యూదుమతస్తుల ప్రశ్నలు-6

క్రొత్తనిబంధనలోని అపోస్తలులద్వారా యివ్వబడిన దైవోపదేశాలను వక్రీకరిస్తున్న దుష్ట అబద్ద యూదులకు/జూడాయిజం వారికి లేఖనాధారమైన జవాబులు

అపోస్తలుడైన పౌలుద్వారా యివ్వబడిన పరిశుద్ధ లేఖనాలను మీ లాజిక్కుద్వారా తప్పుగా చుపిస్తున్నారుగదా, మరి అదే లాజిక్కునుబట్టి రాజైన…

దావీదు ఒక చచ్చిన కుక్కనా???!!! [ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి యున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కనుగదా? మిన్నల్లిని గదా? (1సమూయేలు 24:14)] 

దావీదు ఒక అవివేకా?! మరి ఆయనద్వారా యివ్వబడిన కీర్తనలు ఎలా స్వీకరిస్తూన్నరు? [“ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీ యులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసినీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను…జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టు కొనగా అతడునేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా” (1సమూయేలు 24:1,10)] 

దావీదు ఒక పురుగా?! మరి ఆయనద్వారా యివ్వబడిన కీర్తనలు ఎలా స్వీకరిస్తూన్నరు? [నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను. (కీర్తన.22:6)] 

పై విషయాలు పరిశీలంచండి సహోదరులారా దావీదు బోధ (కీర్తనలు) పరిశుద్ధాత్మ వలన కలిగినదో లేక తన స్వభావాన్నిబట్టి కలిగినదో?

అపోస్తలుడైన పౌలుద్వార యివ్వబడిన లేఖనాలను మీలాంటి వారు సరిగ్గా అర్థంచేసుకోలేరు. దానికి కారణం మాకు లేఖనాలే వివరిస్తున్నాయి:

“మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి. (2పేతురు.3:15-17)

బైబిలు (పాతనిబంధన మరియు క్రొత్తనిబంధన గ్రంథాలు-66) దైవగ్రంథము. దీని భావము దేవుడే తన హస్తాలతో ఈగ్రంథాన్ని రచించాడని కాదు. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన దైవజనులు వ్రాసి యిచ్చారని దీని ఆంతర్యము.   

లేఖనము (γραφή/గ్రాఫె) అంటే దైవావేశముతో లిఖించబడిన దైవసందేశము. ఈ దైవసందేశములో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా చెప్పబడిన దేవుని పలుకులు, దేవదూతల పలుకులు, మనుషుల పలుకులు అలాగే సాతాను మరియు అపవిత్రాత్మలపలుకులుకూడా లిఖితరూపంలో నివేదించబడ్డాయి. అయినా, వాటన్నిటిని లిఖితరూపంలో భద్రపరచింది దైవావేశములోని దైవజనుల వ్రాతపూర్వకప్రక్రియ. కనుక, దురాత్మల మాటలలోని సందేశాన్ని అలాగే మనుషుల వ్యక్తిగత అభిప్రాయాలను దైవోపదేశమునుండి వేరుపరచి అన్వయించుకోవాలి. దీన్నే లేఖనాల ధ్యానం మరియు అధ్యాయనం అంటారు. దీన్ని బహు జాగరూకతతో దేవుని ఆత్మసహాయముతో చేసినప్పుడే సత్యాన్ని అవగతం చేసుకోగలము. ఇది అస్థిరులు, అజ్ఙానులు, సత్యద్వేషులు, దైవదూషకులు మరియు అవిశ్వాసులు చేయరు గనుక వారికి దైవోపదేశముగాని లేక సత్యముగాని అవగతం కాదు.     

లేఖనాలలోని వుపదేశాన్ని మరియు మాదిరిని దైవాదేశముగా గ్రహించి పాటించాలి. అయితే, మానవుల సలహాలను, సాధారణ వ్యక్తులైనా లేక దైవజనులైనా, అది కేవళము వ్యక్తుల వుపదేశముగా గ్రహించి తదనుగుణంగా అన్వయించుకోవాలి.          

అపోస్తలుడైన పౌలు ద్వారా యివ్వబడిన లేఖనాలన్నీకూడా దైవావేశములో యివ్వబడిన దైవసందేశాలే. అయితే, వాటిలోకూడా యితర లేఖనాలమాదిరిలో మానవుల మరియు దురాత్మల మాటలుకూడా నివేదించబడ్డాయి. వాటిలోని వుపదేశము దైవోపదేశము. అయితే వాటిలో వ్యక్తపరచబడిన వ్యక్తుల అభిప్రాయాలు ఆయావ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలుగా మాత్రమె గ్రహించాలి. పౌలు ఒక వ్యక్తిగా తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. అది దైవోపదేశముకాదుగాని ఒక దైవజనుని వ్యక్తిగత అభిప్రాయము. దాన్ని ఆవిధంగానే గ్రహించి అన్వయించుకోవాలి. అయినా సరే, పౌలు యొక్క వ్యక్తిగత అభిప్రాయాలుకూడా దైవావేశముతో లిఖితరూపములో భద్రపరచబడ్డాయి అన్నది మరవకూడదు. 

“మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియసహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు.

వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్‌. “ (2పేతురు 3:15-18)

సత్యాన్వేషకులను బైబిలుమొత్తాన్ని విశ్వసించి గౌరవించేవారిని పరమతండ్రి దీవించునుగాక! 

పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.” (ప్రకటన 21:8)

*******************

బైబిలువిరోధుల సత్యవిరోధుల ప్రశ్నలు మరియు వాటికి ధీటైన జవాబులు

ప్రశ్న: యేషయ 7:14-16 యేసు గూరించియా???? 

జవాబు:

అవును! అయితే ఓక్కసారీ అందరం ఆలోచించవలసిందే! అలోచించిచూస్తే విశ్వాసులకు అర్థమవుతుంది, అవిశ్వాసులు సందేహములోనే కొనసాగుతారు!!!

యెషయా 7: 14-16 “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయ బడును.”

ప్రశ్న:

1) యేసుకు ఇమ్మానుయేల్ అని ఏందుకూ పేరు పేట్టబడలేదు???

జవాబు:

పెట్టబడలేదు అని వ్రాయబడలేదు. పెట్టబడిన/చేయబడిన ప్రతీది వ్రాయబడాలన్న నియమము లేదు. అలాంటి నియమమేదైనా వుంటే చూపించండి?

ప్రశ్న:

2)కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను ఏప్పుడు తిన్నాడు???

జవాబు:

అతడు పెరుగు, తేనెను తినలేదు అని వ్రాయబడలేదు, సోదరా! అయినా, ఆయన తిన్నవాటి వివరాలన్నీ వ్రాసిపెట్టబడాలన్న నీయమమెక్కడుంది? అలాంటి నియమమేదైనా గ్రంథములో వుంటే చూపించండి!!!

ప్రశ్న:

3)యేసు ఏకీడు చేశాడు విసర్జించడానికీ????

జవాబు:

’యేసు కీడు చేస్తాడు అటుతరువాత విడిచిపెడుతాడు’ అని వ్రాయబడలేదు, సోదరా! బాలునిగా ఎదుగుతూ మేలు మరియు కీడులమధ్య బేధాన్ని గుర్తించేటప్పుడు కీడును కోరుకోకుండా మేలునే కోరుకుంటాడని దాని భావం. లేఖనాలను సరిగ్గా చదవడం రాకపోతే వచ్చే ప్రశ్నలే ఇవన్నీ!

ప్రశ్న:

కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును ఆ యేసుకీ తెలివిరాక మునుపు భయపెట్టు ఆ యిద్దరు రాజుల(రేజిను…పేకహూ) దేశము (సిరియా& షోమ్రెాను)  యేసు కాలములో ఏప్పుడు పాడుచేయ బడినవి????

వాబు:

ఆ యిద్దరు రాజుల దేశము యేసు కాలములో పాడుచేయబడును అని వ్రాయబడలేదు, సోదరా! సరిగ్గా చదవడం నేర్చుకోండి మొదట అటుతరువాత ప్రశ్నలడిగితే బాగుంటుంది. ఆ ప్రవచనము ప్రకారము యేసు బాలుడిగా తెలివిని పొందకముందే ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును. ఇది ప్రవచనము యివ్వబడిన యెషయా ప్రవక్త కాలము మొదలుకొని యేసు బాలునిగా మారే సమయము మధ్యలో ఎప్పుడైనా సంభవించవచ్చు!!!  

[గమనిక: లేఖనాలను సరిగ్గా చదువుతూ దేవుని సహాయము కోరితే లేఖన సత్యాలు అవగతమవుతాయి. ప్రవచనాల విశయములో మరి జాగ్రత్తగా లేఖనాలను ధ్యానించాలి!]  

పై కారణాలనుబట్టి ప్రభువైన యేసుకు యెషయా 7:14 లోని ప్రవచనము వర్తించదు అని జూడాయిజములోని వారెవరైనా బ్రమిస్తుంటే, అలాంటివారు జవాబులు చెప్పాలిప్పుడు:

ప్రశ్న: ఒకవేళ అది ప్రభువైన యేసునుగూర్చి కాకపోతే మరి ఎవరినిగూర్చి??? లేఖనానుసారంగా చూపించండి
ప్రశ్న: మీ లాజిక్కు ప్రకారం ఏ కన్య (עַלְמָה/అల్మ) ఏవ్యక్తికి జన్మనిచ్చి ఇమ్మానుయేలు అని పేరుపెట్టింది తనాక్ లో???
లేఖనానుసారంగా చూపించండి.
ప్రశ్న: అలా పుట్టిన వ్యక్తి పెరుగు తేనెలను తిన్నట్లు తనాక్ లో ఎక్కడ వుంది???
లేఖనానుసారంగా చూపించండి.

ఒకవేళ మీరిచ్చిన కొలమానము ప్రకారం మీరు చూపించలేకపోతే…

మీ తప్పుడు అవగాహనను అభ్యంతరాలను వదిలి కన్య మరియకు జన్మించిన ప్రభువు మరియు రక్షకుడు అయిన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) నందు యేషయా 7:14 నెరవేర్చబడిన సత్యాన్ని గ్రహించి ఒప్పుకొని పశ్చ్చత్తాపపడి ఆయన నామములో రక్షణపొందండి! పరమతండ్రి మిమ్ములను ఆశీర్వదిస్తాడు!