Monthly Archives: March 2020

Permalink to single post

కన్యక లేక యవ్వన స్త్రీ?

కాబట్టి ప్రభువు తానే యొక సూచన [אוֹת/oth/ఓథ్] మీకు చూపును. ఆలకించుడి, కన్యక [עַלְמָה/అల్మ] గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును [קָרָא/kawraw/ఖర = to call/పిలవడము ].” (యెషయా 7:14)

పై ప్రవచనాత్మక లేఖన సందేశములో గుర్తించాల్సిన సత్యాలు:

(1) ఆదిమ హెబ్రీ భాషలో ‘అల్మ’ [עַלְמָה/alma] అనే పదానికున్న అర్థాలు: యవ్వన స్త్రీ; కన్యక/పురుష సంయోగము లేని యువతి. ఈ పదం 7 సార్లు తనాక్ లో వుపయోగించబడింది.

ఉదాహరణ: “అందుకు ఫరో కుమార్తె వెళ్లుమని చెప్పగా ఆ ‘చిన్నది’ [עַלְמָה/అల్మ] వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.” (ని.కాం.2:8).

ఇక్కడ మోషే అక్క పెళ్ళి అయిన స్త్రీ కాదు అందుకే పై లేఖనములో ఆల్మ [עַלְמָה/alma] అనే పదము ఆమెకు ఉపయోగించబడింది అన్నది గమనములో వుంచుకోవాలి.

తనాక్ అంతటిలో అల్మ [עַלְמָה/alma] అనే హెబ్రీ పదం వివాహము జరిగిన యువతిని సూచించటానికి ఒక్కసారి కూడా ఉపయోగించబడలేదు అన్న వాస్తవము ఈ సందర్భములో గమనార్హమైన విశయము.

(2) క్రీస్తుకు పూర్వమే 3వ శతాబ్ధములో హెబ్రీ భాషలోని తనాక్ లేఖనాలను గ్రీకు భాషలోకి అనువదించారు. అనువదించినవారు ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషలలో ప్రావీణ్యత సంపాదించిన యూదు పండితులు. వారు తమ లేఖనాలలోని మరియు దినాలలోని పదాల భావాలను పదాలమధ్య బేధాలను బాగా యెరిగినవారు. వారు అనువదించిన తనాక్ యొక్క గ్రీకు లేఖనాలను సెప్టూజింట్ [Septuagint] అని పేర్కొంటారు. సెప్టూజింటులో యెషయా 7:14లోని పదాన్ని గ్రీకులో ‘పార్థెనోస్’ [παρθένος/parthenos] అనే పదంగా అనువదించారు. ఇదే పదం క్రొత్తనిబంధనలోని మత్తయి వ్రాసిన సువార్తలో వుపయోగించబడింది:

ఇదిగో కన్యక [παρθένος/parthenos] గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు” (మత్తయి 1:23).

గ్రీకు భాషలో ‘పార్థెనోస్’ [παρθένος/parthenos] అన్న పదానికున్న అర్థాలు: యువతి; యవ్వన స్త్రీ; కన్యక/పురుష సంయోగము ఎరుగని యువతి; స్త్రీ సాంగత్యము ఎరుగని పురుషుడు.

(3) ఆదిమ హెబ్రీ భాషలో ‘బెతూల’ [בְּתוּלָה/bethulah] అనే పదముకూడా యవ్వన స్త్రీలకు వాడబడింది. ఈ పదం 50 సార్లు తనాక్ లో వుపయోగించబడింది. ఈ పదానికున్న అర్థాలు: యవ్వన స్త్రీ; కన్యక.

తనాక్ (పాతనిబంధన) లో వుపయోగించబడిన హెబ్రీ భాషాపదం బెతూల [בְּתוּלָה/betulah] లో కన్యత్వము స్పష్టముగా ప్రతిబింబించడములేనందుననే ఈ పదాన్ని వుపయోగించిన కొన్ని సందర్భాలలో కన్యత్వాన్ని సూచించడానికి కన్యత్వ వివరణ యివ్వబడింది: ఉదాహరణలు:


ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె బెతూల (בְּתוּלָה/bethulah), ఏ పురుషుడును ఆమెను కూడలేదు;” (ఆది.కాం.24:16)

తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత బెతూల (בְּתוּלָה/bethulah), అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును.” (లేవీ.కాం.21:3)

(4) అల్మ [עַלְמָה/alma] అన్న హెబ్రీ పదము 7 సార్లు తనాక్ (పాతనిబంధన గ్రంథము) లో వుపయోగించబడినా ఒక్కసారికూడా వివాహమైన యవ్వన యువతికి ఆపాదించబడలేదు. అయితే, ‘బెతూల’ [בְּתוּלָה/bethulah] అన్న హెబ్రీ పదము మాత్రము తనాక్ (పాతనిబంధన గ్రంథము) లో ఒకసారి వివాహమైన యవ్వన యువతికికూడా ఆపాదించబడింది. “పెనిమిటి పోయిన బెతూల [בְּתוּלָה/bethulah] గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.” (యోవేలు 1:8). దీన్నిబట్టి బెతూల కన్న అల్మ అన్న హెబ్రీ పదమే కన్యకకు సరియైన పదమని గ్రహించవచ్చు. అందుకే పరిశుద్ధాత్ముడు తన ప్రవక్తలద్వారా ‘కన్యక’ అన్న భావాన్ని సూచించడానికి ఆదిమ హెబ్రీభాషలోని ‘అల్మ’ [עַלְמָהalma] మరియు గ్రీకు భాషలోని ‘పార్తెనోస్’ παρθένος/parthenos] అన్న పదాలను వుపయోగించడము జరిగింది. విజ్ఙలు ఈ సత్యాన్ని గ్రహించగలరు!

(5) హిజ్కియా తల్లి అయినా, హిజ్కియా భార్య అయినా, లేక యెషయా భార్య అయినా కన్యక (עַלְמָה/అల్మ; παρθένος/పార్తెనోస్) కాదు. కనుక, యెషయా 7:14 హిజ్కియా విశయములోగాని, హిజ్కియా కుమారుని విశయములోగాని లేక యెషయా కుమారుని విశయములోగాని వర్తించదు, నెరవేర్చబడలేదు!

(6) యెషయా 7:14 లో యివ్వబడిన ప్రవచనములోని ప్రధానమైన భాగము “ప్రభువు తానే యొక సూచన మీకు చూపును.” ఇక్కడ ‘సూచన’ (אוֹת/oth/ఓథ్) అన్నది సర్వసాధారణ సంభవాన్ని గూర్చినది కాదు. అది ఒక ‘ప్రత్యేకమైన గుర్తు’ లేక అసాధారణ సంఘటన.

ప్రభువైన దేవుడు తానే యివ్వబోతున్న ఆ గొప్ప సూచన ఎలాంటి సూచనతో సరితూగుతుందో అంతకుముందే 11వ వచనములో సూచించాడు, “అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే” (యెషయా.7:11). అలాంటి గొప్ప సూచన ఏదీ రాజైన ఆహాజుకు తోచకపోయి వుండవచ్చు.

అలాంటి సందర్భములో ప్రభువైన దేవుడే ఒక సూచనను ఒక ప్రత్యేకమైన గుర్తును అంటే ఒక అసాధారణ సంభవాన్ని గుర్తుగా అందించటము జరిగింది. అలాంటిది ఎప్పుడు ఎక్కడ జరుగని విశయము. చరిత్రలో ఎవరూ కనీ వినీ ఎరుగని సంఘటన. నిజంగానే అది పాతాళమంత లోతైనది ఊర్థ్వలోకమంత ఎత్తయినది–ఒక కన్య [పురుష సంయోగము ఎరుగని యువతి] గర్భవతియై కుమారుని కనటం.

దేవుడైన ప్రభువు తానే చూపించబోయే ‘సూచన’ [א֑וֹת/oth/ఓథ్=ప్రత్యేకమైన గుర్తు] మానవాతీత శక్తికి సంబంధించినదనటానికి ఈ సందర్భములో మోషేకాలములో దేవుడే చేసిన రెండు ‘సూచనలను’ [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] జ్ఙాపకము చేసుకోవాలి:

మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను. మరియు ఆయనవారు నిన్ను నమ్మక, మొదటి సూచనను [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] బట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలను [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] బట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.” (ని.కాం.4:6-9).

పై లేఖనాల వెలుగులో పాతాళమంత లోతుగా ఊర్థ్వలోకమంత ఎత్తుగా వుండే ప్రభువైన దేవుడు తానే చూపే ఆ ‘సూచన’ ఏమిటి…?

“ఒక వివాహమైన యవ్వన యువతి గర్భము ధరించి కుమారుని కనును” అన్నది అనవసరమైన పదప్రయోగముతో కూడిన ప్రకటన అన్నది అటుంచి, అసలు అలాంటిది ప్రకృతిలో సంభవించే అత్యంత సాధారణమైన సంఘటన అన్నది ఇంగిత జ్ఙానమున్న ఎవరైన యిట్టే చెప్పగలరు. అందులో సూచన అంటూ యేమీలేదు! అలాంటి అత్యంతసాధారణ సంఘటనను దేవుడొక ‘సూచనగా’ [ప్రత్యేకమైన గుర్తుగా] పేర్కొన్నాడంటూ వ్యాఖానించడమే అవివేకము, హాస్యాస్పదము!

అయితే, “కన్యక [పురుష సంయోగము ఎరుగని యవ్వన స్త్రీ] గర్భముధరించి కుమారుని కనును” అన్నది అసాధారణమైన విశయము. అలాంటి సంఘటన ప్రకృతిలో జరిగే అవకాశం లేదు. ఒకవేల అలాంటిదేదైనా జరిగితే దాన్ని ఒక మహాద్భుత ఘటనగా గుర్తించాల్సిందే. అలాంటిది సార్వభౌముడైన దేవుడు మాత్రమే జరిగించగలడు. అది ‘సూచన’గా చెప్పబడుటకు అర్హతకలిగిన సంఘటన. అందుకే ప్రవక్తద్వారా దేవుడే ఆ సంఘటనను యెషయా. 7:14 లో ఒక సూచనగా పేర్కొన్నాడన్నది గ్రహించాలి.

(7) ప్రవక్త అయిన యెషయాద్వారా యివ్వబడిన భవిశ్యవాణిలోని దైవసత్యాన్ని తిరస్కరించిన శాస్త్రులు, పరిశయ్యులు, మరియు రబ్బీలు అలాగే ఈనాటి రబ్బీలమతములోని వారు ఆత్మీయ అంధకారములోనే కొనసాగుతూ 2000 సంవత్సరాల క్రితం బేత్లెహేములో మరియ అనబడే ‘కన్యక’ జీవితములో జరిగిన ప్రవచనాత్మకమైన ‘సూచన’ (אוֹת/oth/ఓథ్) యొక్క నెరవేర్పును స్వీకరించకపోగా దాని నేరవేర్పును కాలరాచే దుష్టప్రయత్నముతో తాము నాశనమార్గములో పయనిస్తూ అమాయకులను కూడా దారితప్పిస్తున్నారు! అలాంటివారిని ఉద్దేశించే మెస్సయ్య యిలా వాపోయాడు:

అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.” (మత్తయి 23:15)

యూదు వివాహ సాంప్రదాయము

యూదుల సాంప్రదాయము ప్రకారము యూదు వివాహము రెండు దశలుగా జరుగుతుంది. మొదటి దశను ‘కిద్దుషిన్’ అని రెండవ దశను ‘నిసుఇన్’ అని పేర్కొంటారు. ప్రాచీనకాలములో ఈ రెండు దశలుకూడా దాదాపు ఒక సంవత్సరపు యెడముతో వేరువేరు సందర్భాలలో రెండు ప్రత్యేకమైన వేడుకలుగా జరుపుకునేవారు. అయితే, ఈ సాంప్రదాయము క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దమువరకు కొనసాగి అటుతరువాత రబ్బీల చొరవతో మారిపోయింది. ఈ మార్పునుబట్టే ఈనాడు యూదుల వివాహములోని రెండు దశలను వెనువెంటనే పూర్తిచేసి ఒకే వేడుకగా  జరుపుకుంటున్నారు.    

కిద్దుషిన్ అంటే ప్రధానము చేయబడుట [betrothal]. ఈ దశను పూర్తిచేయటములో సాంప్రదాయ ప్రకారము యూదులు ఎన్నుకునేందుకు వీలుగా రెండు రకాల  విధానాలు అందుబాటులో వుండేవి. అవి, (అ) కన్యాశుల్కము: పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు బహుమానముగా ధనాన్ని యివ్వటము; (ఆ) పత్రము: పెళ్ళికొడుకు తాను పెళ్ళికూతురును వివాహము చేసుకోబోతున్నట్లు వ్రాతపూర్వకంగా మాట యిస్తూ వ్రాసిన పత్రాన్ని పెళ్ళికూతురుకు అందించటము.

కిద్దుషిన్ [ప్రధానము] దశ పూర్తి అయిన తరువాత ఆ యిరువురు స్త్రీ పురుషులు సంపూర్ణ భార్యాభర్తలుగా యూదు సమాజము ఎదుట లెక్కించబడుతారు. అయినను వారి వివాహములోని రెండవదశ అయిన నిసుఇన్ [పెండ్లి] పూర్తి అయ్యేవరకు వారిరువురి మధ్య శారీరక సంబంధము వుండకూడదు.    

మరియ యోసేపుల వివాహము

యూదులకు రాజు మరియు ప్రపంచానికి ప్రభువు అయిన యషువ హ మషియాఖ్ [యేసు క్రీస్తు] ను మొదటి శతాబ్ధములో గర్భాన మోసి కన్న మరియ మరియు యోసేపుల వివాహమును గురించిన కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు క్రొత్తనిబంధనా గ్రంథములో వివరించబడ్డాయి (మత్తయి.1:18-25; లూకా.1:26-38, 2:1-20).

మరియ యోసేపుల మధ్య ప్రధానము [కిద్దూషిన్] జరిగింది. ప్రధానము చేయబడటానికి మరియు పెళ్ళితంతు [నిసుఇన్] జరగటానికి మధ్య కొంత కాలము గడిచింది. ఆ మధ్యకాలములోనే మరియ దైవశక్తి చేత గర్భవతిగా మారింది. ఆ సమయానికి పైన వివరించిన ప్రాచీన యూదు వివాహ సాంప్రదాయము ప్రకారము మరియ కన్యకే [పురుష సమ్యోగము లేని యువతి] అయినా అప్పటికే కిద్దూషిన్ [ప్రధానము] జరిగివుండటాన్నిబట్టి ఆమె యూదు సమాజములో స్త్రీగా [గ్రీకు: γυναικός/గునాయ్‌కొస్=భార్య] లెక్కించబడింది.

పై కారణాన్ని బట్టి క్రొత్తనిబంధన గ్రంథములో మత్తయిద్వారా యివ్వబడిన లేఖనాలలో మరియ కన్యకగా (మత్తయి.1:18) పౌలుద్వారా యివ్వబడిన లేఖనాలలో స్త్రీగా (గలతీ.4:4) పేర్కొనబడటము గమనించగలము.

యూదు వివాహ సాంప్రదాయాలలోని లోతుపాతులను గూర్చిన అవగాహనలేని అవిశ్వాసులు కొందరు మత్తయి మరియు పౌలులద్వారా యివ్వబడిన లేఖనాలలోని ఈ తేడాను పేర్కొంటూ యిద్దరిలో ఎవరో ఒకరు అసత్యాన్ని ప్రకటిస్తున్నారు అంటూ విశ్వాసులను కలవరపరచే ప్రయత్నంగా ప్రశ్నలను లేవనెత్తుతుంటారు. అయితే, ఈలాంటి దుష్ట ప్రయత్నాల ఫలితం అవిశ్వాసులు తమ అజ్ఙానాన్నే బయటవేసుకోవటము!

అపోస్తలుడైన పౌలు ద్వారా యివ్వబడిన లేఖనాలను కొందరు వక్రీకరిస్తున్న విశయాన్ని గూర్చి అపోస్తలుడైన పేతురుద్వారా యివ్వబడిన లేఖనాలు హెచ్చరించటాన్ని ఈ సందర్భముగా జ్ఙాపకము చేసుకోవాలి:

“…మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి.” (2పేతురు.3:15-17)

అవిశ్వాసుల అభ్యంతరాలు

అభ్యంతరము #1

“మూలభాషలో ‘ఆ అమ్మాయి’ (the alma [అల్మ/עַלְמָה=కన్య/యవ్వన యువతి]) అని వుంది.”

వివరణ:

అవును యెషయా 7:14 లో వున్న పదజాలము ప్రకారము ప్రభువైన దేవుని సూచనగా ఉన్నది గర్భవతిగా వుండి కుమారుని కనబోతున్న ‘ఆ అమ్మాయి’ అని పేర్కొనబడి వుంది. కారణం…? గర్భవతియై కుమారుని కనబోతున్నది ఏదో ఒక కన్యక కాదు. అది ప్రభువైన దేవుడే తన ప్రణాలికలో ఉద్దేశించి దృష్టించిన కన్యక. అందునుబట్టి సూచనగా వుండబోతున్నది దేవుని దృష్టిలోవున్న ఒక ప్రత్యేకమైన కన్యక అని సూచించటానికి ‘ఆ అమ్మాయి’ అని మూలభాషలో పేర్కొనబడింది.

అభ్యంతరము #2

“మూలభాషలో “ఆ అమ్మాయి గర్భవతి అయింది” (the alma [అల్మ/עַלְמָה=కన్య/యవ్వన యువతి] is with child) అని వుంది.”

వివరణ:

దైవ లేఖనాలలోని ప్రవచనాలు భవిశ్యద్ కాలానికి చెందినా వాటిని గూర్చిన సమాచారము లేక వివరాలను లేఖనాలు వ్యాకరణపరంగా భూత, భవిశ్యద్, వర్తమాన కాలాలలోని యేకాలములోనైనా వ్యక్తపరచటం పరిపాటి. కనుక, యెషయా 7:14 లో వున్న ప్రవచన ప్రకటన “అ అమ్మాయి గర్భవతి అయింది” అంటూ భూతకాలములో వ్యక్తపరచటమన్నది అసాధారణమైన విశయమేమీ కాదు.

అభ్యంతరము #3

“ఒకవేల ఈ వాక్యములో “ఒక/ఆ కన్యక గర్భవతి అవుతుంది” అని వుంటే ఒక యూదుడైన యోసేపు తాను వివాహమాడిన అమ్మాయి లేక కన్యక గర్భవతిగా వుందన్నది గ్రహించినప్పుడు యెషయా 7:14 లోని ప్రవచనము తన కళ్ళముందే నెరవేరుతున్నదంటూ ఆనందముతో ఎగిరి గంతులు వేసేవాడు కదా?”

వివరణ:

మరియ భర్త యోసేపు మతపరమైన పండితుడు కాదు లేక ఒక ప్రవక్త అంతకన్న కాదు. అతను ఒక సామాన్యమైన వడ్రంగి. తాను వివాహమాడిన యువతి గర్భము ధరించింది అన్న విశయము తెలిసినప్పుడు అందరిలా అతనికి కూడా సర్వసాధారణమైన కారణము అక్రమసంబంధమే తటస్థించి వుంటుంది గాని యెషయాలోని ఒక ప్రవచనము తాను ప్రధానము చేసుకున్న యువతిలో నెరవేర్చబడబోతున్నదని ఊహించుకొని తద్వారా ఎగిరి గంతులువేసేందుకు తగిన కారణాలు లేవు. నిజానికి దేవదూతే తన కలలో ప్రత్యక్షమై మరియ గర్భానికి గల హేతువును వివరించి చెప్పినప్పుడుకూడా యోసేపు ఎగిరి గంతులు వేయలేదు అన్నది ఈ సందర్భములో జ్ఙాపకము చేసుకోవాలి.

అభ్యంతరము #4

“యెషయా 7:14 యేసువారిలో నెరవేర్చబడితే 7:15 ప్రకారము ఆయన కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేసరికి పెరుగు తేనె తిన్నట్లు ఎక్కడ వ్రాయబడివుంది?”

వివరణ:

బైబిలులోని ప్రవచనాల నెరవేర్పుకు ఆధారాలు కొన్ని సార్లు బైబిలులో మరికొన్ని సార్లు చరిత్రలో లభించటం కద్దు. అయితే, ప్రవచనాల నెరవేర్పు వివరాలన్నవి పూసగుచ్చినట్లు ప్రతీది బైబిలులోనో లేక చరిత్ర గ్రంథాలలోనో తప్పకుండా వుంటుందని లేక వుండాలని నిర్ధారించే నియమమేదీ లేదు. ఒక ప్రవచనము యొక్క ప్రధానాంశపు నెరవేర్పు తప్ప ద్వితీయశ్రేణి వివరాలు చాలమట్టుకు కాలగర్భములో కనుమరుగవుతాయి.

యెషయా.7:15 లో వ్రాయబడివున్నట్లు “కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును” అన్నవి ప్రవచనములోని ద్వితీయశ్రేణి వివరాలు. వీటి నెరవేర్పు తప్పకుండా వ్రాయబడి వుండాలి అన్న నియమమేదీ లేదు. కనుక, ఈ వివరాలు యషువ [యేసు] లో నెరవేర్చబడినప్పటికి అవి వ్రాయబడలేదు. ఒక వేల ఈ ద్వితీయశ్రేణి వివరాల నెరవేర్పు యషువలో నెరవేర్చబడినట్లు వ్రాయబడలేదు కనుక అది యషువను గురించి కాదు అని అభిప్రాయపడేవారు మరి ఆ వివరాల నెరవేర్పు వారు కోరుతున్న విధానములో ఏవ్యక్తిలో నెరవేర్చబడిందని వ్రాయబడిందో లేఖనాల ఆధారంగా చూపించ బద్దులై వున్నారు.

అభ్యంతరము #5

యెషయా 7:14 యేసువారిలో నెరవేర్చబడితే 7:16 ప్రకారము ఆయన కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేలోపలే యిద్దరు రాజుల దేశము పాడుచేయబడింది అని ఎక్కడ వ్రాయబడి వుంది?

వివరణ:

యెషయా.7:13-16 వరకుగల వచనాలలోని ప్రవచనాంశాలు:

  • ప్రభువు తానే దావీదు వంశస్థులకు ఒక సూచన [אוֹת/oth/ఓథ్] చూపును, అది కన్యక [עַלְמָה/alma] గర్భవతియై కుమారుని కనడము.
  • కన్యక గర్భవతియై కనిన కుమారునికి ఆమె ఇమ్మానుయేలు [దేవుడు మనకు తోడు] అనే పేరుతో పిలవటము [קָרָא/kawraw/ఖర = to call/పిలవడము].
  • ఆ కుమారుడు కీడును విసర్జించించి మేలును కోరుకొనే వయస్సుకు చేరుకున్నప్పుడు పెరుగు తేనే తినును. ఇది 1-3 సంవత్సరాలు వయస్సులో జరిగే విశయము.
  • ఆ కుమారునికి పెరుగు తేనెను తినే వయస్సు రాకముందే దావీదు వంశస్థులను భయపెట్టే యిద్దరు రాజుల దేశము [הָאֲדָמָה֙/హఅధామహ్/HaAdham] నిర్లక్ష్యము/పాడుచేయబడును [תֵּעָזֵ֤ב/తెఅజెబ్/TeAzeb = abandon/విడిచిపెట్టబడుట]

యెషయా.7:16 లో గమనించాల్సిన అంశాలు:

  • “కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును” అన్న వివరణ యొక్క నెరవేర్పు ఎక్కడో ఒకదగ్గర వ్రాయబడి వుండాలి నియమమేదీ లేదు.
  • ఈ సందర్భములో యివ్వబడుతున్న ప్రవచనము రాజైన ఆహాజుకు మాత్రమే పరిమితమవడము లేదు. 13-14 వచనాల ప్రకారము ఇక్కడ యివ్వబడుతున్న ప్రవచనము దావీదు వంశస్థులందరిని ఉద్దేశించి యివ్వబడింది అన్నది గమనములో వుంచుకోవాలి.
  • చరిత్రను పరిశీలించి చూస్తే ఈ ప్రవచన యొక్క నెరవేర్పు యషువ [యేసు] జనన సమయములో చోటుచేసుకున్న సత్యము అవగతమవుతుంది.
  • దావీదు వంశస్థులు భయపెట్టే యిద్దరు రాజుల దేశము నిర్లక్ష్యము చేయబడును. నిర్లక్ష్యము లేక విడిచిపెట్టబడుట అన్నది యిద్దరు రాజులకుజరిగే విశయముకాదు. అది రెండు దేశాలుకు జరిగే విశయముకూడా కాదు. అది యిద్దరు రాజులు [వేరువేరు సమయాలలో] పాలించిన ఒకే దేశానికి సంభవించే విశయము.
  • దావీదు వంశస్థులను భయపెట్టిన యిద్దరు రాజులు షొమ్రోనురాజు మరియు సిరియారాజు. షొమ్రోను రాజులు ఉత్తరదేశమైన ఇశ్రాయేలురాజ్యమును పాలించారు. కాని, వారిదేశాన్ని సిరియా రాజులు జయించి పాలించటం జరిగింది. ఆ విధంగా ఈ దేశము రెండు రాజుల దేశముగా ప్రవచనవాక్యము గుర్తిస్తున్నది. అయినా ఈ సంఘటన రాజైన ఆహాజు కాలములో సంభవించలేదు. కనుక, ఇది ఆహాజునుద్దేశించి చెప్పబడిన ప్రవచనము కాదు అన్నది సుస్పష్టము.

యెషయా.7:13-16 లేఖనాలలోని ప్రవచన నెరవేర్పులు క్రొత్తనిబంధన గ్రంథములో యివ్వబడ్డాయి. యోసేపు ప్రధానము చేసుకున్న కన్యమరియ ఒక అద్భుతముద్వారా కన్న యషువ [యేసు] యొక్క జననములో ఈ ప్రవచన నెరవేర్పును చూడగలము:

40 క్రీ.పూ. లో రోమా ప్రభుత్వము ఎదోమీయుడైన హేరోదు [Herod the Great] ను ఇశ్రాయేలుదేశముతో [షొమ్రోను రాజ్యానికి] కలిపి ఎదోము మరియు యూదా దేశాలకు రాజుగా నియమించింది.

4 క్రీ.పూ.లో హేరోదు మరణించాడు (మత్తయి.2:19-22). అయితే, అదే సంవత్సరము హేరోదురాజు కుమారుడు ఆర్కెలాయు [Herod Archelaus] తండ్రి స్థానములో ఒక రాజుగా కాకుండా మొదట కేవలము ఒక నాయకునిగా అటుతరువాత రోమా చక్రవర్తి గుర్తింపుతో ఒక ‘జాతీయ నాయకుడు’ [Ethnarch] అన్న బిరుదుతో మాత్రమే హేరోదు రాజ్యములోని ప్రధాన భాగాలైన యూదా, సమరయ, మరియు ఎదోములకు నాయకునిగా వ్యవహరించాడు.

కన్యమరియ కుమారుడు యషువ [యేసు] 4 క్రీ.పూ. వ సంవత్సరములో జన్మించాడు అన్నది చరిత్రకారుల అంచనా. ఆ సంఘటన తరువాత ఒక సంవత్సరములోపే హేరోదు కూడా మరణించాడు. ఈ రెండు ప్రాముఖ్యమైన సంఘటనలు ఒకే సంవత్సరములో చోటుచేసుకున్నా మొదటిది సంవత్సరములోని ఆదిలో రెండవది అదే సంవత్సరపు చివరలో చోటుచేసుకున్న సంఘటనలుగా అర్థముచేసుకోవచ్చు.

పై చారిత్రక వాస్తవాల వెలుగులో దావీదు వంశస్తులను భయపెట్టిన రెండు రాజుల దేశమైన సమరయ లేక ఇశ్రాయేలుదేశం యషువ [యేసు] పుట్టి కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేలోపలే అంటే 3 క్రీ.పూ. వ సంవత్సరమునుండి 6 క్రీ.శ. వ సంవత్సరము మధ్య రాజులేని రాజ్యంగా నిర్లక్ష్య స్థితికి [תֵּעָזֵ֤ב/తెఅజెబ్/TeAzeb = abandon/విడిచిపెట్టబడుట] దిగజారింది.
ఇది యెషయా.7:16 యొక్క స్పష్టమైన నెరవేర్పు. ఈ లేఖనములోని ప్రవచన నెరవేర్పు యెషయా.7:14లో దేవుడే యిచ్చిన సూచన అయిన “కన్యక గర్భము ధరించి కుమారుని కనును” అన్న ప్రవచనము యొక్క స్పష్టమైన నెరవేర్పే యషువ [యేసు] యొక్క జననము.

అభ్యంతరము #6

“యెషయా.7:14 లో “కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును” అన్న ప్రవచనము ప్రకారమే మరియ కన్యక అయివుండి యేసు [యషువ] ను కంటే మరియ ఆయనకు ఇమ్మానుయేలు అన్న పేరు పెట్టినట్లు ఎక్కడ వుంది?”

వివరణ:

పై లేఖనములోని ప్రవచనాన్ని గమనించాల్సిన అంశాలు:

ఈ లేఖనములోని ప్రధానమైన ప్రవచనము దేవుని సూచన అంటే “కన్యక గర్భవతియై కుమారుని కనటము.” ఆ కుమారునికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడము/పిలవడము అన్నది ద్వితీయశ్రేణి అంశము.

ఆ పేరుపెట్టేది లేక ఆ పేరుతో పిలిచేది ఆయన తల్లి.

యెషయా 8:3 లోని ఆజ్ఙ ప్రకారము తన కుమారునికి మహేరు షాలాల్ హాష్ బజ్ అన్న పేరు పెట్టమని దేవుడైన ప్రభువు ప్రవక్త అయిన యెషయాకు ఆజ్ఙాపించాడు. ఆ ఆజ్ఙకు లోబడి ప్రవక్త అయిన యెషయా ఆ పేరు తన కుమారునికి పెట్టాడు అన్నది ఇంగితజ్ఙానమున్న నిజవిశ్వాసులు ఎవరైనా ఇట్టే గ్రహించగలరు. కాని, దాని నెరవేర్పు వివరాలు లేఖన గ్రంథములో [పాతనిబంధనలో] లేవు. అలా వుండాలి అన్న నియమమేదీ లేదు. పేరుపెట్టిన వివరాలు గ్రంథములో లేని కారణాన్నిబట్టి యెషయా తన కుమారునికి దేవుడు చెప్పిన పేరును పెట్టలేదు అని వూహించుకోవటము సరికాదు.

పైన యివ్వబడిన లేఖన మాదిరిని అనుసరిస్తూ చూస్తే కన్యమరియ తన కుమారుని ఇమ్మానుయేలు అని పిలుచుకొన్నదని గ్రహించటానికి ఇంగితజ్ఙానముంటే సరిపోతుంది.

చివరిగా, ఇమ్మానుయేలు అంటే “దేవుడు మనకు తోడు” అని భావము. కన్యమరియ కుమారునికి దేవదూత ఆజ్ఙనను అనుసరించి యోసేపు యషువ [యేసు] అని పేరుపెట్టాడు. యషువ/యేసు [ישובה/Yah’Shua] అంటే “యెహోవా రక్షించును” అని భావము. “యెహోవా రక్షించును” అంటే “దేవుడు మనకు తోడు” అనే కదా దాని భావము! దేవుడు మనకు తోడు లేకపోతే “యెహోవా రక్షించును” అన్నది సాధ్యము కాదు. అందుచేత, “యెహోవా రక్షించును” అన్న పదజాలములో “దేవుడు మనకు తోడు” అన్న సత్యము నిక్షిప్తమై వున్నది. ఈ కారణాన్ని బట్టే యెషయా.7:14 లోని ప్రవచన నెరవేర్పు కన్యమరియ కుమారుడైన యేసు వారి జననము అన్నది మత్తయి.1:21-22 లో నిర్ధారించబడింది. ఈ ఉత్కృష్టమైన దైవసత్యాన్ని అవిశ్వాసులు అజ్ఙానులు గ్రహించజాలరు, విడమర్చిచెప్పినా స్వీకరింపలేరు.

అభ్యంతరము #7

“క్రైస్తవులు క్రొత్తనిబంధన గ్రంథములో క్రింది విశయాలు వ్రాసుకొన్నారు:

“యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; (మత్తయి.1:18-20)

“క్రైస్తవులు పైవిధంగా వ్రాసుకున్నారు కాబట్టి తద్వారా వారు పరాయి వ్యక్తి భార్యను అంటే యోసేపు భార్య అయిన మరియను దేవుడు ఆశించి వ్యభిచరించాడు అని చెప్పడముతో సమానము. ఈ రకమైన విశ్వాసముగల క్రైస్తవుల ఆలోచనావిధానము మతము ఎంత మూర్ఖమైనదో చెడ్డదో అర్థమవుతున్నది.”

వివరణ:

క్రొత్తనైబంధన గ్రంథము క్రైస్తవులు వ్రాసుకున్న గ్రంథము కాదు. యేసే [యషువ] క్రీస్తు [హమషియాఖ్] అన్న విశ్వాసములోకి వచ్చిన యూదులు దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాసిన లేఖనాల సంపుటి క్రొత్తనిబంధన గ్రంథము.

క్రొత్తనిబంధన గ్రంథము దైవగ్రంథముగా విశ్వసించే ఏ క్రైస్తవుడుకూడా “యోసేపు భార్య అయిన మరియను దేవుడు ఆశించి వ్యభిచరించాడు” అని విశ్వసించడు, చెప్పజాలడు. నిజానికి ఇంతటి నీచమైన నికృష్టమైన తలంపే క్రైస్తవుల దరికికూడా రాదు. ఈ రకమైన తలంపును భావనను క్రైస్తవులకు అంటగట్టే ప్రయత్నము చేసే వ్యక్తులు ఈ ప్రయత్నములో తమ స్వభావము తమను ప్రభావితం చేస్తున్న తమ మతస్వభావము ఎంత సంస్కారహీనమైనవో నీచాతినీచమైనవో నిరూపిస్తున్నారు. ఈ రకమైన అలోచనా సరళి దైవవిరోధి అయిన బయెల్జెబూలు [בַּעַל זְבוּב/Baal Zebub] యొక్క దాసుల ప్రత్యేకత.

ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ప్రభువైన దేవున్ని ఈ రకమైన దూషణకు గురిచేసేవారు అత్యంత శాపగ్రస్తులు. వారు అతిగొప్ప శిక్షకు పాత్రులు. అలాంటివారికి వారి మాటలతీరుకు దూరంగా వుండటం దైవసంబధులకు శ్రేయస్కరం!

 

Views: 783

Permalink to single post

దైవ ప్రణాళిక: యూదుల పాత్ర అన్యుల స్థానం

దేవుడు అందరికి దేవుడు

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలికచొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రికనిబంధననుకూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతంలేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య అయిన యషువనందు అందరికి చాలిన రక్షణను సిద్ధపరచి దాన్ని అందరికి అందుబాటులో అంటే కేవలం విశ్వాసదూరములోనే వుంచాడు.  

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] కేవలం యూదులకు మాత్రమే కాదు సర్వశరీరులకు నాధుడు మరియు దేవుడు:

“కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో యిట్లనెను సర్వలోకనాధుని నిబంధన మందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక” (యెహోషువ.3:9-10)

 సర్వలోకనాధుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.”(యెహోషువ.3:13)

“సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కు దువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.” (మీకా.4:13) 

“అతడు నాతో ఇట్లనెనుఇవి సర్వలోకనాధుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్లు ఆకాశపు చతుర్వాయువులు.” (జెకర్యా.6:5)

“వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీ యొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా? అని వేడుకొనిరి.” (సం.కాం.16:22)
“అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.”
(సం.కాం.27:15)

“నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు.” (యెషయా.54:5)

“నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” (యిర్మీయా.32:27) 

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] కేవలం యూదులను మాత్రమేకాదు నరులందరిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టించాడు:

“దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.” (ఆది.కాం.1:26-27)

“ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను; మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.” (ఆది.కాం.5:1-2)

“నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింప బడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)

“దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.” (యాకోబు.3:9)

దేవుడు నరులందరిని ఆశీర్వదించి వారందరితో ఒక వాగ్ధానం చేశాడు:

మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.” (ఆది.కాం.9:1)

మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను.” (ఆది.కాం.9:8-10)

దేవుని నైతిక గుణలక్షణాలు

దేవుడు ప్రేమాస్వరూపి

ప్రభువైన దేవుని నైతిక గుణలక్షణాలలో ప్రేమ అతి ప్రాముఖ్యమైనది. ఉత్కృష్టమైన ప్రేమ త్యాగముతో ముడిపడి వుంటుంది. కృపాకనికరాలు ప్రేమలోని రెండు విభాగాలు. పరమతండ్రి తన సహజ గుణలక్షణమైన ప్రేమను తన స్వరూపమందు తన పోలికచొప్పున తానే సృష్టించిన మానవులందరికి పంచేవాడు. ఆ కారణాన్నిబట్టే ఆయన మానవుల కొరకు సిద్ధపరచిన రక్షణ అన్నది ఏ కొద్దిమంది కొరకో సిద్ధపరచబడింది కాదు. అది అందరి కొరకు ఏర్పాటుచేయబడిన దేవుని బహుమానము:

అతని యెదుట యెహోవా అతని దాటి వెళ్లుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.” (ని.కాం.34:6-7)

అందుకు యెహోవా నీవు కష్టపడకుండను పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో గానే వాడి పోయిన యీ సొరచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే; అయితే నూట ఇరువదివేలకంటె ఎక్కువై, కుడియెడమలు ఎరుగని జనమును బహు పశువులును గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా [חוּס/khoos = to pity; look upon with compassion]? అని యోనాతో సెలవిచ్చెను.” (యోనా.4:10-11)

ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై” (తీతుకు.2:11)

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను.3:16)

నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.” (1యోహాను.2:1-2)

కాబట్టి మీరు వెళ్లి, సమస్తజనులను [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు” (మత్తయి.28:19)

మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.” (మార్కు.16:15-16)

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.” (రోమా.10:12)

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది.” (రోమా.1:16)

మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల, అనగా యూదులలోనుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మనయెడల, తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?” (రోమా.9:23-24)

దేవుడు పక్షపాతి కాదు

దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనము [గ్రీకు మూల పదం: ἔθνος/ఎత్నోస్ = జాతి/ప్రజ/జనాంగము] లోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపో.కా.10:34-35)

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పునొందుదురు.” (రోమా.2:11-12)

ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.” (అపో.కా.17:30)

ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు.” (1తిమోతి.2:3-4)

కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2పేతురు.3:9)

ప్రభువైన దేవుని [అదొనై ఎలోహిం] యొక్క రక్షణతోకూడిన ఆశీర్వాదాల ప్రణాలిక కేవలం యూదులకు మాత్రమేగాక భూలోకములోని వంశాలన్నింటికి చెందినది:

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా” (ఆది.కాం.12:3) = (అపో.కా.3:25-26)

అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ]. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును [גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.18:18)

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని నములన్నియు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.” (ఆది.కాం.22:18) = (గలతి.3:8)  “ఏలయనగా నీకును నీ సంతానమునకును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఇచ్చెదను. నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] సమస్త భూలోకములోని సమస్త జనులు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడుదురు.” (ఆది.కాం.26:4) = (గలతి.3:16)

నీ సంతానము [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీ మూలముగాను నీ సంతానము [זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] మూలముగాను ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.28:14) = (ప్రకటన.7:9)

భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] నీ రక్షణ తెలియబడునట్లును” (కీర్తన.67:2) = (తీతుకు.2:11)

యెహోవా తన రక్షణను వెల్లడిచేసి యున్నాడు అన్యజనుల [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] యెదుట తన నీతిని బయలుపరచియున్నాడు.ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.” (కీర్తన.98:2-4)

సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచి యున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.” (యెషయా.52:10) = (లూకా.3:6)

విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను [נֵכָר/నెకార్] నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు [עַם/అం] ప్రార్థనమందిరమన బడును. ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికిపైగా ఇతరులను కూర్చెదను.” (యెషయా.56:6-8)

వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసేయున్నవి అప్పుడు సమస్త జనములను [כָּל־ הַגּוֹיִ֖ם/కాల్ హగ్గోవ్యిం–హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] ఆయా భాషలు మాట లాడువారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారియెదుట ఒక సూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకొనినవారిని విలుకాండ్రైన తర్షీషు పూలు లూదు అను జనులయొద్దకును [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] తుబాలు యావాను నివాసులయొద్దకును నేను పంపెదను నన్నుగూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసులయొద్దకు వారిని పంపెదను వారు జనములలో [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుఱ్ఱములమీదను రథములమీదను డోలీలమీదను కంచరగాడిదలమీదను ఒంటెలమీదను ఎక్కించి సర్వజనములలోనుండి [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చు చున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు [כָל־ בָּשָׂר/కాల్ బాసార్] వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా.66:18-23)  

అన్యజనుల ప్రవేశం

వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.” (ద్వి.కాం.32:21)

ఆ దినమున ఐగుప్తుదేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దునొద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన యొక స్తంభమును ఉండును. అది ఐగుప్తుదేశములో సైన్యములకధిపతియగు యెహో వాకు సూచనగాను సాక్ష్యార్థముగాను ఉండును. బాధకులనుగూర్చి వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన యొక రక్షకుని పంపును అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలిసికొనునట్లు యెహోవా తన్ను వెల్లడిపరచుకొనును ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలిసి కొందురు వారు బలి నైవేద్యముల నర్పించి ఆయనను సేవించెదరు యెహోవాకు మ్రొక్కుకొనెదరు తాము చేసికొనిన మ్రొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తునుండి అష్షూరుకు రాజమార్గ మేర్పడును అష్షూరీయులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచు పోవుచునుందురు ఐగుప్తీయులును అష్షూరీయులును యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతోకూడ ఇశ్రాయేలు మూడవ జనమై భూమిమీద ఆశీర్వాద కారణముగ నుండును. సైన్యములకధిపతియగు యెహోవా నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పనియైన అష్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును.” (యెషయా.19:19-25)

నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.” (యెషయా.65:1)

నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.” (యెహెజ్కేలు.16:60-61)

తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతునుఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరును రక్షింపబడుదురు.” (యోవేలు.2:28 -32)

సహోదరులారా, మీదృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలిసికొనగోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగువరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులోనుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.” (రోమా.11:25-27)

అబ్రహాము మరియు యూదులు

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] అబ్రహాము మానవులందరిలో గొప్పవాడని లేక ప్రత్యేకమైనవాడని లేక నీతిమంతుడని ఎన్నుకోలేదు. తన సార్వభౌమత్వము, చిత్తము, మరియు స్వాతంత్ర్యమును బట్టి అబ్రహామును ఎన్నుకున్నాడు. ప్రభువైన దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు గనుక అబ్రహాము గొప్పవానిగా మరియు ప్రత్యేకమైనవ్యక్తిగా మారాడు.      

ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] అబ్రహామును ఎన్నుకోవడములోని ఉద్దేశము కేవలము అబ్రహామును మరియు ఆయన సంతానాన్ని [ఇశ్రాయేలీయులు/యూదులు] మాత్రమే ఆశీర్వదించాలని లేక రక్షించాలని కాదు. సర్వశరీరులకు దేవుడైన ప్రభువు తాను సృష్టించిన మానవులందరిని ఆశీర్వాదించి అందరిని రక్షించాలన్న బృహత్ప్రణాళికతో అబ్రహామును ఎన్నుకొని ఆయన సంతానముద్వారా తన బృహత్ప్రణాళికను నెరవేర్చ సంకల్పంచినట్లు లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా అబ్రహాము సంతానమును ఎన్నుకొని వారిపట్ల వ్యవహరించిన తన విధానముద్వార ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] తననుతాను మానవాళికి ప్రత్యక్షపరచుకోవటం జరిగింది. క్రింది లేఖనాలే యిందుకు సాక్ష్యం: 

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా” (ఆది.కాం.12:3) = (అపో.కా.3:25-26)

అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ]. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును [גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.18:18)

మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy/గొయీ = nation/people/జనాంగము/ప్రజ] నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.” (ఆది.కాం.22:18) = (గలతి.3:8)  

ఏలయనగా నీకును నీ సంతానమునకును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] ఇచ్చెదను. నీ సంతానమువలన [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] సమస్త భూలోకములోని సమస్త జనులు [హీబ్రూ మూలపదము: גּוֹי/goy=nation/people/జనాంగము/ప్రజ] ఆశీర్వదింపబడుదురు.” (ఆది.కాం.26:4) = (గలతి.3:16)

నీ సంతానము [హీబ్రూ మూలపదము: זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు [హీబ్రూ మూలపదము: מִשְׁפָחָה/mishpawkhaw/మిష్పఖ = a clan/కుటుంబాల సమూహము/తెగ] నీ మూలముగాను నీ సంతానము [זֶרַע/zera/జెరా = విత్తనము/బీజము] మూలముగాను ఆశీర్వదింపబడును.” (ఆది.కాం.28:14) = (ప్రకటన.7:9)

పై కారణాన్నిబట్టి యూదులు గొప్పవారని లేక ప్రత్యేకమైనవారని లేక నీతిమంతులని ప్రభువైన దేవుడు [అదొనై ఎలోహిం] వారిని ఎన్నుకోలేదు అన్నది ప్రస్పుటమవుతున్నది. ప్రభువైన దేవుడు వారిని ఎన్నుకోవటాన్నిబట్టి వారు ప్రత్యేకమైన ప్రజగా గొప్పవారిగా మారారు. అయితే శోచనీయమైన విశయం ఏమిటంటే యూదులు పదేపదే తమ తిరుగుబాటుతనముతో అవిశ్వాసముతో ప్రభువైన దేవునితో చేయబడిన నిబంధనను కాలరాచి తమ కివ్వబడిన ప్రత్యేకతను గొప్పతనాన్ని పోగొట్టుకున్నారు. దాని పర్యవసానమే ఇశ్రాయేలీయులు లేక యూదులు ప్రపంచములో చెదరగొట్టబడటము.      

యూదులు తమ దేశములోనుండి అన్యదేశాలలోకి చెదరగొట్టబడటము అన్నది చరిత్రలో రెండుసార్లు సంభవించిన సంఘటన. 586 క్రీ.పూ. లో మొదటిసారిగా బబులోనురాజు నెబుకద్నెజర్ యూదులను చెరపట్టి తీసుకువెల్లాడు. 70 సంవత్సరాల తరువాత యూదులు తిరిగి తమ దేశానికి రావడం మొదలైంది. అటుతరువాత రెండవసారిగా 70 క్రీ.శ. లో రోమా సైన్యాధిపతి టైటస్ ఆధ్వర్యములో యెరూషలేములోని దేవుని మందిరము ద్వంసము చేయబడి లక్షకు పైగా యూదులు ఊచకోతకు గురికాగా మిగతా యూదులు యితరదేశాలకు చెదరగొట్టబడ్డారు.  

రెండు పర్యాయాలు సంభవించిన యూదులు చెదరగొట్టబడటము అన్నది దేవుని సంకల్పములో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ సంఘటన యొక్క రెండు సందర్భాలమధ్య ఒక విశిష్టమైన ప్రవచన నెరవేర్పును చూస్తాము. అది వాగ్ధానము చేయబడిన మెస్సయ్య యొక్క మొదటి ఆగమనము!  

మెస్సయ్య

మెస్సయ్య అంటే అభిషిక్తుడు. పాతనిబంధన లేఖనాల బోధ ప్రకారం ప్రవక్తలు, యాజకులు, మరియు రాజులు అభిషేకించబడినవారై తమకివ్వబడిన పాత్రలలో బాధ్యతలను నిర్వర్తించేవారు.

పాతనిబంధన లేఖనాలు [తనాఖ్] రాబోవు మెస్సయ్య ఇశ్రాయేలీయుల వంశానికి మోషేవంటి ప్రవక్తగా విచ్చేయబోతున్నాడన్న సత్యాన్ని మోషే కాలములోనే ప్రకటించాయి (ద్వి.కాం.18:15-19). ఇంకా, ఆయన తన ప్రజలపక్షంగా ప్రయశ్చిత్తార్థ బలిగా తననుతానే అర్పించుకొని మృత్యుంజయుడై (యెషయా.52:13-53:12; దానియేలు.9:26-27) మెల్కీసెదెకు క్రమములో వారిని పవిత్రపరచబోతున్న యాజకుడని (కీర్తన.110:4), అంతమాత్రమేగాక తన ప్రజలైన యూదులతోపాటు భూలోకములోని జనులందరిని పాలించే రారాజు (యెషయా.9:6-7; జెకర్యా 9:9-11; మీకా.5:2) అన్నది లేఖనాలు నిర్ద్వంద్వంగా సాక్ష్యమిస్తున్నాయి.

పాతనిబంధన గ్రంథము లేక తనాఖ్ గ్రంథములోని లేఖనాలలో భవిష్యవాణిద్వారా వాగ్ధానము చేయబడిన మెస్సయ్య పాత్ర ఈరకంగా అభిషేకాలతో కూడిన మూడు పాత్రల సమిష్టి నెరవేర్పు అన్నది లేఖన బోధ.

దైవసుతుడైన మెస్సయ్యను పాతనిబంధన లేఖనాలు ‘దేవుని సేవకుడు,’ ‘దేవుని కుమారుడు,’ ‘దేవుని వాక్కు,’ ‘నిబంధన దూత’ అంటూ సందర్భానుసారంగా ప్రత్యేకమైన బిరుదులతో పేర్కొనడం గమనార్హమైన విశయం.   

మెస్సయ్య ప్రారంభములో ప్రవక్తగా దైవసందేశాన్ని బోధిస్తూ పరమతండ్రి నిర్ణయించిన సమయములో మానవాళి తరపున యాజకునిగా తన్నుతాను పాపపరిహారార్థబలిగా అర్పించుకున్నాడు. ఇది భూలోకపు చట్టాలను ప్రతిబింబిస్తూ ప్రభుత్వాల అధికారాన్ని నిర్ధారిస్తూ నెరవేర్చబడిన కార్యం ఎంతమాత్రము కాదు. ప్రభువైన దేవుని చట్టపరిధిలో ఆయన నిత్యసంకల్పాన్ని బట్టి ఆయన ఆధ్వర్యములో వాస్తవరూపం దాల్చిన రక్షణకార్యం!

మృత్యుంజయుడైన మెస్సయ్య పరమతండ్రి యొక్క నియామక కాలములోనే రాజుగా భూలోకమంతటిని పాలించటానికి తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయ!

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. జీవవృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు.” (ప్రకటన.22:12-14)

Views: 293