథములో వివరించబడిన ప్రతీది పాత నిబంధన గ్రంథములో వ్రాయబడివుండాలి అన్న నియమమేదీ లేదు. దేవుడు తన సేవకుని లేక కుమారుని ఈలోకంలోకి పంపబోతున్నట్లు పాత నిబంధన గ్రంథములో (తనాఖ్) లో వాగ్ధానం చేసాడు. ఆ వాగ్ధానపు నెరవేర్పును క్రొత్త నిబంధన గ్రంథములో ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) నందు చూడగలము. అదేవిధంగా, దేవుడు పంపగా వచ్చిన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క అసలు గురింపుకు మరియు అస్థిత్వాలకు సంబంధించిన వివరాలనుకూడా క్రొత్త నిబంధన గ్రంథములో దేవుడు అందించాడు (యోహాను 1:1,14; ఫిలిప్పీ.2:5-8; రోమా.9:5; 2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15. తీతు.1:13; హెబ్రీ.1:6). ఈ దైవసత్యాన్ని గ్రహించనివారు లేక అంగీకరించనివారు ఆత్మీయ అంధకారములోనే కొనసాగి నిత్యనాశనములోకి ప్రవేశిస్తారు.

ప్రశ్న: జంతుబల( లేవి5:6) ..విరిగిన నలిగిన మనస్సు( మనస్సు మార్చుకోని- పాపాలు విడిచి)తో కాకుండా నరబలితో పాపక్షమాపన జరుగుతుందని యేహోవా దేవుడు పాతనిబంధన గ్రంథములో ఏక్కడైన చేప్పాడా???….(యోహాను.1:29)

సమాధానం: 

తర్వాత రోజు యేసు యోహాను దగ్గరకు వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకంలోని పాపాన్నంతా తీసివేసే దేవుని గొర్రెపిల్ల!” (యోహాను.1:29)

మోషేధర్మశాస్త్రములో పేర్కొనబడ్డ జంతుబలులు పరిమితమైనవి. అందుకే అవి ప్రతి సంవత్సరము, అనేకసార్లు అర్పించాల్సిన అవ్వశ్యకత వుండినది. అవి రాబోవు దినాలలో దేవుడే అనుగ్రహించబోయే శ్రేష్టమైన మరియు సంపూర్ణమైన బల్యర్పణకు సూచనగా లేక చాయగా వుండినవి. గత రెండువేల సంవత్సరాలుగా జంతుబలులను అర్పించే విధానము తొలగించబడింది. కారణం, వాటిని తొలగించకముందే దేవుడు మానవులందరి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని అందించే దేవుని బల్యర్పణ ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) నందు పూర్తిచేయబడింది (యెషయా.52:13-53:12; దానియేలు 9:24-26).