Category Archives: Uncategorized

Permalink to single post

పాతనిబంధన ప్రవచనాలు & క్రొత్తనిబంధనలో నెరవేర్పులు

I. పాతనిబంధన ప్రవచనాలు

“సైన్యములకధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి మీరు భయపడవలసినవాడు ఆయనే, ఆయన కోసరమే దిగులుపడవలెను అప్పుడాయన మీకు పరిశుద్ధస్థలముగా నుండును. అయితే ఆయన ఇశ్రాయేలుయొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి కాళ్లు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు.” (యెషయా.8:13-15)   

క్రొత్తనిబంధన నెరవేర్పులు 

“ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయనయందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి.” (రోమా.9:33) 

“విశ్వసించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వసింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. ” (1పేతురు.2:7-8)

II. పాతనిబంధన ప్రవచనాలు 

“అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండమీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగముకొండ దక్షిణపుతట్టు నకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును. కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపము నకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవు దురు, అప్పుడు నీతోకూడ పరిశుద్దులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.” (జెకర్యా.14:1-5) 

క్రొత్తనిబంధన నెరవేర్పులు  

“ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచు చున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగివచ్చును. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,” (అపో.కా.1:10-12) 

“మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై,” (1థెస్స.3:12)

“యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.” (1థెస్స.43:14)

“భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును, ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.” (యూదా 15)

III. పాతనిబంధన ప్రవచనాలు 

“ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను.” (యెషయా.40:2-3)

క్రొత్తనిబంధన నెరవేర్పులు  

“ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.” (మత్తయి.3:1-3)

ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళముచేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. ” (లూకా.3:4-6)

IV. పాతనిబంధన ప్రవచనాలు 

“హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును. ​నేను వచ్చి, దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును.” (మలాకి.4:4-6) 

క్రొత్తనిబంధన నెరవేర్పులు 

“ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను.” (లూకా.1:16-17)

“అప్పుడాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి. అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే; అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాననెను. అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహానునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.” (మత్తయి.17:10-13)

”ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్ చున్నాడు.” (మలాకి.3:1) 

V. పాతనిబంధన ప్రవచనాలు 

”ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్ చున్నాడు.” (మలాకి.3:1) 

క్రొత్తనిబంధన నెరవేర్పులు 

”ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకనిశబ్దము అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు” (మార్కు.1:3) 

VI. పాతనిబంధన ప్రవచనాలు 

యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు.2:32)

క్రొత్తనిబంధన నెరవేర్పులు  

“వాక్యము నీయొద్దను, నీ నోటను నీ హృదయములోను ఉన్నది; అది మేము ప్రకటించు విశ్వాసవాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును…ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడో వాడు రక్షింపబడును.” (రోమా.10:8-10,13)

VII. పాతనిబంధన ప్రవచనాలు 

నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటిమాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.” (యెషయా.45:23)

క్రొత్తనిబంధన నెరవేర్పులు 

“అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.” (ఫిలిప్పీ.2:9-11) 

VIII. పాతనిబంధన ప్రవచనాలు

“తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి భయపడక ధైర్యముగా ఉండుడి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు విప్పబడును కుంటివాడు దుప్పివలె గంతులువేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును అడవిలో కాలువలు పారును” (యెషయా.35:4-6)

క్రొత్తనిబంధన నెరవేర్పులు 

“తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.” (మత్తయి.1:21)

“క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో వినిరాబోవు వాడవు నీవేనా, మేము మరి యొకనికొరకు కనిపెట్టవలెనా? అని ఆయనను అడుగుటకు తన శిష్యులనంపెను. యేసు వారిని చూచి మీరు వెళ్లి, విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని యుత్తరమిచ్చెను.” (మత్తయి.11:2-6) 

ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును,ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏల యనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.” (2థెస్స.1:6-10) 

IX. పాతనిబంధన ప్రకటనలు

దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు” (కీర్తన.45:6-7)

ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.” (కీర్తన.102:25-27)

క్రొత్తనిబంధన వివరణ 

“తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.” (హెబ్రీ.1:8-12)

X. పాతనిబంధన ప్రకటన

 “దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేకకుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.” (జెకర్యా.12:10)

క్రొత్తనిబంధన నెరవేర్పులు

“మరియు తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.” (యోహాను.19:37)

“ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్‌. ” (ప్రకటన.1:7)

Permalink to single post

మెస్సయ్య: దేవుని కుమారుడు

యేసే క్రీస్తు అన్నది క్రొత్తనిబంధన లేఖనాల విస్పష్టమైన ప్రకటన. అయితే, క్రీస్తు అంటే యెవరు అన్నది ఈ వ్యాసంలో పరిశీలించి చూద్ధాం.

క్రీస్తు అన్న పదం హీబ్రూ భాషలోని మషియాఖ్ [המשיח] అన్న పదం యొక్క గ్రీకు అనువాదం. మషియాఖ్ అన్న హీబ్రూ పదాన్ని ఆంగ్లభాషలో మెస్సయ్య [Messiah] గా అనువదించారు. ఈ పదానికున్న భావం “అభిషిక్తుడు.”

పాతనిబంధనలోని మూడు రకాల అభిషేకాలతో ఒక కారణజన్ముడు ఈలోకంలో జనించబోతున్నడంటూ మోషే మొదలుకొని అనేకమంది ప్రవక్తలు ప్రకటిస్తూ వచ్చారు. ఆ కారణజన్ముని “రాబోవు క్రీస్తుగా” గ్రహించవచ్చు.

ప్రవక్తల ప్రకటనలలోని “రాబోతున్న క్రీస్తు” [המשיח=the Messiah] దేవుని కుమారుడన్న సత్యం మొదటి శతాబ్ధపు యూదు మతపెద్దలకు తెలుసు.

మెస్సయ్య: దేవుని కుమారుడు

అరవై ఆరు గ్రంథాల సంపుటియైన సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ బోధ ప్రకారం “దేవుని కుమారుడు/కుమారులు” అనేక రకాలు. అందులో ప్రాముఖ్యమైనవి ఐదు.

ఒకటి-దేవదూతలు

పరలోకమందున్న దేవదూతలను సృష్టికర్త ఏ మాధ్యమం లేకుండా తానే సృష్టించాడు. ఆ కారణంచేత వారు బైబిల్ లో “దేవుని కుమారులు” గా గుర్తించబడ్డారు. [యోబు.1:6; 2:1]

రెండు-ఆదాము

మొదటి మానవుడు ఆదామును దేవుడే స్వయంగా సృష్టించాడు. ఆ కారణం చేత ఆదామును లేఖనం “దేవుని కుమారుడు” గా పేర్కొంటున్నది. [లూకా.3:38]

మూడు-ఇశ్రాయేలీయులు

దేవుడు తానే అబ్రహాము యొక్క వాగ్ధత్త కుమారుడు ఇస్సాకు యొక్క రెండవ కుమారుడైన యాకోబుకు జన్మించిన పన్నెండుగురు కుమారులద్వారా కలిగిన పన్నెండు గోత్రాల ప్రజలందరు ఇశ్రాయేలీయులుగా పేర్కొనబడుతారు. వారందరితో సృష్టికర్త ఒక వాగ్ధానం చేసి వారిని తన ప్రజలుగా లేక “దేవుని కుమారులు” గా చేసుకున్నాడు. [కీర్తన.82:6; యెషయా.43:6; యిర్మీయా.31:9]

నాలుగు-క్రైస్తవులు

యేసు క్రీస్తు ద్వారా చేయబడిన నూతన నిబంధనలో చేరి నిజక్రైస్తవులుగా మారిన వారందరికి దేవుని ఆత్మ నడిపింపు లభిస్తుంది. ఆ రకంగా ఆత్మ నడిపింపులో జీవిస్తున్న వారు “దేవుని కుమారులు” గా పేర్కొనబడుతారు. [యోహాను.1:12; రోమా.8:]

ఐదు-యేసుక్రీస్తు

పై నాలుగు రకాల “దేవుని కుమారు(డు)లు” దేవుని సృష్టిలో భాగం. అయితే, పై నాలుగు రకాల “దేవుని కుమారు(డు)ల” కోవకు చెందనివాడు యేసు క్రీస్తు. అందుకు కారణాలు క్రింద యివ్వబడినవి:

(అ) యేసుక్రీస్తు దేవుని లోనుండి ఉద్భవించిన “దేవుని కుమారుడు” [యోహాను.8:42, 13:3].
(ఆ) యేసుక్రీస్తు “దేవుని స్వంత కుమారుడు” [రోమా.8:3,32].
(ఇ) యేసుక్రీస్తు “దేవుని ప్రియ కుమారుడు” [మత్తయి.3:17, 17:5].
(ఈ) యేసుక్రీస్తు “దేవుని అద్వితీయ కుమారుడు” [యోహాను.3:16, 1యోహాను.4:9].
(ఉ) యేసుక్రీస్తు అదృశ్యదేవుని దృశ్యరూపం [యోహాను.14:9; 2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15, 2:9].
(ఊ) యేసుక్రీస్తు దైవతత్వము యొక్క ప్రత్యక్షతయు అలాగే దేవుని మహిమను కనుపరచె తేజస్సును అయివున్నాడు [హెబ్రీ.1:3].
(ఎ) సృష్టికర్తకు సర్వసృష్టి చెల్లిస్తున్న ఆరాధనకు యేసుక్రీస్తు పాత్రుడు [యోహాను.5:23; ప్రకటన.5:11-14].

Permalink to single post

యెషయా 53

యెషయా గ్రంథంలో “నా సేవకుడు” [עַבְדִּ֑י/అబ్ది] అన్న పదజాలము విరివిగా వాడబడింది. ఈ గ్రంథంలోనే ఈ పదజాలము ప్రవక్త అయిన యెషయాకు, రాజైన దావీదుకు, కోశాధికారి అయిన ఎల్యాకీముకు, మరియు ఇశ్రాయేలు జనాంగముకు ఉపయోగించబడింది.

53వ అధ్యాయం “నా సేవకుడు” అనబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి పరిచయం చేస్తున్నది. ఆ వ్యక్తి మరివిశేషముగా వ్యసనాక్రాంతుడైన సేవకునిగా చిత్రీకరించబడ్డాడు.

యెషయా గ్రంథంలో 52:13-53:12 వరకు గల లేఖన భాగం ఆ “నా సేవకుడు” ఎవరు, ఏవిధంగా ఆయన వ్యసనాక్రాంతుడుగా చేయబడ్డాడు, ఎవరికొరకు ఆ విధంగా చేయబడ్డాడు, ఇంకా ఆయన అనుభవించిన దుస్థితి యొక్క పర్యవసానం యేమిటి అన్న వివరాలను కూడా అందిస్తున్నది.

యెషయా గ్రంథంలో పరిచయం చేయబడిన వ్యసనాక్రాంతుడైన “నా సేవకుడు” రాబోతున్న మెస్సయ్య లేక మషియాఖ్ అని క్రీస్తు పూర్వం 2వ మరియు 3వ శతాబ్ధాలలో వ్రాయబడిన మృతసముద్ర తాళపత్ర గ్రంథాలు [Dead Sea Scrolls] పేర్కొన్నాయి.

రబ్బీనిక్ సాహిత్యం కూడా యెషయా గ్రంథంలోని వ్యసనాక్రాంతుడైన “నా సేవకుడు” రాబోతున్న మెస్సయ్యా అంటూ బోధిస్తున్నాయి:

మెస్సయ్య–ఆయన నామమేమిటి?…రబ్బీలు తెలియచేస్తున్నారు, “నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు” అని చెప్పబడినట్లుగా ఆయన పేరు మొత్తబడిన పండితుడు లేక కుష్ఠరోగ పండితుడు–బబులోనియన్ తాల్ముద్: సన్ హెడ్రిన్ 98బి

(రూతు 2.14 యొక్క) మరొక వివరణ:–ఆయన రాజైన మెస్సయ్యను గురించి మాట్లాడుతున్నాడు; ‘నీ విక్కడికి వచ్చి,’ సింహాసనానికి చేరువగా రా; ‘భోజనముచేసి,’ అది రాజ్యమనే భోజనము; ‘చిరకలో నీ ముక్క ముంచి,’ ఇది “మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను” అని తెలియచేయబడినట్లు ఆయనపొందే దెబ్బలను సూచిస్తున్నది;” -మిద్రాష్ రూతు రబ్భా

13వ శతాబ్ధంవరకు గల యూదుమత రబ్బీలలోని కొందరు ప్రఖ్యాతిచెందిన వారు సహితం యెషయా గ్రంథం 52:13 నుండి 53:12 వరకు గల లేఖన భాగం రాబోవు మెస్సయ్యాను గూర్చినది అని బోధించారు! అలాంటివారిలోని కొందరు క్రింద పేర్కొనబడిన రబ్బీలు:

(1) యోనాతాన్ బెన్ ఉజ్జిఎల్ [తార్గం జోనాథాన్]
(2) రబ్బీ ఇట్జాక్ అబ్రవానెల్
(3) రబ్బీ ఎలియేజర్
(4) రబ్బీ మోషే హదర్షన్
(5) మైమోనిడెస్ [Rambam]
(6) రబ్బీ షిమోన్ బార్ యోఖాయ్

అయితే, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయములోని వ్యసనాక్రాంతుడైన “నా సేవకుడు” అన్న వ్యక్తి యొక్క వివరాలు నిజానికి మొదటి శతాబ్ధంలో వచ్చిన యషువ [యేసు] జీవితానికి అద్దంపట్టినట్లుండటం చేత ఆయనే మషియాఖ్ [మెస్సయ్య] అని నిర్ధారించబడుతుండటం యూదుమత రబ్బీలు గమనించి ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. నిజానికి ఈ సత్యమే అనేకమంది యూదు మతస్తులు యేసే క్రీస్తు అని నమ్మి క్రైస్తవ్యాన్ని స్వీకరించేందుకు కారణమవుతూ వచ్చింది. ఈ సమస్యను అధిగమించే క్రమంలో 12వ శతాబ్ధంలో రబ్బీ ష్లొమొ ఇట్జాక్ [Rashi/రషి] అనే రబ్బీ యెషయా 53లోని “నా సేవకుడు” ఇశ్రాయేలు జనాంగాన్ని సూచిస్తున్నది అంటూ ఒక క్రొత్త భాశ్యం ప్రవేశపెట్టాడు.

రషి చెప్పిన భాశ్యం యూదుమతస్తుల మధ్య క్రైస్తవ సువార్త ప్రకటనను సమర్దవంతంగా అడ్డుకోవటమేగాక యూదుమతానికి స్థిరత్వాన్ని తెస్తుండటాన్నిబట్టి 12వ శతాబ్ధం నుండి రబ్బీలు పాతనిబంధన గ్రంథంలోని [తనాక్] లేఖనాలు వ్యతిరేకిస్తున్న రషి భాశ్యాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చారు.

To be continued…

Permalink to single post

తనాఖ్ లో మెస్సయ్య

మెస్సయ్య [Messiah] అన్న పదం హెబ్రీ భాషా పదమైన మషియాఖ్ [מָשִׁיחַ] యొక్క అనువాదం. మషియాఖ్ [మెస్సయ్య] అంటె అభిషిక్తుడు అని భావం. ఇదే పదం గ్రీకు భాషలో క్రిస్టొస్ [Χριστός] గా, ఆంగ్ల భాషలో క్రైస్ట్ [Christ] గా, తెలుగులో క్రీస్తుగా అనువదించబడింది.

తనాఖ్ బోధ ప్రకారం అంటే పాతనిబంధన గ్రంథము యొక్క బోధ ప్రకారం మూడు పాత్రలను లేక విధులను అభిషేకించబడిన వ్యక్తులే నిర్వర్తించాలి. అవి…

ప్రవక్తలు: దేవుని తరపున మానవులకు దైవ సందేశాన్ని అందించేవారు.
యాజకులు: మానవుల తరపున దేవునికి ఆరాధన సమర్పించే వారు.
రాజులు: దేవుని తరపున మానవులను పరిపాలించేవారు.

పాతనిబంధన గ్రంథములోని లేఖనాలు రాబోతున్న మోషేవంటి ప్రవక్తను గురించి, రాబోతున్న మెల్కీసెదెకు క్రమములోని యాజకుని గురించి, అలాగే రాబోతున్న దావీదువంటి రాజును గురించి భవిశ్యవాణులను అందిస్తూ వచ్చాయి.

పాతనిబంధన లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే భవిశ్యత్తులో రాబోతున్న మూడు అభిశిక్త పాత్రలను పోశించేది ముగ్గురు వేరువేరు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి ఆ మూడు పాత్రలను పోశించబోతున్నడు అన్న సత్యం ద్యోతకమవుతుంది. ఆవ్యక్తి మూడంతల అభిశేకమున్న ప్రత్యేకమైన వ్యక్తి; మూడు రకాల భాధ్యతలను నిరంతరం నిర్వర్తిస్తూ మానవాళికి పరిపూర్ణ సార్దకత్వాన్ని అందిచబోయే మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తే ప్రవచించబడిన రాబోవు మెస్సయ్య లేక క్రీస్తు!

పాతనిబంధన లేఖనాలు రాబోతున్న ఈ విశిష్ట వ్యక్తిని ‘నా సేవకుడు’ [యెషయా.52:13], ‘నీతిమంతుడైన నా సేవకుడు’ [యెషయా.53:11], ‘దేవుని పరిశుద్ధుడు’ [కీర్తన.16:10], ‘దేవుని అభిశిక్తుడు’ [దానియేలు.9:26], ‘మనుష్యకుమారుడు’ [దానియేలు.7:13], ‘దేవుని కుమారుడు’ [కీర్తన.2:7; సామెతలు.30:4], ‘నిబంధన దూత’ [మలాకి.3:1] వంటి ప్రత్యేక బిరుదులతో పరిచయం చేస్తున్నాయి.

Permalink to single post

నిజమైన ఆరాధన

సృష్టి ఆదినుండి మానవుడు తన సృష్టికర్తపట్ల వ్యక్తపరచాల్సిన వైఖరులలో అతి ప్రాముఖ్యమైనది దేవునికి ఆపాదించాల్సిన ఆరాధన. పాతనిబంధన గ్రంథములో దేవున్ని ఆరాధించే విధానాలు నాలుగురకాలు. అవి ఈ క్రింద యివ్వబడినవి:

  1. అర్పణలు: దేవునికి అర్పణలు అర్పించుట. ఉదాహరణకు, బలులు, నైవేధ్యాలు, ప్రథమ ఫలాలు, మ్రొక్కుబడులు మొదలైనవి. 
  2. జిహ్వాఫలము: కృతజ్ఙతాస్తుతులు పలకటము, స్తోత్రగీతాలు పాడటము, ప్రార్థన చేయుట మొదలైనవి. 
  3. భంగిమలు: దేవునికి మ్రొక్కటము. సాగిలపడటము, చేతులెత్తి మ్రొక్కటము, మ్రోకాళ్ళూనటము మొదలైనవి. 
  4. సేవ: దేవునికి సేవ చేయటము [హీబ్రూ మూలపదం: פְּלַח/పెలాఖ్ & గ్రీకు మూలపదం: λατρεύω/లాట్రేయో]. దేవాలయములోని పనులు, దేవునికి సంబంధించిన కార్యాలను నిర్వర్తించటము మొదలైనవి. 

అయితే, లేఖన బోధ ప్రకారము దేవుని మాట వినుట అన్నది పై నాలుగువిధాల ఆరాధనకన్నా గొప్పది: 

అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.” (1సమూయేలు.15:22) 

మోషేనిబంధనాకాలములో కేవలము ఒక నగరములో [యెరూషలేము] వున్న ఒక పర్వతముపైన [మోరీయా ప్రాంతపు పర్వతము] కొన్ని ప్రత్యేకమైన దినాలలో ప్రత్యేకమైన విధానములో ప్రత్యేకమైన వ్యక్తులద్వారా ఆపాదించబడిన అర్పణలనే నిజదేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. ఆ కాలములో ఆదిశలో చేయబడిన ఆరాధనా భంగిమలను వ్యవ్యక్తపరచబడిన జిహ్వాఫలాలను దేవుడు అంగీకరించాడు. 

మోషేనిబంధనాకాలములో (పాతనిబంధనాకాలములో) దేవుడు ఇశ్రాయేలీయులు భంగం చేసిన మోషేనిబంధన స్థానములో వేరొక సరికొత్త నిబంధనను చేయబోతున్నట్లు వాగ్ధానము చేసాడు. తాను చేయబోతున్న ఆ నిబంధన తన సేవకుడైన మెస్సయ్యా ద్వారా చేయబోతున్నట్లుకూడా ఆ యా ప్రవక్తలద్వారా సూచించాడు. అదే సందర్భములో దైవారాధనలో భాగమైన దైవసేవను [פְּלַח/పెలాఖ్] రాబోతున్న మెస్సయ్యకు సమస్తజనులు ఆపాదించాలి అన్న దేవుని చిత్తాన్ని భవిశ్యవాణిద్వారా విపులీకరించాడు:

సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు [హీబ్రూ మూలపదము: פְּלַח/పెలాఖ్] ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దానియేలు.7:14) 

నిత్యరాజ్యములోని పాలక సింహాసనము ఒక్కటే. దానిపై ఆశీనుడైనవాడు ఒక్కడే–తండ్రికుమారుల ఏకత్వం! ఆయనే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు [1తిమోతి.6:15; ప్రకటన.17:14, 19:16]. ఆయననే సమస్త ప్రజలు సృష్టి ఆరాధిస్తూ సేవించాలి:

ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు [గ్రీకు మూలపదం: λατρεύω/లాట్రేయో] ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. ” (ప్రకటన.22:2-3)

క్రొత్తనిబంధనలో దైవారాధన 

క్రొత్తనిబంధనాకాలములో దైవారాధనలో భాగంగా యివ్వబడే అర్పణల విశయములో ప్రాముఖ్యమైన మార్పులు చేయబడ్డాయి. అంతేగాక పాతనిబంధనాకాలములో దైవారాధనకుండిన పరిమితులు తొలగించబడ్డాయి. 

మెస్సయ్య యొక్క ప్రశస్త రక్తముతో చేయబడిన క్రొత్తనిబంధనలో ప్రవేశించినవారంతా మెస్సయ్య ఉపదేశానుసారముగా నిజదేవున్ని ఆరాధించాలి/పూజించాలి. 

దేవుని నిర్ణయకాలములో మెస్సయ్య వచ్చాడు. సాతానుని శోధనలకు వాక్యానుసారముగా స్పందిస్తూ మెస్సయ్య పాతనిబంధనగ్రంథములోని బోధను ఉటంకిస్తూ క్రింది విధంగా బదులిచ్చాడు:

యేసు వానితో సాతానా, పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను. (మత్తయి.4:10) 

దైవారాధనవిశయములో మెస్సయ్య చేసిన ఉపదేశము:

అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింప [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] వలెననెను.” (యోహాను.4:23-24) 

మెస్సయ్య ఆగమనము తదుపరి ఆయన బోధ/ఉపదేశము ప్రకారము మ్రొక్కటము లేక ఆరాధన [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] అన్న పదము ఆత్మీయ విశిష్టతను అందుకుంది. అది నరమాత్రులకు ఆపాదించకూడదు (అపో.కా.10:25-26). దేవదూతలకు కూడా దాన్ని ఆపాదించరాదు (ప్రకటన.19:10, 22:8-9). అది దేవునికి చెందినది (మత్తయి.4:10; యోహాను.4:23-24; అపో.కా.8:27, 24:11; హెబ్రీ.11:21; ప్రకటన.19:10, 22:9). అయినా దేవుని ప్రియకుమారుడైన మెస్సయ్యకు దాన్ని ఆపాదించడముద్వారా (మత్తయి.2:11; 8:2; 9:18-19; 28:9,17; యోహాను.9:38-39; హెబ్రీ.1:6; ప్రకటన.5:14) దేవునికి ఆపాదించగలము! ఇది అపోస్తలుల బోధ మరియు మాదిరి.

మెస్సయ్య ఉపదేశానికి అపోస్తలుల వివరణ 

కుమారునిద్వారా తండ్రికి కృతజ్ఙతలు, మహిమ, మరియు ఆరాధన ఆపాదించాలి:

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.” (హెబ్రీ.13:15)
యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజ కులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.” (1పేతురు.2:5)  
ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను; ఒకడు ఉపచారము చేసినయెడల దేవుడు అను గ్రహించు సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తుద్వారామహిమపరచబడును...” (1పేతురు.4:11)

కుమారునిద్వారా తండ్రికి కృతజ్ఙతలు, మహిమ, మరియు ఆరాధన ఆపాదించటము అంటే క్రింది మూడు విధాలుగా అర్థము చేసుకునే అవకాశముంది:

(1) కుమారునికి వాటిని ఆపాదిస్తే తండ్రికి ఆపాదించినట్లే.
(2) కుమారుని నామములో తండ్రికి అపాదిస్తున్నాను అని ప్రకటించడము.  
(3) కుమారునికి వాటిని అందిస్తూ తండ్రికి వాటిని అందించమని కుమారునికి తెలియచేయడము. 

మొదటి రెండురకాల అర్థాలకు లేఖనాధారాలునాయి. కాని, మూడవ అర్థానికి లేఖనాధారాలు లేవు. 

యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌.” (హెబ్రీ.13:21)
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్‌
.” (2పేతురు.3:18)
మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.” (ప్రకటన.1:6)
ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్య ములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు…మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొఱ్ఱపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] చేసిరి.” (ప్రకటన.5:8-14) 

తండ్రికి ఆపాదించాల్సినవి:

  • మ్రొక్కటము/పూజించటము (మత్తయి.4:10; యోహాను.4:23-24; ప్రకటన.19:10; 22:8-9)
  • స్తుతి/స్తోత్రము (రోమా.15:9-11) 
  • మహిమ (గలతీ.1:5; రోమా.11:36, 16:27; ఫిలిప్పీ.4:20; 1తిమోతీ.1:17; ప్రకటన.4:9; 5:13)
  • ఘనత (1తిమోతీ.1:17; ప్రకటన.4:9; 5:13)
  • ప్రభావము (1పేతురు.5:11; ప్రకటన.4:13) 

కుమారునికి ఆపాదించాల్సినవి:

  • మ్రొక్కటము/పూజించటము (మత్తయి.28:9,17; ప్రకటన.5:8,14)
  • స్తుతి/స్తోత్రము (ప్రకటన.5:12-13) 
  • మహిమ (2తిమోతీ.4:18; హెబ్రీ.13:21; ప్రకటన.5:12-13) 
  • ఘనత (యోహాను.5:23; అపో.కా.19:17; ప్రకటన.5:12-13)
  • ప్రభావము (ప్రకటన.5:13) 

యేసు క్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి, యేసుక్రీస్తుద్వారా, నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.” (రోమా.16:26-27)
తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.” (యూదా.1:24-25)

అపోస్తలుల మాదిరి

పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] గాని, కొందరు సందేహించిరి.” (మత్తయి.28:16-17)

వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి [గ్రీకు మూలపదము: προσκυνέω/ప్రొస్కునెహొ] మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.” (లూకా.24:51-53)

మెస్సయ్య వివరణ

తండ్రిని ఘనపరచునట్లుగా [καθὼς/కాతొస్ = same as; just as; even as] అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.” (యోహాను.5:23)

నన్ను చూసినవాడు తండ్రిని చూచియున్నాడు.” (యోహాను 12:45; 14:9)

నాయందు విశ్వాసముంచు వాడు…నన్ను పంపినవానియందు విశ్వాసముంచుచున్నాడు. (యోహాను 12:44)

కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.” (1యోహాను 2:23)

నన్ను ద్వేశించువాడు నా తండ్రినికూడా ద్వేశించుచున్నాడు.” (యోహాను. 7:7; 15:23)   

పై కారణాలనుబట్టి మెస్సయ్య దేవునికి చెందిన ఆరాధనను స్వీకరించాడు (మత్తయి.8:2, 28:9,17; లూకా.24:52; యోహాను.9:35-38). అది తండ్రి చిత్తము. అది కుమారునిద్వారా తండ్రిని ఆరాధించే విధానము. ఇందులో తండ్రి చిత్తానికి/ఆజ్ఙకు లోబడనివాడు దేవుని సంబంధి కాడు. అలాంటివాడు క్రీస్తు విరోధి!

« Older Entries