యూదుమతస్తుల ప్రశ్నలు-4

ప్రశ్న: బ్రదర్….ఆఙ్ఞ అతిక్రమం పాపమని తేలియాదా???

జవాబు: తెలుసు, బ్రదర్!!!  

ప్రశ్న: యేసు విశ్రాంతి దినాని మిరాడు…ఒక ఆఙ్ఞ విషయాములో తప్పి పోతే ఆఙ్ఞలన్ని విషయాములో అపరాధి అని తేలియాదా???

జవాబు: విశ్రాంతిదినాన్ని యేసు మీరాడు, మీరాడు, మీరాడు అంటు స్వంతభ్రమలను వళ్ళించుకుంటూ పోతే సరిపోదు. విశ్రాంతిదినాన్ని యేసు యెప్పుడు యెక్కడ ఏవిధంగా మీరాడు? మీకు ‘ఆవిశయం’ తెలియచేసింది ఎవరు? అవిశయం తెలియచేసినవారు చెప్పింది సత్యమేనని ఒప్పుకుంటారా? ముందు వివరాలివ్వండి, బ్రదర్! మీరిచ్చే వివరాలను బట్టి ఆయన మీరాడో లేదో నన్నది ఆలోచించవచ్చు. అంతేకాని వివరాలేవీ యివ్వకుండా కేవళము మీ అపోహను మాత్రము వెళ్ళగక్కితే దానికి ఏ విలువ వుండదు. 

ప్రశ్న: నేను పాపము చేశాను అంటేనే పాపము చేసినట్లా???

జవాబు: కాదు. ‘నేను పాపము చేసాను’ అని మీరు చెప్పకున్నా మీరు పాపులే! ఎందుకంటే మీరు మోషేధర్మశాస్త్రాన్ని లెక్కలేనన్ని సార్లు మీరారు, మీరుతున్నారు, మీరబోతున్నారు గనుక! ఆమాటకొస్తే, నేనూ, మీరూ, లోకములోని అందరూ పాపులే. మీరేమో గురివింద చందాన తమరి పాపపు బ్రతుకును చూసుకోకుండా నీతిమంతుడైన యేసువారిలో పాపాన్ని వెతికుతున్నారేంటి? పైశాచిక ఆనందం కొరకు కాబోలు!  

ప్రశ్న: పాపము ఉంది యేసులో వాక్యమే స్థాపిస్తుంది

జవాబు: దాన్నే వూహాగానాలతోకూడిన ఉబలాటం అంటారు. దేవుని వాక్యం చెప్పనిదాన్ని మీరు వూహించుకొని వ్యర్థంగా వుబలాటపడుతున్నారు. అయినా మీరు పాపిగా వుంటూ పాపక్షమాపణ పొందకుండానే మోషేధర్మశాస్త్రమనే కాడీక్రింద శాపగ్రస్తునిగా జీవిస్తూ పరమతండ్రి పంపిన మెస్సయ్యను (యషువను/యేసును) తప్పుబట్టే మీ కుయుక్తితో యింకెంతో పాపాన్ని శాపాన్ని కొనితెచ్చుకుంటున్నారు. 

ఇక మెస్సయ్య అయిన యషువ (యేసు) విషయానికొస్తే మోషేధర్మశాస్త్రము విశయములో ఏదైనా తప్పిపోతాడేమోనంటూ వెయ్యికళ్ళతో ప్రతిదినం పరీక్షించి చూస్తున్న ఆనాటి యూదులు (శాస్త్రులు పరిసయ్యులు) సహితం యేసువారు సవాలువిసిరినా ఆయనలో ఏపాపము చూపించలేకపోయారు (యోహాను 8:46; హెబ్రీ.4:15, 1పేతురు 2:22). తమరు 2000 సంవత్సరాలతరువాత జీవిస్తున్నా యషువను ప్రత్యక్షంగా పరీక్షగా చూసి తప్పు చూపించలేకపోయిన ఆ యూదులకంటే గొప్పవారిలా ఫీలవుతున్నట్లునారు! వూహాగానాలతోకూడిన ఉబలాటలతో జీవించకండి, బ్రదర్! ముందు మీరు మోషేధర్మశాస్త్రము ప్రకారము ఒక్కరోజైనా పాపము చేయకుండా జీవించగలిగితే తరువాత మెస్సయ్య విశయము అలోచిద్దురుగాని. యేసువారు (యషువ మషియాఖ్) పాపము లేనివాడు, పాపమును జయించినివాడు (యోహాను 8:29,46,55; గలతీ.4:4-5; 1పేతురు.1:19, 2:22; హెబ్రీ.4:15). పాపివై వుండి నీతిమంతునిలో పాపాన్ని వ్యర్థంగా వెదుకుతూ అతిగొప్ప శాపగ్రస్తునిగా మారుతున్నావు, బ్రదర్! 

ప్రశ్న: యేసు బాప్తీస్మము పోందాడు( మార్కు1:4-9)

జవాబు: అవును. ఆయన బాప్తీస్మము తీసుకున్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి లేఖనసత్యాన్ని సరిగ్గా గ్రహించగలగాలి. మీకు గ్రహించే సామర్థ్యముంటే దయచేసి గమనించండి, కేవళం పాపులుమాత్రమే బాప్తీస్మము తీసుకోవాలన్న రూలేదీ లేదు, బ్రదర్!

“13 ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. 14 అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని 15 యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.” (మత్తయి 3:13-15) 

పై వాక్యాలలోని యేసువారి ఈ మాటలను సరిగ్గా గ్రహించండి: ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నది.

ప్రభువైన యేసుక్రీస్తు తనలో పాపమేదీ లేకపోయినా పాపులమైన మనకు మాదిరిగా వుండేందుకు అలాగే నీతియావత్తూ నెరవేర్చబడుటకు బాప్తీస్మము తీసుకున్నాడు మరియు మోషేధర్మశాస్త్రము క్రింద జీవించాడు. (గలతీ.4:4-5; మత్తయి.5:17)

ప్రశ్న: ఆఙ్ఞ మీారాడు( యెహన్5:18- యాకోబు2:10)

జవాబు:

16 ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.17 అయితే యేసునాతండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. 18 ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.” (యోహాను 5:16-18) 

పైలేఖనాల ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు విశ్రాంతిదినాన స్వస్థపరచాడు. దేవున్ని మహిమపరుస్తూ పొరుగువానికి మేలుచేసిన యేసువారిని పరమ నీచులైన కొందరు యూదులు తప్పుబట్టే ప్రయత్నంగా ఆయన చేసిన దొడ్డకార్యాన్ని “విశ్రాంతిదినాన్ని మీరాడు” అంటూ వక్రీకరించారు. దాన్నే గ్రంథకర్త వుటంకించడం జరిగింది. 

ఒకవేళ తమరుకూడా ఆయూదుల పంథాలో యేసువారు చేసిన దొడ్డపని “విశ్రాంతిదినాన్ని మీరటము” అని భ్రమిస్తూవుంటే స్వస్థపరచడము అన్నది విశ్రాంతిదినాన్ని ఏరకంగా మీరడమో మోషేధర్మశాస్త్రము ప్రకారము లేఖనాలను చూపిస్తూ వివరించండి. విశ్రాంతిదినాన్న మనుషులను స్వస్థపరచకూడదు అన్న ఆజ్ఙ మోషేధర్మశాస్త్రములో వుందా? వుంటే రెఫరెన్సు యివ్వండి. 

నిజానికి, యేసువారు ఒక్క ఆజ్ఙ కూడా మీరలేదు. కాని, మీరు మాత్రము ఆయనను గూర్చి అబద్దాలను ప్రచారం చేస్తూ ఆయనలో తప్పుబట్టే నీచప్రయత్నములో ఎన్నో ఆజ్ఙలను మీరుతున్నారు తత్ఫలితంగా దేవుని వుగ్రతను శాపాన్ని కొనితెచ్చుకుంటున్నారు మరియు తొందరలోనే వాటిని అనుభవించబోతున్నారు!!! 

ప్రశ్న: పాపిగా చేయ్యబడ్డాడు  ( 2కోరిథి5:21)

జవాబు:

“ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము *పాపముగాచేసెను.*” (2కొరింథీ.5:21)

“పాపిగా” కాదు! “పాపముగా” (అంటే పాపులస్థానములో పాపపరిహారార్థబలిగా) చేయబడ్డాడు. ముందు లేఖనాలను సరిగ్గా చదవడం నేర్చుకోండి, తరువాత పాపములేని నీతిమంతునిలో పాపము వెతుకుతూ పైశాచిక ఆనందాన్ని అస్వాదింతురుగాని!

ప్రవక్త అయిన యేషయా ద్వారా చెప్పబడినట్లుగా, “నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును” (యెషయా 53:11) అన్న మాట ఈవిధంగా నెరవేర్చబడి *”మనము ఆయన ద్వారా జీవించు నట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.” (1యోహాను 4:9-10).

***********

ప్రశ్న: తండ్రీ కుమారా పరిశుద్దాత్మ నామములో ఏవ్వరైనా బాప్టిస్మము పోందారా??? (మత్తయి28:19)

జవాబు:

అవును పొందారు, పొందుతున్నారు ఎందుకంటే అది విశ్వాసులకు ఒక ఆజ్ఙగా యివ్వబడింది. మరి ఆ సమాచారమంతా బైబిలులో వ్రాయబడాలన్న నియమమేదైనా వుందా? వుంటే ఎక్కడుంది, చూపించండి?

ప్రశ్న: విశ్రాంతిదినము రోజు పాతనిబంధనలో ఏవ్వరైనా సున్నతి చేశారా???( యెహన్7:23)

జవాబు:

చెయ్యలేదా? చెయ్యకూడదంటూ ఏదైనా ఆజ్ఙ వుందా తనాక్ లో? ఆలాంటి ఆజ్ఙ వుంటే చూపించండి.
వాస్తవానికి, ఇంగితజ్ఙానమున్నవాళ్ళెవరైనా ఈ ప్రశ్న అడుగరు! మోషేధర్మశాస్త్రము ప్రకారము మగశిశువుకు ఎనిమిదవదినాన సున్నతి చేయాలి (లే.కాం.12:3). ఆ ఎనిమిదవదినము కొంతమంది శిశువులకు సబ్బాతునాడు వస్తుంది. అలాంటి సందర్భాలలో ఆ శిశువుకు మరోదినాన సున్నతి చేయాలన్న ఆజ్ఙ ఏదీ లేదు. అలా చేసిన సంఘటనల దాఖలాలుకూడా ఏవీ లేవు దైవగ్రంథమైన బైబిలులో. కనుక శిశువు జన్మదినాన్ని బట్టి ఎనిమిదవదినము వారములోని ఏదినమైనా సున్నతి చేయించాల్సిందే. అలా చేయనివాడు మోషేధర్మశాస్త్రమును మీరినవాడుగా లెక్కించబడుతాడు. ఆవిధంగా వారు అంటే ఆ శిశువు తల్లిదండ్రులు పాపముచేసినవారై శాపగ్రస్తులవుతారు. 

ప్రశ్న: మందాసములో మన్నాగల బంగారుపాత్ర అహరోను కర్ర ఉందా???( హెబ్రీ 9:3-4)

జవాబు:

అవును. “కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.” (ని.కాం.16:33). మోషే ఆజ్ఙ ప్రకారము అహరోను మన్నాకొరకు తీసుకొన్న గిన్నె బంగారు గిన్నె అన్నది “హెబ్రీ పత్రిక” వ్రాసిన పరిశుద్ధాత్మునిచే ప్రేరేపించబడిన గ్రంథకర్తకు తెలుసు గనుక దాన్ని వివరిస్తూ వ్రాసాడు.* 

ఒకవేల అది బంగారు పాత్ర కాదు అని మీరు భ్రమిస్తూ వుంటే మరి అది ఏ లోహముతోచేసిన పాత్రో వివరించండి?! 

ప్రశ్న: యేసు శిలువ మరణము తరువాత సున్నతి లేదనుకుంటే పౌలు తిమేాతికి సున్నతి చేసి యేసు కృప లోనుండి ఏందుకూ దూరము చేశాడు??? ( అపో.కా16:1-5—గలతి5:4-6)

జవాబు:

మొదట మీరు సున్నతిపై క్రొత్తనిబంధన బోధను తికమకపడకుండా సరిగ్గా అర్థముచేసుకోండి…

సున్నతి చేసుకోవటములో లేక సున్నతి చేసుకోకపోవడములో ఏమీలేదు. (1కొరింథీ.7:19; గలతీ.5:6) 
అయితే, సున్నతి పొందితేతప్ప రక్షణ పొందలేము అని నమ్మితే అది అసత్యబోధ/దుర్బోధ. (అపో.కా.15:1-29)
రక్షణకొరకు సున్నతిపొందితే అలాంటి వ్యక్తి క్రీస్తునుండి దేవుని కృపనుండి వేరవుతాడు. (గలతీ.5:1-5)

యూదురాలి కుమారుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు సున్నతి చేయించాడు, కాని అది తిమోతి రక్షణపొందడానికిగాని లేక మోషేధర్మశాస్త్రమును నెరవేర్చడానికి గాని కాదు అన్నది మరచిపోకూడదు. తిమోతితో కలిసి యూదులకు సువార్త ప్రకటించాలన్న సదుద్దేశముతో తిమోతికి శరీరసున్నతి లేకపోవడమన్నది యూదులకు అభ్యంతరకారణముగా వుండకుండా పౌలు తిమోతికి సున్నతి చేయించాడు(అపో.కా16:1-5).  

పై విశయాలు మీరు సరిగ్గా అర్థము చేసుకోగలిగితే ఇంకా చాలా విశయాలు అర్థము చేసుకోగలరు. ఒకవేళ మీరు క్రొత్తనిబంధన గ్రంథము బోధిస్తున్న పై సత్యాలను సరిగ్గా అర్థము చేసుకోలేకపోతే చాలా సత్యాలను అర్థము చేసుకోలేక అసత్యములోనే కొనసాగుతూ నిత్యనాశహములోకి వెళ్ళిపోతారు.