మౌఖిక తోరాహ్: రబ్బీల దగా

దాదాపు 1400 క్రీ.పూ.లో అదోనాయ్ ఎలోహిం [ప్రభువైన దేవుడు] మోషేద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఒక నిబంధనను చేసాడు. ఆసందర్భములో ఇశ్రాయేలీయులకు మోషేద్వారా ఎలోహిం ఒక ఉపదేశాన్ని లేక ధర్మాన్ని అందించాడు. ఆ ఉపదేశాన్నే మోషే ధర్మశాస్త్రము [תּֽוֹרַת מֹשֶׁ֣ה/తవ్రాత్ మోషే] లేక ‘తోరాహ్’ [תּוֹרָה/తోరాహ్] అని లేఖనాలు పేర్కొంటున్నాయి.

ఎలోహిం [దేవుడు] యొక్క ఆజ్ఙను బట్టి దైవజనుడు మోషే ఆ ఉపదేశాన్ని/ధర్మాన్ని అంతటిని గ్రంథస్త రూపములో భావితరాలవారికొరకై భద్రపరచాడు. గ్రంథస్తరూపములోని ఉపదేశానుసారంగానే జీవించాలంటూ ఇశ్రాయేలీయులకు ఎలోహిం [దేవుడు] స్పష్టమైన సూచనలను తనాఖ్ లో [పాతనిబంధన గ్రంథములో] అందించాడు. కాని, గ్రంథానికి వేరుగా కేవలం మౌఖికంగా యివ్వబడిన సూచనలనుగురించి అంటే రబ్బీలు బోధిస్తున్న మౌఖిక తోరాహ్ ను గురించి ఎలోహిం [దేవుడు] ఏ మాటా చెప్పలేదు.

క్రీస్తుశకం మొదటిశతాబ్ధము తరువాత యూదు మతపెద్దలు అంతకు ముందు ఏ ప్రవక్త కనీ వినీ ఎరుగని రెండవ తోరాహ్ లేక మౌఖిక తోరాహ్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మౌఖిక తోరాహ్ యొక్క వ్రాతరూప సంకలనాన్నే యూదు మతస్తులు మిష్నా [מִשְׁנָה] అని పేర్కొంటారు.

మిష్నా [מִשְׁנָה] అంటే హీబ్రూ భాషలో “వల్లేవేయడం ద్వారా ధ్యానించటము” అని భావం. మిష్నా ఆరు ఆదేశాలుగా [orders] విభజించబడింది. ఈ ఆదేశాలలోని ప్రతి ఆదేశం 7-12 వ్యాసాలు [tranctates] గా వ్రాయబడింది. వెరసి అన్నీ కలిపి 63 వ్యాసాలుగా మిష్నా సంకలనం చేయబడింది.

యూదుమతపెద్దలైన రబ్బీలు వ్రాసి ప్రవేశపెట్టిన ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] అన్నది తనాఖ్ [39 గ్రంథాలతో కూడిన పాతనిబంధన గ్రంథము] కు పూర్తిగా వ్యతిరేకమైనది. అందుకుగల కారణాలు ఈ క్రింద యివ్వబడినవి:

(1) యూదుమతపెద్దలైన రబ్బీలను వారి బోధలను ప్రామాణికంగా స్వీకరించెందుకు తనాఖ్ గ్రంథములో ఎలాంటి సూచన యివ్వబడలేదు. నిజానికి యూదుమతపెద్దలు తమకుతాము అలంకరించుకున్న ‘రబ్బీ(లు)’ అన్న పదమే తనాఖ్ గ్రంథములో ఉపయోగించబడలేదు. 

(2) ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] అన్న పదజాలము తనాఖ్ లో ఒక్క సారికూడా పేర్కొనబడలేదు.

(3) తనాఖ్ లో రెండు తోరాలున్నాయి అన్న మాటలేవీ వ్రాయబడలేదు.

(4) “లేని వార్తను పుట్టిచకూడదు” (ని.కాం.23:1-2) అన్నది తోరాహ్ లోని అతి ప్రాముఖ్యమైన ఆజ్ఙ. తోరాహ్ లో లేని ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] ను ప్రవేశపెట్టడమన్నది పరమతండ్రికే వ్యతిరేంకంగా లేని వార్తను పుట్టించడము! అలాంటి సాహసము ఏ మానవుడు చేయకూడదు. ఒకవేల ఎవరైనా ఆ సాహసం చేస్తే దైవసంబంధులెవరు ఆ వ్యక్తితో సహవసించకూడదు. 

(5) మోషేద్వారా ఇశ్రాయేలీయులకు యివ్వబడిన తోరాహ్ కు మార్పులుచేర్పులు చేసే హక్కు కేవలం దాన్ని యిచ్చిన పరమతండ్రి అదొనాయ్ ఎలోహింకు [ప్రభువైన దేవుడు] మాత్రమే చెందినది. నరులెవ్వరికీ ఆ హక్కు యివ్వబడలేదు. పండితులైనా పాష్టర్లు అయినా, రాజులైనా రబ్బీలైనా, క్రైస్తవులైనా యూదులైనా మోషేధర్మశాస్త్రాన్ని మార్చేందుకు ఎవరికీ హక్కు లేదు.

మోషేధర్మశాస్త్ర విషయములో ఎవైనా మార్పులు తీసుకురావాలని పరమతండ్రి ఉద్ధేశిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని ఏవిధంగా తన సేవకుడు మరియు ప్రవక్త అయిన మోషేద్వారా అందించాడో అదేవింధంగా తన సేవకులైన ప్రవక్తలద్వారానే ఆ ధర్మశాస్త్రానికి తన చిత్తప్రకారమైన మార్పులను ప్రవేశపెట్టగలడు. అంతేగాని, ధర్మశాస్త్రానికి మాటలను కలపటంగాని లేక తీసివేయటంగాని పండితులచేత, పాష్టర్లచేత, గొప్పవారిచేత లేక రబ్బీలచేత ఎట్టిపరిస్తితులలోను చేయించడు. అలాంటి ప్రయత్నము అదొనాయ్ ఎలోహింకు వ్యతిరిక్తమైనది.

అయితే, పండితులుగా రాజులుగా తమనుతాము పరిచయం చేసుకునే యూదుమతపెద్దలైన రబ్బీలు మోషేధర్మశాస్త్రానికి వేరుగా రెండవ తోరాహ్ ను సృష్టించుకొని అదొనాయ్ ఎలోహింకు [ప్రభువైన దేవునికి] వ్యతిరేకంగా యూదు సంస్కృతి ముసుగులో వేరొక మతధర్మాన్ని ప్రవేశపెట్టి అనేకులను మార్గభ్రష్టత్వం పట్టిస్తున్నారు.

మోషే వ్రాసిన తోరాహ్ గ్రంథానికి అంటే మోషేద్వారా యివ్వబడిన పంచకాండాలకు ఏమాటలను కలపకూడదని అలాగే ఏమాటలను తీసివేయకూడదని వాటిని అందుకున్న యూదు సమాజానికి మోషే వ్రాసిన తోరాహ్ లో స్పష్టమైన ఆజ్ఙ యివ్వబడింది:  

కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. (ద్వి.కాం.4:1-2) 

పై లేఖన వెలుగులో మోషేద్వారా యివ్వబడిన దేవుని మాటలకు అంటే మోషే తోరాహ్ కు ఏకంగా మరొక తోరాహ్ అంటే ‘మౌఖిక తోరాహ్’ ను కలపడమన్నది ఊహకందనంత విస్తారమైన దైవవ్యతిరేక పాపము. ఈ పాపములో ఏదైవసంబంధులుకూడా ప్రత్యక్షంగానైన లేక పరోక్షంగానైనా పాల్గొనకూడదు.  

(6) ప్రభువైన దేవుడు సెలవిస్తున్నదాని ప్రకారం మానవుల విధులనుబట్టి నేర్చుకున్న భయభక్తులు దేవునికి అంగీకారము కావు:    

ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొనియున్నారు వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి. (యెషయా.29:13) 

పై లేఖన వెలుగులో యూదు మతపెద్దలైన రబ్బీలు మౌఖిక తోరాహ్ పేరుతో బోధిస్తున్న స్వంత అభిప్రాయాలను, పారంపర్యాచారాలను, మరియు విధులను పాటించడమన్నది ప్రభువైన దేవునికి విరుద్ధమన్న సత్యం మరచిపోకూడదు. 

(7) మోషేద్వారా వ్రాయబడిన తోరాహ్ [ధర్మశాస్త్రము] గ్రహించలేనంత కఠినమైనది కాదు అందుకోలేనంత దూరమైనది కాదు అంటూ లేఖనమే సాక్ష్యమిస్తున్నది:  

ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును. నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. (ద్వి.కాం.30:10-11) 

పై లేఖన ప్రకటనను బట్టి గ్రంథ రూపములోనున్న తోరాహ్ ను వివరించేందుకు మరొక తోరాహ్ లేక మౌఖిక తోరాహ్ ను అందించాల్సిన ఆవశ్యకత ఎంతమాత్రము లేదు.

(8) క్రీస్తుశకం రెండవ శతాబ్ధం నుండే మౌఖిక తోరాహ్ [Oral Torah] అన్న పదప్రయోగము, ప్రతిపాదన మరియు సిద్ధాంతం వునికిలోకి వచ్చాయి. తత్ఫలితంగా రబ్బీల నిర్విరామ కృషి క్రీస్తు శకము ఐదవ శతాబ్ధముకల్లా మౌఖిక తోరాను గ్రంథస్తరూపములో ప్రత్యక్షం చేయగలిగింది. అంతకుముందు మౌఖిక తోరాహ్ అన్న పదప్రయోగముగాని లేక అలాంటి తోరాహ్ ఉనికి యొక్క సమాచారముగాని లేవు.

ఒకవేల క్రీస్తుకు పూర్వమే వాటికి ఉనికి వుండివుంటే యూదు మతవిశ్వాసాలలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న వాటి ఉనికిని గూర్చిన సమాచారము క్రీస్తుకు పూర్వము వ్రాయబడిన యూదు గ్రంథాలలో [Apocripha] లేక క్రీస్తుకు పూర్వం మూడవ మరియు మొదటి శతాబ్ధాల మధ్య వ్రాయబడి భద్రం చేయబడిన కొన్ని వేల సంఖ్యలో వున్న మృతసముద్ర-తాళపత్ర ప్రతులలో [Dead Sea Scrolls] తప్పకుండా పేర్కొనబడేవే. కాని, అలాంటిది యేది జరుగలేదు. కారణం, క్రీస్తుకు పూర్వం అవి ఉనికిలో లేవు. క్రీస్తు తరువాత రబ్బీల చలువతో ఉనికిలోకి వచ్చింది మౌఖిక తోరాహ్!

(9) లిఖిత తోరాహ్ తోపాటు మౌఖిక తోరాహ్ కూడా మోషే ఎలోహిం నుండి అందుకున్నాడు అని చెప్పే రబ్బీల కథనం కేవలం ఒక కపట ప్రయత్నమేతప్ప అందులో సత్యం లేశమాత్రమైనా లేదు అనడానికి మరొక లేఖనసాక్ష్యం ధర్మశాస్త్రాన్ని అంటే లిఖిత తోరాహ్ ను అందుకున్న తరువాత మోషే కొన్ని సందర్భాలలో కార్యాచరణ విశయములో ఎలోహిం యొక్క సూచనలకై ఎదురుచూడటం. ఈ రకమైన సందర్భాలలో నాలుగు ప్రధానమైనవి ఈ క్రింద యివ్వబడినవి:

అ) సంఖ్యాకాండము 9:5-8

యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతివిు; యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా మోషేనిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను.”

ఆ తరువాత ఆ సందర్భములో మోషే చేయవలసిన వివరాలను ఎలోహిం [దేవుడు] మోషేకు తెలియచేసాడు. ఒకవేల మౌఖిక తోరాహ్ అన్నది అదివరకే మోషేకు అందించబడితే ఈ సందర్భములో మోషే ఎలోహిం [దేవుని] యొక్క వివరణకై ఎదురుచూడాల్సి వచ్చేది కాదు.

ఆ) సంఖ్యాకాండము 15:32-36

ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొనివచ్చిరి. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.”

గమనిక: మౌఖిక తోరాహ్ [Oral Torah] లో సూచించబడిన దాని ప్రకారము సబ్బాతు దినాన కట్టెలు యేరుకునేవ్యక్తులకు విధించబడాల్సిన శిక్ష ‘రాల్లతో కొట్టి చంపడం’ [మైమోనిడెస్, మిష్నెహ్ తోరాహ్, షబ్బాత్ 1].

కనుక, ఈ వివరాన్ని కలిగివున్న మౌఖిక తోరాహ్ [Oral Torah] ను మోషే లిఖిత తోరాహ్ తోపాటు అందుకొని వుండివుంటే ఆ సందర్భములో ఎలోహిం యొక్క సూచనకొరకు తిరిగి కనిపెట్టేవాడు కాదు. కాని మోషే ఆ సందర్భములో ఎలోహిం యొక్క సూచనకొరకు వేచివుండాల్సి వచ్చింది. కారణం, మోషేకు తెలియని మౌఖిక తోరాహ్ [Oral Torah] అన్నది రబ్బీల స్వంత సృష్టి!
 
ఇ) సంఖ్యాకాండము 27:1-7

అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యములో మరణ మాయెను. అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతిబొందెను. అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.”

మోషే వద్ద మౌఖిక తోరాహ్ వుండివుంటే పై లేఖనాలలో వ్యక్తపరచబడినవిధంగా సెలోపెహాదు కుమార్తెల సమస్యకు పరిష్కారం మోషే వెంటనే అందించివుండేవాడు. కాని మోషే వద్ద మౌఖిక తోరాహ్ అన్నదేదీ లేకుండింది కాబట్టే వారి సమస్యకు ఎలోహిం [దేవుని] యొక్క సూచనలకై వేడుకోవలసి వచ్చింది.

ఈ) లేవికాండము 24:10-14

ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ​​ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసి కొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె. యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. శపించినవానిని పాళెము వెలుపలికి తీసి కొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను.”

పై లేఖనాల వెలుగులో దైవదూషణకు మరణదండన అన్నది ఎలోహిం వివరించేంతవరకు ఇశ్రాయేలీయులు మరియు మోషే ఎదురుచూడాల్సి వచ్చింది. రబ్బీల కథనం ప్రకారం అదివరకే అందించబడి లిఖిత తోరాహ్ గా మార్చబడిన ఎలోహిం యొక్క సూచనలలో లేని వివరాలు మౌఖిక తోరాహ్ లో వుండాలి. అయితే, మౌఖిక తోరాహ్ అన్నది కేవలం క్రీస్తు శకములోని రబ్బీల సృష్టి కాబట్టి మోషేవద్ద అలాంటిదేది లేకుండింది. ఆ కారణాన్నిబట్టి ఆ సందర్భములో పాటించాల్సిన కార్యాచరణాన్ని తెలుసుకునేందుకు ఎలోహిం [దేవుని] యొద్దనుండి మోషే ఎదురుచూడాల్సివచ్చింది. అది తెలియపరచబడిన తరువాత ఆ వివరాలు లిఖిత తోరాహ్ లో చేర్చబడ్డాయి.

(10) రబ్బీలు తమ మతానికి ప్రధాన పునాదియైన రెండవ తోరాహ్ కు చెల్లుబాటును తెచ్చుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా, రెండవ తోరాహ్ మోషేనుండి మౌఖికంగా తరతరాలకు అందించబడింది అంటూ వ్రాతపూర్వకంగా యివ్వబడిన తోరాహ్ లోని ప్రకటనకే వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తూ అమాయకులను తప్పుదోవపట్టిస్తున్నారు.

గ్రంథస్తరూపములోని తోరాహ్ ప్రకటిస్తున్న సత్యము ప్రకారము ప్రభువైన దేవుడు తనతో మాట్లాడిన మాటలన్నింటిని దైవజనుడు మోషే వ్రాసి పెట్టాడు.

దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.” (ని.కాం.20:1)

మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి” (ని.కాం.24:4)

పై లేఖనాల సాక్ష్యం ప్రకారం కేవలం ఆజ్ఙలను మాత్రమే కాదు వాటి వివరాలతో సహా యెహోవా పలికిన మాటలన్నింటిని మోషే వ్రాసాడు.

మోషే వద్ద తాను వ్రాసి యిచ్చిన దేవుని మాటలకు అంటే లిఖిత తోరాహ్ కు వేరైన దేవుని మాటలంటూ వేరే ఏవీ లేవు అన్న సత్యం పై లేఖనాధారంగా ప్రస్పుటమవుతున్నది. అయినా, ఈ సత్యానికి వ్యతిరేకంగా రబ్బీలు తమ స్వసృష్టియైన మౌఖిక తొరాహ్ [Oral Torah] మోషే ద్వారానే యివ్వబడింది అంటూ ప్రభువైన దేవునికి మరియు ఆయన సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా అసత్యాలను పుట్టించుకొని తద్వారా తమ మతాన్ని సమర్ధించుకునే మోసయుక్తమైన ప్రయత్నాన్ని చేపట్టారు. లేఖన జ్ఙానం లేని ఆమాయకులు అనేకులు వారి మోసానికి బలియై అసత్య మార్గములో ప్రవేశిస్తున్నారు.

(11) ప్రభువైన దేవుడు మోషేద్వారా గ్రంథ రూపములో అందించిన తోరాహ్ [ధర్మశాస్త్రము] దాదాపు ముప్పై సార్లకు పైగా తనాఖ్ [పాతనిబంధన గ్రంథము] లో విస్పష్టంగా పేర్కొనబడింది. అయితే, రబ్బీలు చెప్పుకుంటున్న ‘మౌఖిక తోరాహ్’ [תורה שבעל פה/తోరాహ్ షె-బె అల్-పెహ్/Oral Torah] అంటే మోషే చేత గ్రంథస్థము చేయబడకుండా కేవలము మాటల రూపములో అందించబడిన  రెండవ తోరాహ్ గురించి మాత్రము తనాఖ్ [పాతనిబంధన గ్రంథము] లో ఎక్కడా చెప్పబడలేదు అన్నది గమనార్హమైన విశయము: 

నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల…” (ద్వి.కాం.28:58)

మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.” (ద్వి.కాం.28:61)

అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును. ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపరచును.” (ద్వి.కాం.29:20-21) 

గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.” (ద్వి.కాం.29:27)

ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును.” (ద్వి.కాం.30:10)

అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహోషువ.1:7-8)

మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండమీద కట్టించెను. దానిమీద వారు యెహోవాకు దహనబలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలీయులకు వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రగ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్లమీద వ్రాయించెను.” (యెహోషువ.8:30-32)

ఆ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నిటిని, అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలును పిల్ల లును వారి మధ్యనుండు పరదేశులును వినుచుండగా యెహోషువ సర్వసమాజము నెదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదువక విడిచిన మాటయొక్క టియు లేదు.” (యెహోషువ.8:34-35)

కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, యెడమకుగాని కుడికిగాని దానినుండి తొలగిపోక…” (యెహోషువ.23:6)

నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;” (1రాజులు.2:3)

అయితే కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింప కూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమునిమిత్తము వాడే మరణ శిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.” (2రాజులు.14:5)

మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది.” (2రాజులుs.22:13)

రాజు ఒక స్తంభముదగ్గర నిలిచియెహోవా మార్గములయందు నడచి, ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను గైకొని, యీ గ్రంథమందు వ్రాయబడియున్న నిబంధన సంబంధమైన మాటలన్నిటిని స్థిరపరచుదుమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరు ఆ నిబంధనకు సమ్మతించిరి.” (2రాజులు.23:3)

అంతట రాజునిబంధన గ్రంథమునందు వ్రాసి యున్న ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగను ఆచరించుడని జనులకందరికి ఆజ్ఞాపింపగా” (2రాజులు.23:21)

మరియు కర్ణపిశాచి గలవారిని సోదెచెప్పువారిని గృహదేవతలను విగ్రహములను, యూదాదేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషీయా తీసివేసి, యెహోవామందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను.” (2రాజులు.23:24)

“గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.” (1ది.వృ.16:39-40)

మరియు మోషే యిచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవా మందిర మందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను.” (2ది.వృ.23:18)

మరియు యెహోవాధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహనబలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియా మకకాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను.” (2ది.వృ.31:3)

మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటలవిషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించి యున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది.” (2ది.వృ.34:21)

ఆలకించుడి, నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటిని రప్పించెదను.” (2ది.వృ.34:24)

పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.” (2ది.వృ.34:31)

మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసికొనిరి.” (2ది.వృ.35:12)     

యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీ యేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.” (ఎజ్రా.3:2)

మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి,ఏ దినమునకు నియ మింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.” (ఎజ్రా.3:4)

మరియు వారు యెరూష లేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.” (ఎజ్రా.6:18)

ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మనస్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి…” (నెహెమ్యా.8:1-2)

యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుటకనుగొనెను. మరియు వారు తమ పట్టణము లన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.” (నెహెమ్యా.8:14-15)

మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించుకొంటిమి.” (నెహెమ్యా.10:34)

మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.” (నెహెమ్యా.10:36)

“ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితివిు గనుకనేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి.” (దానియేలు.9:11)

మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడునడవడి మానక పోతివిు; నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనునట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనక పోతివిు.” (దానియేలు.9:13)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *