తనాఖ్ లో మెస్సయ్య

మెస్సయ్య [Messiah] అన్న పదం హెబ్రీ భాషా పదమైన మషియాఖ్ [מָשִׁיחַ] యొక్క అనువాదం. మషియాఖ్ [మెస్సయ్య] అంటె అభిషిక్తుడు అని భావం. ఇదే పదం గ్రీకు భాషలో క్రిస్టొస్ [Χριστός] గా, ఆంగ్ల భాషలో క్రైస్ట్ [Christ] గా, తెలుగులో క్రీస్తుగా అనువదించబడింది.

తనాఖ్ బోధ ప్రకారం అంటే పాతనిబంధన గ్రంథము యొక్క బోధ ప్రకారం మూడు పాత్రలను లేక విధులను అభిషేకించబడిన వ్యక్తులే నిర్వర్తించాలి. అవి…

ప్రవక్తలు: దేవుని తరపున మానవులకు దైవ సందేశాన్ని అందించేవారు.
యాజకులు: మానవుల తరపున దేవునికి ఆరాధన సమర్పించే వారు.
రాజులు: దేవుని తరపున మానవులను పరిపాలించేవారు.

పాతనిబంధన గ్రంథములోని లేఖనాలు రాబోతున్న మోషేవంటి ప్రవక్తను గురించి, రాబోతున్న మెల్కీసెదెకు క్రమములోని యాజకుని గురించి, అలాగే రాబోతున్న దావీదువంటి రాజును గురించి భవిశ్యవాణులను అందిస్తూ వచ్చాయి.

పాతనిబంధన లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించి చూస్తే భవిశ్యత్తులో రాబోతున్న మూడు అభిశిక్త పాత్రలను పోశించేది ముగ్గురు వేరువేరు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి ఆ మూడు పాత్రలను పోశించబోతున్నడు అన్న సత్యం ద్యోతకమవుతుంది. ఆవ్యక్తి మూడంతల అభిశేకమున్న ప్రత్యేకమైన వ్యక్తి; మూడు రకాల భాధ్యతలను నిరంతరం నిర్వర్తిస్తూ మానవాళికి పరిపూర్ణ సార్దకత్వాన్ని అందిచబోయే మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తే ప్రవచించబడిన రాబోవు మెస్సయ్య లేక క్రీస్తు!

పాతనిబంధన లేఖనాలు రాబోతున్న ఈ విశిష్ట వ్యక్తిని ‘నా సేవకుడు’ [యెషయా.52:13], ‘నీతిమంతుడైన నా సేవకుడు’ [యెషయా.53:11], ‘దేవుని పరిశుద్ధుడు’ [కీర్తన.16:10], ‘దేవుని అభిశిక్తుడు’ [దానియేలు.9:26], ‘మనుష్యకుమారుడు’ [దానియేలు.7:13], ‘దేవుని కుమారుడు’ [కీర్తన.2:7; సామెతలు.30:4], ‘నిబంధన దూత’ [మలాకి.3:1] వంటి ప్రత్యేక బిరుదులతో పరిచయం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *