Skip to content
Menu
జూడాయిజం: రబ్బీల సృష్టి
  • Home/హోం
    • Videos
      • తెలుగు విడియోలు
      • Dr.Michael Brown (Jewish Believer)
      • One For Israel (Jewish Believers)
      • Jews for Jesus (Jewish Believers)
  • Blog/బ్లాగ్
    • నిజమైన ఆరాధన
    • నిజదేవుని ప్రవృత్తి
    • ఆజ్ఙలు పలురకాలు
    • సున్నతి సంస్కారము
    • సబ్బాతు సమాచారం
    • కన్యక లేక యవ్వన స్త్రీ?
    • రక్తము – ప్రాయశ్చిత్తము
    • అనువాదం vs అపోహ
    • మౌఖిక తోరాహ్: రబ్బీల దగా
    • జుడాయిజంలో అన్యాచారాలు
    • అబద్ధ బోధకులను గుర్తించటమెలా?
    • పాతనిబంధన ప్రవచనాలు & క్రొత్తనిబంధనలో నెరవేర్పులు
  • యూదులు
    • ‘యూదులు’ అంటే ఎవరు?
    • దైవ ప్రణాళిక: యూదుల పాత్ర అన్యుల స్థానం
    • యూదుల పుక్కిటిపురాణం: ఓరల్ తోరాహ్
  • యూదుమతస్తుల ప్రశ్నలు
    • యూదుమతస్తుల ప్రశ్నలు-1
    • యూదుమతస్తుల ప్రశ్నలు-2
    • యూదుమతస్తుల ప్రశ్నలు-3
    • యూదుమతస్తుల ప్రశ్నలు-4
    • యూదుమతస్తుల ప్రశ్నలు-5
    • యూదుమతస్తుల ప్రశ్నలు-6
    • యూదుమతస్తుల ప్రశ్నలు-7
    • యూదుమతస్తుల ప్రశ్నలు-8
    • యూదుమతస్తుల ప్రశ్నలు-9
    • యూదుమతస్తుల ప్రశ్నలు-10
  • యూదుమతస్తులకు ప్రశ్నలు
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-1
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-2
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-3
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-4
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-5
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-6
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-7
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-8
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-9
    • యూదుమతస్తులకు ప్రశ్నలు-10
  • బైబిల్
    • బైబిలు: సంపూర్ణ దైవగ్రంథము
    • దైవోక్తులపై ఒక అవిశ్వాసి అపనింద
    • యేసు క్రీస్తు మరణపునరుత్థాన వివరాల మధ్య పొందిక
    • మెస్సయ్య
      • యెషయా 53
      • తనాఖ్ లో మెస్సయ్య
      • మెస్సయ్య మానవుడా?
      • యెషయాలో మెస్సయ్యా
      • మెస్సయ్య: దేవుని మర్మము
      • మెస్సయ్య: దేవుని కుమారుడు
      • రబ్బీల మతం Vs. మెస్సయ్య మార్గం
      • మెస్సయ్యనందు అన్యులు పొందే మేలు
      • బైబిలు వెలుగులో యషువ (యేసు)
      • మెస్సయ్య మరణం: క్రైస్తవేతరుల కొరకైన వివరణ
జూడాయిజం: రబ్బీల సృష్టి

మెస్సయ్య: దేవుని మర్మము

Posted on June 1, 2020August 13, 2020 by Admin

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నరుడు. కాని, ఆయన  కేవలం ఒక నరుడు మాత్రమే అయితే వచ్చే సమస్యలు:

i. పాపులలో ఒకనిగా అయ్యుండేవాడు [1రాజులు.8:46; కీర్తన.14:2-3; 143:2; ప్రసంగి.7:20; రోమా.3:23; 5:12]

ii. దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండగలిగేవాడు కాదు [1సమూయేలు.2:25; యోబు.9:32-33; కీర్తన.49:7-9; యెహెజ్కేలు.14:14,20;]

iii. ఒక్క మానవున్నికూడా రక్షించలేకపోయేవాడు [కీర్తన.49:7-9] 

iv. మానవ జన్మకు ముందు ఉనికిని కలిగి ఉండేవాడు కాదు [మీకా.5:2; యోహాను.3:13; 6:38, 46, 51, 62; 8:23, 58; హెబ్రీ.7:3, 10:5; 1యోహాను.1:1-2; ]

v. దేవుని మందిరముకన్నా గొప్ప స్థానాన్ని కలిగివుండేవాడు కాదు [మత్తయి.12:6] 

vi. దేవునిగా గుర్తించబడేవాడు కాదు [యోహాను.1:1,14, 20:28; హెబ్రీ.1:8]

vii.దేవునికి చెందిన ఘనత, ఆరాధన అందుకునేవాడు కాదు [మత్తయి.28:9,17; ప్రకటన 5:8-14]

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నరుడు. అయితే, అంతేగాక ఆయన అదే సమయములో క్రిందివన్నీకూడా అన్నది మరువకూడదు:

i. దేవుని రూపం [*μορφή/మోర్ఫె = form (ఫిలిప్పీ.2:6)] 

ii దేవుని ప్రతిరూపం [+εἰκών/ఎయికోన్ = image (2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15)]

iii దేవుని శక్తి [1కొరింథి.1:24] 

iv. దేవుని జ్ఙానం [1కొరింథి.1:24]

v. దేవుని వాక్కు [యోహాను.1:1,14]

vi. దేవుని మహిమాతేజస్సు [హెబ్రీ.1:3]

vii.దేవుని కుమారుడు [సామెతలు.30:4; యోహాను.3:16; 1యోహాను.3:8] 

ఒకే వ్యక్తిలో కేంద్రీకృతమైయున్న పై విభిన్న వాస్తవాల సమాహారాన్నిబట్టి క్రీస్తుగా వచ్చిన యేసు దేవుని మర్మమై [μυστήριον/ముస్టెరిఒన్ = mystery] యున్నాడు:

“నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరు చున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.” (కొలొస్సీ.2:1). 

ఈ లేఖన సత్యాన్ని గ్రహించటానికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం (1కొరింథి.2:14). దేవుని సంబంధులైనవారు పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్న గ్రహింపులో ఎదుగుతున్న తరుణములో తమ గ్రహింపుకు అతీతమైన లేఖన సత్యాలను తిరస్కరించక మరియు తప్పుబట్టక విశ్వాసముతో స్వీకరించగలుగుతారు.

పై లేఖనాల వెలుగులో నిజవిశ్వాసులు, దైవసంబంధులు ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యెడల సరియైన దృక్పథాన్ని కలిగి వుండటమేగాక ఆయనను వాక్యాధారమైన విధానములోనే ఘనపరచగలరు.

ఈ సందర్భంగా నిజీవిశ్వాసులు జ్ఙాపకముంచుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విశయం, తండ్రిని ఒకవిధంగా కుమారుని మరొకవిధంగా ఘనపరచమన్నది లేఖన బోధ కాదు అన్న సత్యం. తండ్రిని ఏవిధంగా ఘనపరచాలో అదేవిధంగా కుమారుని ఘనపరచాలి అన్నది లేఖనము యొక్క సుస్పష్టమైన బోధ మరియు ఆజ్ఙ. ఈ ఆజ్ఙను అతిక్రమించినవాడు తండ్రిని అగౌరపరచినవాడవుతాడు. అలాంటివాడే దుర్బీజుడు మరియు క్రీస్తు/మెస్సయ్య విరోధి:

“తండ్రిని ఘనపరచునట్లుగా [καθὼς/కాతొస్ = same as; just as; even as] అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.” (యోహాను.5:23)

గమనిక:
*మోర్ఫె [μορφή] = రూపం [form]; ఆకారం [shape]; బయటికి అగుపడునది [outword appearance]:

  • బయటికి అగుపడునది [outword appearance] మర్కు.16:12 
  • రూపం [form] ఫిలిప్పీ.2:6
  • ఆకారం [shape] ఫిలిప్పీ.2:7

+ఎయికోన్ [εἰκών] = బొమ్మ/చిత్రము/చిహ్నం [ikon]; ప్రతిబింబము/ప్రతిరూపం [image]; ప్రాతినిథ్యము [representation]:

  • బొమ్మ/చిత్రము/చిహ్నం [ikon] మత్తయి 22:20; రోమా.1:23; ప్రకటన.13:14
  • ప్రతిబింబము [image] 2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15
  • ప్రాతినిథ్యము [representation] రోమా.8:29; 1కొరింథీ.11:7, 15:49; 2కొరింథీ.3:18; కొలొస్సీ.3:10 

Views: 320

1 thought on “మెస్సయ్య: దేవుని మర్మము”

  1. Ramakrishn Janga says:
    June 1, 2020 at 8:26 pm

    Thanks for insights… Jesus is God.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

నేటి యూదుమతం బైబిల్ బోధకు బద్ధ వ్యతిరేకం

  1. Muppasani sudheer kumar on ‘యూదులు’ అంటే ఎవరు?August 7, 2025

    Ameen God bless you all Thanks Kurnool

  2. Rani on ‘యూదులు’ అంటే ఎవరు?September 24, 2024

    Good information thank u soo much for gathering

  3. PREMA RAVIKUMAR on సబ్బాతు సమాచారంAugust 5, 2024

    యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడిన ఈ లేఖనం ప్రకారం యెషయా 66:22 నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ…

  4. Manohar on ‘యూదులు’ అంటే ఎవరు?May 19, 2024

    Super ❤️

  5. Krishna on పాతనిబంధన Vs. క్రొత్తనిబంధనMarch 12, 2024

    చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదములు

  • పాతనిబంధన ప్రవచనాలు & క్రొత్తనిబంధనలో నెరవేర్పులు
  • మెస్సయ్య: దేవుని కుమారుడు
  • యూదుల పుక్కిటిపురాణం: ఓరల్ తోరాహ్
  • యెషయా 53
  • తనాఖ్ లో మెస్సయ్య

    సందర్శనాల సంఖ్య

    • 171,088
    • 70,186

    Copyright © 2019 – 2029. www.judaism.in. All Rights Reserved.

    ఫేస్ బుక్ పై మమ్మల్ని వెంబడించండి

    ©2026 జూడాయిజం: రబ్బీల సృష్టి | Theme: Wordly by SuperbThemes