యూదుమతస్తుల ప్రశ్నలు-3

ప్రశ్న: ధర్మశాస్త్రము కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమేనా??

సమాధానము

అవును, ధర్మశాస్త్రము అంటే మోషేద్వారా యివ్వబడిన ధర్మశాస్త్రము లేక మోషేధర్మశాస్త్రము (Hebrew:תּוֹרַ֖תמֹשֶׁ֣ה=tawrat Moshe/Law of Moses) దేవుడు కేవళము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేసిన నిబంధనలోని భాగము కనుక అది ఇశ్రాయేలీయులకు మాత్రమే వర్తిస్తుంది.  

దేవుడు చేసిన నోవహునిబంధన సర్వశరీరులతో చేసిన నిబంధన. ఆ నిబంధనలోని నియమాలు సర్వశరీరులకు వర్తిస్తాయి. అయితే, దేవుడు చేసిన మోషేనిబంధన సర్వశరీరులతో చేసిన నోవహునిబంధన వంటిది కాదు. అది దేవుడు తాను యేర్పరచుకొన్న ఒక ప్రత్యేకమైన జనాంగముతో చేసిన నిబంధన. కనుక ఈ నిబంధనకు సంబంధించిన నియమాలు (మొషేధర్మశాస్త్రము/Law of Moses) కూడా ఈ నిబంధనలో ఒక పక్షముగా వున్న దేవుడేర్పరచుకొన్న ప్రత్యేకమైన జనాంగమునకు (ఇశ్రాయేలీయులకు) మాత్రమే వర్తిస్తాయి. 

నోవహునిబంధన

“1 మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. 2 మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. 3 ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. 4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము. 5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. 6 నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. 7 మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. 8 మరియు దేవుడు నోవహు అతని కుమారులతో 9 ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, 10 పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నానిబంధనస్థిరపరచుచున్నాను. 11 నేను మీతో నానిబంధనస్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను….15 అప్పుడు నాకునుమీకునుసమస్తజీవరాసులకునుమధ్యనున్ననానిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు 16 ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్యనిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. 17 మరియు దేవుడు నాకునుభూమిమీదనున్నసమస్తశరీరులకునుమధ్యనేనుస్థిరపరచిననిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.” (ఆ.కాం.9:1…15-17)

మోషేనిబంధన

“3 మోషే దేవునియొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతమునుండి అతనిపిలిచినీవుయాకోబుకుటుంబికులతోముచ్చటించిఇశ్రాయేలీయులకుతెలుపవలసినదేమనగా 4 — నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్దరెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. 5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచిన పక్షమందు మీరు సమస్తదేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. 6 సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవుఇశ్రాయేలీయులతోపలుకవలసినమాటలుఇవేఅనిచెప్పగా 7 మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.” (ని.కాం.19:3-6)

“3 మోషేవచ్చియెహోవామాటలన్నిటినివిధులన్నిటినిప్రజలతోవివరించిచెప్పెను. ప్రజలందరుయెహోవాచెప్పినమాటలన్నిటిప్రకారముచేసెదమనియేకశబ్దముతోఉత్తరమిచ్చిరి.4 మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పన్నెండు గోత్రములు చొప్పున పన్నెండు స్తంభములను కట్టి 5 ఇశ్రాయేలీయులలో యౌనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించిరి. 6 అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. 7 అతడు నిబంధనగ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగావారు–యెహోవా చెప్పినవన్న చేయుచు విధేయులమై యుందుమనిరి. 8 అప్పుడు మోషే రక్తమును తీసికొని *ప్రజలమీదప్రోక్షించి*—ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధనరక్తము ఇదే అనిచెప్పెను.” (ని.కాం.24:3-8)

“5 నా దేవుడైన యెహోవా నాకాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. 6 ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి–నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలుగల జనమని చెప్పుకొందురు. 7 ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? 8 మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్పజనమేది?” (ద్వి.కాం.4:5-8)

“1 మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెనుఇశ్రాయేలీయులారా, నేను మీవినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి. 2 మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. 3 యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీనిబంధన చేసెను. 4 యెహోవా ఆ కొండమీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు. 5 గనుక యెహోవామాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను.” (ద్వి.కాం.5:1-5)

“1 యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిననిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధనవాక్యములు ఇవే.” (ద్వి.కాం.29:1)

“4 హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నాసేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దానికట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.” (మలాకి 4:4)

“4 వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, ఆరాధన ఆచారాలు, *వాగ్దానాలు వీరికున్నాయి. 5 పూర్వికులు వీరివారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చింది వీరిలోనుండే. ఈయన సర్వాధికారియైన దేవుడు, శాశ్వత కాలం స్తుతిపాత్రుడు, ఆమేన్‌.” (రోమా.9:4-5)

“1 కాబట్టి పూర్వం మీరు శారీరకంగా యూదేతరులు. ‘సున్నతి పొందిన యూదులు’ మిమ్మల్ని ‘సున్నతి లేనివారు’ అని పిలిచేవారు. ఈ సున్నతిని శరీరంలో చేతితో, మనుషులు చేశారు. 12 ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. *ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాననిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు.” (ఎఫెసీ. 2:11-12)

మోషేద్వార యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటికి ఒప్పుకున్నదిఇశ్రాయేలుప్రజలు. ఆసందర్భములో చేయబడుతున్న దేవుని నిబంధన మాటలు అన్యులకు చెప్పబడలేదు మరియు అన్యులెవరు ఆ నిబంధన మాటలకు ఇశ్రాయేలీయులవలె తమ సమ్మతిని తెలియజేసి నిబంధనలో పాలుపొందలేదు. మోషేధర్మశాస్త్రము దేవుడు మరియు ఇశ్రాయేలీయులు రెండు పక్షాలుగా యేకీభవించి చేసిన ద్వైపాక్షిక (bilateral) నిబంధనకు పరిమితమైనది. ఈనిబంధన/ఒడంబడిక దేవుడు మరియు సర్వశరీరులమధ్య చేయబడిన నిబంధన/ఒడంబడికకాదు.

“7 మోషే వచ్చి ప్రజలపెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.* 8 అందుకు ప్రజలందరుయెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజలమాటలను యెహోవాకు తెలియచేసెను.” (ని.కాం.19:7-8)

మోషేద్వార చేయబడిన నిబంధన మోషే యెదుట నిలబడిన ఇశ్రాయేలీయులతో మాత్రమే కాక ఆసమయములో అక్కడలేని అంటే పుట్టబోయే ఇశ్రాయేలీయుల సంతానముతో లేక రాబోవు ఇశ్రాయేలు తరాలందరితో చేయబడిన నిబంధన అది.

ద్వితియోపదేశకాండము 29:14-15…29 “నేను మీతోమాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారితోను 15 ఇక్కడ నేడు మనతోకూడ నుండనివారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను…రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మనసంతతివారివియు నగునని చెప్పుదురు.” 

“24 కాబట్టి మీరు నిరంతరము మీకును మీకుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.” (ని.కాం.12:24)

సంఖ్యాకాండము 15: 15

“సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును.”

పూర్వ/పాత నిబంధన మరియు నిబంధనలో భాగమైయున్న మోషేధర్మశాస్త్రము సర్వశరీరులకు వర్తించదు కాని ఇశ్రాయేలీయులతోపాటు వారిమధ్య నివసిస్తూ ఈలోకములో పాలస్తినాదేశస్వాస్థ్యన్ని గూర్చిన వాగ్ధానములో పాలుపొందే అన్యులకు అంటే ఇశ్రాయేలీయుల దాసదాసీలకు మరియు ఇశ్రాయేలు మతప్రవిష్టులకు కూడా వర్తిస్తుంది. కనుక, ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న అన్యులకుకూడా ఇశ్రాయేలీయులవలె వాగ్ధానములోని మేళ్ళు శిక్షలు వర్తిస్తాయి. ఈ మేళ్ళు శిక్షలు సర్వశరీరులనుద్ధేషించి యివ్వబడలేదు అందుకే అవి సర్వశరీరులకు వర్తించవు. ఈ సందర్భంగా “మీకు మీ మధ్య నివసిస్తున్న పరదేశికి” అంటూ లేఖనాలు నొక్కివక్కాణిస్తున్నాయి, కాని “మీకు లోకములోని నరులందరికీ” అంటూ లేఖనాలు చెప్పడములేదు అన్నది గ్రహించాలి.

“15 సంఘమునకు, అనగా మీకును మీలో నివసించుపరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. 16 మీకును మీయొద్ద నివసించుపరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను…29 ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారిమధ్యను నివసించుపరదేశి యేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను. 30 అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియే గాని యెవడైనను సాహసించి పాపముచేసినయెడల 31 వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును; వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయ బడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు.” (సం.కా.15:15-16…29-31)

“2 నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచ కుండ దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. 3 యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తనజనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.  4 నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు  5 నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను  6 విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నానిబంధనను ఆధారముచేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవానామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్యచేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను 7 నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.” (యెషయా 56:2-7)

ప్రశ్న: 1రాజులు 8: 41 మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమును బట్టి దూర దేశము నుండి వచ్చి

సమాధానము

అవును మోషేధర్మశాస్త్రదినాలలో అన్యులుకూడా వచ్చి ఆయనను పూజించారు. అంతేకాని వారు మోషేధర్మశాస్త్రనంతటిని పాటించారని కాని లేక వచ్చి యూదులుగా లేక ఇశ్రాయేలీయులుగా మారారని దాని అర్థం కాదు!!!

ప్రశ్న: 1రాజులు 8: 42 నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల

సమాధానము

అవును మోషేధర్మశాస్త్రదినాలలో అన్యులుకూడా సొలోమోను కట్టించిన దేవుని మందిరముతట్టు తిరిగి ప్రార్థించారు. అంతేకాని వారు మోషేధర్మశాస్త్రనంతటిని పాటించారని కాని లేక వచ్చి యూదులుగా లేక ఇశ్రాయేలీయులుగా మారారని దాని అర్థం కాదు!!! 

ప్రశ్న: 1రాజులు 8: 43 ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొనుదాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రాయేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టించిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడినదని తెలిసికొందురు.

సమాధానము

అవును అన్యులుకూడా దేవుని నామాన్ని తెలుసుకొంటారు మరియు భయభక్తులు కలిగి వుంటారు. దాని భావం అన్యులుకూడా మోషేధర్మశాస్త్రనంతటిని పాటించారని కాని లేక వచ్చి యూదులుగా లేక ఇశ్రాయేలీయులుగా మారారని దాని అర్థం కాదు!!! ఒకవేళ అలా వూహించుకొన్నా అది కేవళము పాత నిబంధన కాలానికే అంటే క్రొత్త నిబంధన కాలాం మొదలు కాకముందువరకే సాధ్యమవుతుంది.

*ప్రశ్న:* ప్రసంగి 12: 13 ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.

*సమాధానము*

పాత నిబంధన గ్రంథము (తనాఖ్) లోనైనా లేక క్రొత్త నిబంధన గ్రంథములోనైన అందరికీ (యూదులకు మరియు అన్యులకు) వర్తించే దైవ బోధ: దేవునియందుభయభక్తులుకలిగియుండిఆయనకట్టడలననుసరించినడుచుచుండవలెను.   

ఆదామునిబంధన (Adamic Covenant—ఆది.కాం.3:15-21) సందర్భంగా యివ్వబడిన దేవుని కట్టడలు ఆదాముకు ఆయనతో వుండిన హవ్వకు వర్తిస్తాయి. మోషేనిబంధన సందర్భంగా ఇశ్రాయేలీయులకు యివ్వబడిన మోషేధర్మశాస్త్ర కట్టడలు ఆదాము హవ్వలకు యివ్వబడలేదు. కనుక ఆదాము హవ్వలు తమకివ్వబడిన కట్టడలను బట్టి దేవునియందు భయభక్తులు కలిగి వుండాలి. కాని, తమకు యివ్వబడని కట్టడలనుబట్టి భయభక్తులు కలిగివుండాలి కోరబడలేరు, కోరబడలేదు.

నోవహునిబంధన (Noahaic Covenant—ఆది.కాం.9:1-17) సందర్భంగా దేవుని కట్టడలు అందరికీ యివ్వబడ్డాయి. కాని వారికి  మోషేనిబంధన సందర్భంగా ఇశ్రాయేలీయులకు యివ్వబడిన మోషేధర్మశాస్త్ర కట్టడలు యివ్వబడలేదు. కనుక నోవహు కాలములో వారికివ్వబడిన కట్టడలనుబట్టి దేవునియందు భయభక్తులు కలిగివుండాలి. కాని, తమకు యివ్వబడని కట్టడలనుబట్టి భయభక్తులు కలిగివుండాలి కోరబడలేరు, కోరబడలేదు.

అబ్రహామునిబంధన (Abrahamic Covenant—ఆది.కాం.12:1-3, 15:1-21, 17:1-21) సందర్భంగా యివ్వబడిన కట్టడలు ఆయనకు ఆయన సంతానానికి ఆయనతో వున్నవారికి యివ్వబడ్డాయి. అంతేకాని, వారికి మోషేనిబంధన సందర్భంగా ఇశ్రాయేలీయులకు యివ్వబడిన మోషేధర్మశాస్త్ర కట్టడలు యివ్వబడలేదు. కనుక అబ్రహాము కాలములో అభ్రహాము మరియు ఆయన సంబందులు దేవుడు తమకిచ్చిన కట్టడలను అనుసరించి నడుచుకొంటూ దేవునియందు భయభక్తులు కలిగివుండాలి. కాని, తమకు యివ్వబడని కట్టడలనుబట్టి భయభక్తులు కలిగివుండాలి కోరబడలేరు, కోరబడలేదు.

మోషేనిబంధన (Mosaic Covenant–ని.కాం.19:3-24:11; ద్వితీ.కాం. 4:1-5:21) సందర్భంగా సందర్భంగా యివ్వబడిన కట్టడలు ఇశ్రాయేలియులకు వారి సంతానానికి యివ్వబడ్డాయి. ఇశ్రాయేలీయులు మోషేధర్మశాస్త్రము ప్రకారము వారికి యివ్వబడిన కట్టడలను అనుసరించడముద్వారా దేవునియందు భయభక్తులు కలిగివుండాలి.       

చివరగా, క్రొత్త నిబంధన (New Covenant—యెషయా 42:1-7; 49:7-10; యిర్మీయ 31:31-34; యెహెజ్కేలు 16:60, 37:24-28; హోషేయ 2:14-23; జెకర్యా 9:9-17; లూకా 22:19-20; రోమా.8:2; 1కొరింథీ.11:25; గలతీ.6:2; 1 తిమోతీ.2:3-6; హెబ్రీ.9:15, 12:24) సందర్భముగా యివ్వబడిన కట్టడలు ఈనిబంధనలోకి ప్రవేశించే యూదులైనా లేక అన్యులైనా అందరూ ఈకట్టడలను అనుసరించి దేవునియందు భయభక్తులు కలిగివుండాలి. కాని, తమకు యివ్వబడని కట్టడలనుబట్టి భయభక్తులు కలిగివుండాలి కోరబడలేరు, కోరబడలేదు.

ఇక నీనెవె పట్టణ నివాసులవిశయానికొస్తే దేవుడు వారికి యోనాద్వారా యిచ్చిన వుపదేశము లేక సందేశమే వారికివ్వబడిన ఆజ్ఙ లేక కట్టడ–“యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణ మంతదూరము సంచరించుచుఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా” (యోనా 3:4). దాన్ని వారు విని, గ్రహించి, దానికి లోబడ్డారు. అందునుబట్టి దేవుడు వారి పాపాలను క్షమించాడు. 

గమనిక: ఇక్కడ యోనా నీనెవె పట్టణస్తులకు మోషేధర్మశాస్త్రమంతటిని బోధించలేదు.  వారు మోషేధర్మశాస్త్రము ప్రకారము దేవునికి బలులను అర్పించనూ లేదు. నీనెవె పట్టణస్తులు పశ్చత్తాపపడటముద్వారా నీతిమంతులుగా తీర్చబడి యూదులుగా లేక ఇశ్రాయేలీయులుగా మారలేదు. నీనెవె పట్టణస్తులు పశ్చత్తాపపడటముద్వారా తమకు భౌతికంగా ఈలోకంలో రాబోతున్న దుర్గతి లేక దేవుని శిక్షను తప్పించుకున్నారు. అదీ కొంతకాలమువరకే నన్నది చరిత్ర ప్రకారము గ్రహించవచ్చు. 

ప్రశ్న: మీకా 4: 1 అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు.

“కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి *సీయోనులోనుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకోందురు.” (మీకా 4: 2)

సమాధానము

మీకా 4: 1-2 “అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సీయోనులోనుండి ధర్మశాస్త్రమును [תּוֹרָה/torah=ఉపదేశము; చట్టము], యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్లును; యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకొందము అని చెప్పుకొందురు.”

“4:2 And many nations shall come, and say, Come, and let us go up to the mountain of the LORD, and to the house of the God of Jacob; and he will teach us of his ways, and we will walk in his paths: for the law  [תּוֹרָה/torah=instruction; law] shall go forth of Zion, and the word of the LORD from Jerusalem.” (Jewish Translation of Tanakh) 

హీబ్రూ భాషలోని ‘తోరా’ [תּוֹרָה/torah] అనే పదానికి రెండు ప్రధాన అర్థాలున్నాయి. ఒకటి ఉపదేశము, రెండు చట్టము.

పాతనిబంధ గ్రంథము (తనాఖ్) లో ‘తోరా’ అన్న పదం అనేకసార్లు ఆయా విధాలుగా వుపయోగించబడింది. ఈ క్రింద కొన్ని ఉదాహరణలివ్వబడ్డాయి:

(1) “ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను [תּוֹרָה/torah] గైకొనెనని చెప్పెను.” (ఆది.కాం.26:5)
(2) “ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి [תּוֹרָה/torah].” (లేవీ.కాం.14:57) 
(3) “మోషే ధర్మశాస్త్రగ్రంథములో [תּוֹרָה/torah] వ్రాయబడిన ప్రకారము” (యెహోషువ 8:30) 
(4) ” నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును [תּוֹרָה/torah] త్రోసివేయకుము.” (సామెతలు 6:20)
(5) “జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము [תּוֹרָה/torah] ఆమె బోధించును.” (సామెతలు 31:26)
(6) “భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు [మెస్సయ్యా/మషియాఖ్] మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని [మెస్సయ్యా/మషియాఖ్] బోధ (תּוֹרָה/torah) కొరకు కనిపెట్టును.” (42:4) 

దేవుడు అదాముకు యిచ్చింది ‘తోరా’ నోవాహుకు యిచ్చింది ‘తోరా’ అబ్రహాముకు యిచ్చింది ‘తోరా’ మోషేకు యిచ్చింది కూడా ‘తోరా.’ అయితే, అందరికిచ్చింది ఒకే ‘తోరా’ కాదు. ‘తోరా’ అంటేనే వుపదేశము లేక చట్టము. ఒకవిధంగా చెప్పాలంటే దేవుడు ఎవరికి వుపదేశము యిచ్చినా దాన్ని ‘తోరా’ గా పరిగణించాలి. దేవుని వుపదేశము ఆయా వ్యక్తులకు ఆయావిధంగా వున్నా ప్రతి వుపదేశాన్ని ‘తోరా’ గా గుర్తించాలి. అలా అని ఆదాముకు యిచ్చిన వుపదేశము లేక ‘తోరా’ నోవహుకు యిచ్చిన ‘తోరా’ ఒకటేనని తీర్మానించకూడదు; అబ్రహాముకు యిచ్చిన ‘తోరా’ మోషేకు యిచ్చిన ‘తోరా’ ఒకటేనని తీర్మానించకూడదు. అయితే, మెస్సయ్యద్వారా యివ్వబడే తోరా (ఉపదేశము) వీటన్నిటిలో ఉత్క్రుష్టమైనది!

అయితే, మోషేనిబంధన ఇశ్రాయేలీయులు భంగము చేయడమువలన క్రొత్త నిబంధన చేస్తాను అంటూ దేవుడు ప్రవక్తల కాలములో వాగ్ధానము చేసి (యెషయా 42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయ 31:31-34; యెహెజ్కేలు 16:60, 37:24-28) దాన్ని రెండువేల సంవత్సరముల క్రితం ప్రభువైన యేసు క్రీస్తు నందు నెరవేర్చాడు (లూకా 22:14-20). క్రొత్త నిబంధన సందర్భములో యివ్వబడిన ‘తోరా’ లేక ‘నొమొస్ ‘ (Greek:νόμος=చట్టము; నియమము) అన్నది క్రీస్తుతోరా లేక క్రీస్తు నియమము (Law of Christ—గలతీ.6:2) అని పిలువబడుతుంది. క్రొత్త నిబంధనకు సంబంధించిన ఈ క్రీస్తునియమమే (యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6) పాత నిబంధనకు సంబంధించిన మోషేధర్మశాస్త్రము (Greek:νόμῳ Μωυσέως/nomo Mouseos=Law of Moses) స్థానములో అమలులోకి వచ్చింది. ఈరకంగా దేవుని సేవకుడు/కుమారుడు అయిన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) ద్వారా దేవునిచేత

రక్షించబడి దేవుని కుమారులుగా మారినవారందరు మోషేధర్మశాస్త్రానికి చరమగీతం పాడి క్రీస్తునియమానికి లోబడి దేవునియందు భయభక్తులు కలిగి జీవించాలి.

కనుక, అంత్యదినాలలో అన్యులు యెరూషలేముకు వచ్చి దేవుని వుపదేశమును లేక చట్టమును (ధర్మశాస్త్రము) అందుకుంటారు. ఈ వుపదేశము లేక చట్టము అన్నది మోషేధర్మశాస్త్రముకాదు, యిది క్రొత్త నిబంధన సంబంధముగా యివ్వబడిన క్రీస్తు నియమము లేక చట్టము.